Publish Date:Sep 19, 2024
వైసీపీ కబంద హస్తాల నుంచి బుధవారం నాడు విముక్తి పొందిన ప్రకాశం జిల్లా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరబోతున్నారన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ని గురువారం నాడు కలిశారు. ఈ భేటీ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయగా, పవన్ కళ్యాణ్ ఆయనని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
లంకలో పుట్టినవాళ్ళందరూ రాక్షసులు కావచ్చేమోగానీ, వైసీపీలో వున్నవాళ్ళందరూ దుర్మార్గులు కాకపోవచ్చు. ఎందుకంటే, విలువలకు కట్టుబడి వున్న బాలినేని లాంటివాళ్ళు ఆ పార్టీలో చాలామంది వున్నారు. పొయ్యి సెగ పొంతకి తగిలినట్టు జగన్ మీద వున్న తీవ్ర ప్రజా వ్యతిరేకత ప్రభావం వాళ్ళమీద పడి వైసీపీలో వున్న ఉత్తములు కూడా ఓడిపోయారు. అలాంటి వారిలో బాలినేని కూడా ఒకరు. జగన్‌తో బంధుత్వం వున్నా బాలినేని జగన్ ఆడమన్నట్టుగా ఆడేవారు కాదు. వాగమన్నట్టుగా వాగేవారు కాదు. మాటలో హుందాతనం, పద్ధతి వుండాలని అనేవారు. ఇంతకాలంపాటు వైసీపీలో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఇప్పటికి ఆయన బయటపడ్డారు. గురువారం నాడు బాలినేని పవన్ కళ్యాణ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన పార్టీలో చేరే ముహూర్తం మాత్రం ఈనెల 22 ఫిక్స్ చేవారు. ఆరోజున బాలినేనితోపాటు
జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా జనసేన పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/balineni-met-pawan-kalyan-25-185154.html
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.