జగన్ తో ఢీ అంటే ఢీ.. బాలినేని తెగించేశారు!?

Publish Date:Dec 13, 2023

Advertisement

బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఏపీలో రాజకీయాలతో ఏ కొంచం పరిచయం ఉన్నవారికైనా బాగా తెలిసిన పేరు. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేనికి వైసీపీ పొమ్మనలేక పొగపెడుతోందని ఇంత వరకూ పరిశీలకులు ఆయనకు పార్టీలో ఎదురౌతున్న అవమానాలు, అధిష్టానం ఆయన పట్ల వ్యవహరిస్తున్న తీరును పేర్కొంటూ విశ్లేషణలు చేస్తూ వచ్చారు. అయితే ఇక ఇప్పుడు బాలినేని బాహాటంగా వైసీపీపై తిరుగుబాటు చేసేశారు. అలా అనేకంటే జగన్ పై తిరుగుబాటు ప్రకటించేశారు అనడం సరిగ్గా ఉంటుంది.

గత కొంత కాలంగా బాలినేనిని పార్టీ అధిష్ఠానం అడుగడుగునా అవమానిస్తూ వచ్చింది. ఆయన అలిగి మీడియాకు ఎక్కగానే తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని బుజ్జగిస్తూ వస్తోంది. పదే పదే ఇలా జరగడంతో  వైసీపీ మెడపట్టి బయటకు గెంటేస్తుంటే.. బాలినేని చూరుపట్టుకు వేళాడుతున్నారా అన్న అనుమానాలూ వ్యక్తం చేశారు. అసలు వైసీపీలో బాలినేని ఎపిసోడ్ కు ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటే ఆయన పార్టీ అధినేత జగన్ కు బంధువు. ఆ కారణంగానే బాలినేనికి సంబంధించిన ఏ చిన్న  అంశానికైనా రాజకీయ వర్గాలూ, మీడియా కూడా అంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఇప్పుడిక బాలినేని రెఢీ అయిపోయారు. వైసీపీతో, ఆ పార్టీ అధినేతతో యుద్ధానికి సిద్ధమైపోయారు. తాజాగా ఆయన తనకు తాను పార్టీ టికెట్ ప్రకటించుకుంటూ చేసిన ప్రకటన ఒక విధంగా జగన్ కు సవాల్ విసిరినట్లుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంత కాలం ఉత్తుత్తి బుజ్జగింపులతో కాలం గడిపేసిన అధిష్ఠానానికి ఇక ఆ ఆవకాశం లేకుండా బాలినేని సవాల్ ఉంది. ఇప్పుడిక బంతి వైసీపీ కోర్టులో ఉంది. జగన్ కు బాలినేనిని పార్టీ నుంచి బహిష్కరించడమో.. లేక ఆయనను పార్టీ ఒంగోలు అభ్యర్థిగా ప్రకటించడమో తప్ప మరో ఛాయస్ లేకుండా పోయింది. 

తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్న బాలినేని.. ఆ సందర్భాన్నే తన బలాన్ని ప్రదర్శించేందుకు వేదికగా ఉపయోగించుకున్నారు. ఆ వేదికపై నుంచీ ఒంగోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉండేది తానేనని ప్రకటించేశారు.  తన అభ్యర్థిత్వాన్నే కాకుండా ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎవరో కూడా ఆయనే ప్రకటించేశారు. ఒంగోలు నుంచి ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ చేస్తారని చెప్పారు. బాలినేని చేసిన ఈ ప్రకటన  వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీతో సంబంధం లేకుండా, పార్టీ పెద్దలతో, మరీ ముఖ్యంగా జగన్ తో కనీసం చర్చించకుండా, సంప్రదించకుండా బాలినేని చేసిన పోటీ ప్రకటన.. ఆయన ఇక తాడో పేడో తేల్చేసుకోవడానికి రెడీ అయిపోయారని స్పష్టం చేసింది.  అలాగే బాలినేనికి ఇప్పటి వరకూ ప్రకాశం జిల్లాలో  అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న వైవీ సుబ్బారెడ్డికీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అన్నిటికీ మించి వైసీపీకి ఇప్పటికే ఉన్న రెబల్ రఘురామ రాజు తరహాలో మరో రెబల్ ఉద్భవించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఒంగోలు అభ్యర్థిని తానేనని బాలినేని ప్రకటించిన తరువాత ఇక ఆయనకు  గత్యంతరం లేని స్థితిలో పార్టీ టికెట్ ఇచ్చినా? లేక ధిక్కారాన్ని సహింతునా? అన్నట్లు పార్టీ నుంచి బహిష్కరించినా జగన్ కు జగన్ పార్టీకీ  ఇబ్బందులు తప్పవనీ, పార్టీని, పార్టీ అధినేతను ఇరుకున పెట్టేలా బాలినేని ఇక విమర్శలు గుప్పించడం ఖాయమనీ అంటున్నారు.  జగన్ చేజేతులా పార్టీలో మరో రఘురామరాజు వంటి రెబల్ ను తయారు చేసుకున్నారనీ, ముందుముందు అందుకు ఫలితం అనుభవించక తప్పదనీ అంటున్నారు.

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.