పవన్ తో బాలినేని భేటీ ఎందుకంటే?

Publish Date:Jan 24, 2025

Advertisement

ప్రకాశం జిల్లాలో వైసీపీ అడ్రస్ గల్లంతైపోనుందా? ఆ పార్టీ జెండా కూడా ఇకపై కనిపించే అవకాశం లేదా? అంటే ఔనన్న సమాధానమే వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు. వైసీపీ అధినేత జగన్ కు బంధువైన బాలినేని జగన్ అధికారంలో ఉన్నంత కాలం వైసీపీలోనే ఉన్నారు. వాస్తవానికి జగన్ సొంతంగా వైసీపీ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు కాంగ్రెస్ ను వీడి బాలినేని కూడా జగన్ తో అడుగు కలిపి నడిచారు. అంత వరకూ బాగానే ఉంది. ఎప్పుడైతే జగన్ అధకారంలోకి వచ్చిన మూడేళ్లకు తన మంత్రివర్గాన్ని విస్తరించారో.. అప్పటి నుంచే బాలినేనిలో అసంతృప్తి మొలకెత్తింది.

ఎందుకంటే 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కేబినెట్ లో బాలినేనికి చోటు ఇచ్చారు. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బాలినేని మంత్రి పదవిని పీకేశారు. అదే సమయంలో అదే జిల్లాకు అంటే ప్రకాశం జిల్లాకు చెందిన మరో మంత్రిని మాత్రం కొనసాగించారు. ఇది సహజంగానే బాలినేనిలో అసంతృప్తికి, అసమ్మతికి కారణమైంది. అప్పటి నుంచీ బాలినేని వైసీపీలో కొనసాగినా, సొంత పార్టీలోనే అసమ్మతి వాదిగా మిగిలిపోయారు. జగన్ పొమ్మనకపోయినా, బాలినేనికి పార్టీలో అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. మెడపట్టి గెంటినా చూరుపట్టుకు వేళాడిన చందంగా ఆయన  వైసీపీలో కొనసాగారు. ఇక 2024 ఎన్నికలకు ముందు బాలినేనికి ఒంగోలు అసెంబ్లీ టికెట్ వస్తుందా? అన్న అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి. ఎలాగోలా టికెట్ సంపాదించుకున్నప్పటికీ ఆ ఎన్నికలలో బాలినేని పరాజయం పాలయ్యారు. ఆ తరువాత ఆయన తన ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. అయితే తన ఫిర్యాదుకు పార్టీ నుంచి ఎటువంటి మద్దతూ రాకపోవడంతో ఆయన ఇక లాభం లేదనుకుని జనసేన గూటికి చేరారు. 

ఆర్భాటంగా జనసేన ఎంట్రీ కోసం బాలినేని తహతహలాడినప్పటికీ జనసేనాని పవన్ కల్యాణ్ అందుకు అంగీకరించలేదు. ఒంగోలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, దానికి పవన్ ను ఆహ్వానించి తన అనుచరులతో భారీగా కార్యక్రమం నిర్వహించాలని భావించిన బాలినేనికి పవన్ కల్యాణ్ చెక్ పెట్టారు. ఒంటరిగా మంగళగిరి జనసేన కార్యాలయానికి వచ్చి పార్టీ కండువా కప్పుకుని వచ్చామా.. చేరామా అన్నట్లుగా కార్యక్రమాన్ని ముగించాలన్న పవన్ ఆదేశాల మేరకు బాలినేని అతి నిరాడంబరంగా జనసేన గూటికి చేరారు. 

ఇక ఇప్పుడు బాలినేనికి అవకాశం వచ్చింది. బాలినేని మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో  గురువారం (జనవరి 23) భేటీ అయ్యారు. ఈ భేటీలో బాలినేని మళ్లీ ఒంగోలులో బారీ బహిరంగ సభ ప్రస్తావన తీసుకువచ్చారు. ఆ సభకు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారు. అందుకుపవన్ సానుకూలంగా స్పందించారని సమాచారం. ఒంగోలు వేదికగా బాలినేని భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ వేదికపై తన అనుచరులు పెద్ద ఎత్తున జనసేనలో చేర్చించాలని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఒంగోలులో భారీ బహిరంగ సభకు వస్తే.. ఇక ప్రకాశం జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోవడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే బాలినేనికి ఒక్క ఒంగోలు నియోజకవర్గంలోనే కాదు మొత్తం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గట్టి పట్టు ఉంది. వాస్తవానికి బాలినేని జనసేన గూటికి చేరిన సమయంలోనే ఆయన అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో జనసేన తీర్ధం పుచ్చుకోవాల్సి ఉంది. అప్పట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో బాలినేని వారిని వారించారు. ఇక ఇప్పుడు అలా వారించే పరిస్థితి లేదు. ఆయనపై అనుచరుల ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ తో తన అనుచరుల చేరిక గురించి మాట్లాడారని, ఫిబ్రవరి 5న ఒంగోలులో భారీ బహిరంగ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో వారిని పార్టీలో చేర్చుకోవాలన్న బాలినేని ప్రతిపాదనకు పవన్ అంగీకరించినట్లు సమాచారం.

అదే జరిగితే ప్రకాశం జిల్లాలో వైసీపీ అడ్రస్ గల్లంతైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ముఖ్యంగా ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గిరి సహా వైసీపీ కార్పొరేటర్లంతా జనసేన గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నారనీ, అలాగే జిల్లా నలుమూలల నుంచీ కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ క్యాడర్ జనసేన కండువా కప్పుకుంటారని అంటున్నారు. అంటే జనసేనాని ఒంగోలులో బాలినేని ఏర్పాటు చేసే సభకు రావడం అంటూ జరిగితే ప్రకాశం జిల్లాలో వైసీపీ గాయబ్ అయిపోవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 2024 ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మక మార్పును తీసుకువచ్చాయి.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన మలుపుల మధ్య సాగుతోంది.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు...కూటమి ప్రభుత్వానికి రాజకీయ సవాల్..
మొత్తంగా ముచ్చటగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ తన కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని అంటున్నారు. మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోడీ సోమవారం (జూన్ 29) క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు.
జగన్ కోసం ముద్రగడ తన సొంత సామాజిక వర్గం వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. జగన్ కనీసం ఆయనను పరామర్శిండానికి కూడా రాకపోవడంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు.
ఆ అమ్మాయి నోట జగన్ సార్ అనే మాట రాగానే.. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనంటూ వైఎసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడింది వైఎస్ జగనేనంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రెడిట్ చోరీపై కిరాక్ ఆర్పీ సాక్ష్యాలను చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు.
ఈ శిలాఫలకంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు ఎక్కడా కనిపించలేదు. ఈ వింత పరిస్థితిని గమనించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ఉత్సాహంగా కార్యక్రమానికి వచ్చిన ఆయన, ఆ శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో నిరాశకు లోనయ్యారు.
కాంగ్రెస్ నేతల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి..
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని మలుపులు చోటుచేసుకుంటూనే ఉంటాయి
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.