బాలకృష్ణ హెల్త్ బులెటిన్ విడుదల..ఎలా ఉన్నారంటే..?

Publish Date:Jul 22, 2026

Advertisement

 

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రమాదానికి గురై ఎడమ మోకాలికి గాయపడ్డారు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న చిత్రీకరణలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే చిత్రబృందం ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య పరీక్షలు, ప్రత్యేక చికిత్స అవసరమని భావించిన వైద్యులు బాలకృష్ణను ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్‌లోని ఏఐజీ (AIG) ఆస్పత్రికి తరలిం చారు. ఏఐజీ ఆస్పత్రి బుధ వారం విడుదల చేసిన మెడికల్ బులెటిన్ ప్రకారం, బాలకృష్ణ ఎడమ మోకాలి చుట్టూ రక్తం గడ్డకట్టడం (హీమటోమా), మృదు కణజాలాల్లో వాపు ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో గుర్తించారు.

అంతేకాకుండా మోకాలి భాగంలోని కండరాలు చిట్లి ఉండే (మసిల్ టియర్) అవకాశం కూడా ఉందని వైద్యులు పేర్కొన్నారు. గాయం తీవ్రతను పూర్తిగా నిర్ధారించేందుకు ఎంఆర్ఐ సహా ఇతర ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం బాలకృష్ణకు ఆర్థోపెడిక్ నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఆయన గత వైద్య చరిత్రను కూడా పరిశీలిస్తూ, అవసరమైతే ఇతర విభాగాల నిపుణులతో సమన్వయం చేసి చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆస్పత్రి తెలిపింది. అన్ని పరీక్షల నివేదికలు అందిన అనంతరం గాయానికి సంబంధించిన తుది నిర్ధారణ చేసి, శస్త్రచికిత్స అవసరమా లేదా మందులు, ఫిజియోథెరపీతోనే చికిత్స కొనసాగించాలా అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది.

ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఆయనను నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్య పరిస్థితిపై తదుపరి వివరాలను పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత వెల్లడిస్తామని ఏఐజీ ఆస్పత్రి మెడికల్ బులెటిన్‌లో పేర్కొంది. బాలకృష్ణ గాయపడిన విషయం తెలిసిన వెంటనే అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. మరోవైపు, ఈ ఘటన కారణంగా ప్రస్తుతం జరుగుతున్న సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా విరామం ఇచ్చినట్లు సమాచారం.

Balakrishna Health Bulletin released, Film shooting, AIG Hospital, Hematoma, NBK111 shooting injury, Balakrishna health update, CM Chandrababu, Naralokesh, TDP
 

By
en-us Political News

  
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
కన్యాకుమారి యూట్యూబర్ ఇంట్లో ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారం, భారీగా నగదు చోరీకి గురయ్యాయి. సోషల్ మీడియాలో రీల్స్ కోసం చూపించిన సంపదే దొంగలను ఆకర్షించిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నింబోలి అడ్డాలో చిన్నారి బాలుడిపై దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల చర్యల కథనం.
హైదరాబాద్ ఐటీ హబ్ మాదాపూర్‌లోని ఒక ఓయో హోటల్ గదిలో యువతి దారుణంగా హత్యకు గురైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో ఒక ఆటో డ్రైవర్ దారుణంగా హత్యకు గురయ్యారు. ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహం తరలింపు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందాల గాలింపు మరియు హత్యకు గల కారణాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.