Publish Date:Sep 12, 2024
వైసీపీలో బాలినేని ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడిపోయినట్లేనా? ఆయన వద్దనుకున్నారా? జగనే వద్దన్నారా అన్న విషయంలో సందేహాలు ఉంటే ఉండొచ్చు కానీ బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పడం మాత్రం ఖాయమైపోయింది. తాను వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్న విషయాన్ని స్వయంగా బాలినేనే తన అనుచరులకు చెప్పేశారు. దీంతో ఇహనో ఇప్పుడో ఆయన వైసీపీకి రాజీనామా చేయడం ఖాయం. అ
సలు వైసీపీలో బాలినేని గత మూడేళ్లుగా హాఫ్ రెబల్ గానే కొనసాగుతున్నారు. ఇటు బాలినేనికీ, అటు వైసీపీ అధినేతకూ కూడా పరస్పర అవసరాలు ఉన్నాయి. పైపెచ్చు ఇరువురూ బంధువులు కూడా. అయినా బాలినేనికి పొమ్మనకుండా పార్టీలో పొగపెట్టడం అన్నది గత కొన్నేళ్లుగా నిరాటంకంగా సాగుతూ వస్తోంది. ఇది ఎప్పుడు మొదలైందంటే.. జగన్ తాను అధికారం చేపట్టిన తరువాత దాదాపు మూడేళ్లకు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఆ పునర్వ్యవస్థీకరణలో బాలినేని మంత్రి పదవినుంచి తొలగించారు. అదే సమయంలో ఆయన జిల్లాకే చెందిన మంత్రిని మాత్రం కొనసాగించారు. ఇది బాలినేనిలో అసంతృప్తికి బీజం వేసింది.
అప్పటి నుంచీ ఆయన పార్టీకి, పార్టీ అధినేత జగన్ కు పంటికింద రాయిలా, చెవిలో జోరీగలా ఇబ్బందులు పెడుతూ వచ్చారు. అయితే జగన్ పొమ్మన్న ప్రతి సారీ బాలినేని చూరుపట్టుకు వెళాడారు. అలాగే బాలినేని పార్టీకి గుడ్ బై చెబుతానంటే అల్టిమేటం ఇచ్చిన ప్రతి సారీ జగన్ తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని బుజ్జగించారు. ఎందుకంటే బాలినేనికి ప్రకాశం జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఇక బాలినేని ఎందుకు పార్టీని వదలకుండా వేళాడారంటే.. ఆయనను మరే రాజకీయ పార్టీ చేర్చుకునే అవకాశాలు లేవు. దీంతో బాలినేని జగన్ మధ్య ఇన్నేళ్లూ టామ్ అండ్ జెర్రీ ఆట సాగుతూనే వచ్చింది.
అయితే 2024 ఎన్నికలలో వైసీపీ, బాలినేని కూడా పరాజయం పాలవ్వడంతో ఇక ఒకరి అవసరం ఒకరికి లేకుండా పోయింది. మరో ఐదేళ్ల వరకూ ఎన్నికలు లేకపోవడంతో బాలినేనికి వెంటనే రాజకీయ ఆశ్రయం దొరికి తీరాల్సిన పరిస్థితి కూడా లేకపోవడంతో ఆయన ఇక వైసీపీకి గుడ్ బై చెప్పడమే మేలన్న నిర్ణయానికి వచ్చేశారు. అందుకే సమయం చూసుకుని జగన్ కు షాక్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే పార్టీలోనే ఉంటూ రోజుకో విమర్శ, పూటకో డిమాండ్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తు న్న బాలినేని పార్టీ నుంచి ఎగ్జిట్ అవ్వడంతో జగన్ కూడా హమ్మయ్యా అనుకునే పరిస్థితి ఉందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/balineni-decided-to-quit-ycp-25-184672.html
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News