అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడంపై హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి అంటూ చేసిన ఓ ట్వీట్ లో.. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు.
అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని చిరకాల స్వప్నాన్ని సాకారం చేయడంలో సహకరించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు, ఎంపీలకూ, ఆంధ్రప్రదేశ్ పౌరులందరికీ హృదయపూర్వక కృతజ్ణతలు తెలిపారు. అమరావతికి చట్టబద్ధతతో పెట్టుబడిదారులకు భరోసా కలుగుతుందన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/balakrishna-delight-on-gezitte-amarawathi-25-216818.html
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.