బాలయ్యకు సాధ్యమైంది..పవనయ్యకు ఎందుకు కాదు?

Publish Date:Jul 27, 2025

Advertisement

 

బాలకృష్ణ కూడా సినీ పొలిటీషియనే. ఆయనా హిందూపూర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. ఇటు రాజకీయాల్లో ఉంటూనే అటు వరుస సినిమాలు చేస్తున్నారు. బాలకృష్ణ లాస్ట్ హిట్ మూవీస్ ఏంటో చూస్తే.. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహరాజ్. అఖండ 2 ఫీవర్ లో ఉన్నారాయన అభిమానులు. తర్వాత కూడా మరో చిత్రానికి సంబంధించి కథా చర్చలు నడుస్తున్నాయి. హెక్ టిక్ బిజీ షెడ్యూల్. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయాలేంటని చూస్తే నాలుగు సినిమాలు- నాలుగు వరుస సెంచురీలు. అఖండ నుంచి డాకూ వరకూ వంద కోట్లు క్రాస్ చేసిన సినిమాలే.

ఇంత పక్కా ప్లానింగ్ ఎలా సాధ్యం? అని చూస్తే బాలకృష్ణ ఇటు సినిమాలు, అటు రాజకీయాలను ఇంత వయసులోనూ సమన్వయం చేసుకోవడంలో ఆరితేరిపోయారనే చెప్పాలి. అదే పవన్ అలాక్కాదు.. పుష్కరకాలంగా రెండు పడవలపై కాళ్లు. వాటిలో రాజకీయాల్లో పడుతూ లేస్తూ ఎలాగోలా నేడు ఆయన తొలిసారి గెలవడం మాత్రమే కాకుండా డిప్యూటీ సీఎం, ఆపై నాలుగు మంత్రిత్వాలు నెరుపుతున్నారు. కాదనడం లేదు. టైం లేదు. బిజీ బీజీ. ఉదయాన్నే ఎక్కిన హెలికాప్టర్ రాత్రి దిగే హెలికాప్టర్ మధ్య విమానయానం.. నానా రకాల హంగామా. ఈ బిజీ పొలిటికల్ షెడ్యూల్లో ఆయన సినిమాలకు ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నారు.

అదే బాలయ్య అలాక్కాదు. మొన్న మహానాడును కూడా వదులుకుని అఖండ 2 షూట్ కోసం ఫారిన్ టూర్ వెళ్లారు. అంటే కొంత రాజకీయ త్యాగం చేస్తున్నారన్నమాట. మాములుగా అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ నాయకత్వంలోని కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత కడపలో పెట్టిన మహానాడు. ఆ కిక్కే వేరుగా ఉంటుంది. దాన్ని ఆస్వాదించాలని ఎవరికైనా ఉంటుంది. కానీ బాలయ్య బాబు అలాక్కాదు. ఆయన దేనికి ఎప్పుడు ఎలాంటి ప్రయారిటీ ఇవ్వాలో ఇవ్వడం బాగా తెలుసని అంటారు ఆయన అభిమానులు.

ఇదిలా ఉంటే పవన్, బాలయ్య లా ఒక పార్టీ ఎమ్మెల్యే మాత్రమే కాదు. జనసేనకు అన్నీ తానే. ఈ విషయంలో పవన్ కి ఉన్న వర్క్ లోడ్, బాలకృష్ణకు ఉండకపోవచ్చు. అయితే అందుకంటూ కూడా కొంత ప్లానింగ్ అవసరమే. రాజకీయాల్లో ఉంటూ కూడా ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ వంటి హిట్స్ ఇచ్చారు. ఇక బాలకృష్ణ సింహ నుంచి ఊపందుకున్న సెకండ్ ఇన్నింగ్స్ తర్వాతి కాలంలో తన స్థాయికి తగ్గట్టు హిట్లు నమోదు చేస్తూనే వస్తున్నారు. అదే పవన్ విషయంలో ఆయనకొక హిట్టు పడి.. పుష్కర కాలం దాటింది. అంటే 12 ఏళ్లు పూర్తి. అత్తారింటికి దారేది తర్వాత హిట్టే లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వరుసగా ఆరు ఫ్లాప్ లు. వీటిలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లాంటి కొన్ని మెరుపులున్నా.. అవేం అంత పెద్ద మేజర్ హిట్స్ కావు. 

పవన్ కన్నా చిన్న చిన్న వాళ్లు.. మరీ ముఖ్యంగా ఆ కాంపౌండ్ లోని అల్లు అర్జున్ పానిండియా స్టార్ గా తన కంటి ముందు ఎదుగుతూ వెళ్తున్నాడు. ఇటీవలి పుష్ప2 కూడా కాస్త డివైడ్ టాక్ వచ్చినా.. అది 2 వేల కోట్ల మేర వసూళ్లు సాగించిన చిత్రంగా టాలీవుడ్ రికార్డులకెక్కింది. 

ప్రస్తుతం పవన్ హరి హర వీరమల్లు విషయానికి వస్తే.. ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఫ్లాప్ షోగా భావిస్తున్నారు. ఆచార్య, భోళాశంకర్, మట్కా, గేమ్ ఛేంజర్, హరిహర వీరమల్లు.. అంటూ క్రోనాలజీ చెబుతున్నారు. ఇక నిర్మాత ఏఎం రత్నం అయితే ఏం సార్ మీరు హ్యాపీయేనా? అనడిగిన ప్రశ్నకు.. పాపం ఆయన మింగలేక కక్కలేక నానా అవస్తలు పడుతున్న దృశ్యం మెగా ఫ్యాన్స్ ని డైలమాలో పడేస్తోంది. మెగా ఫ్యామిలీలో చిరంజీవి తర్వాత ఆ రేంజ్ లో ఒక ఫ్లాగ్ షిప్ కెప్టెన్సీ నిర్వహిస్తున్న పవన్ నుంచి తాము ఇలాంటి ఫలితాలను ఆశించడం లేదని కుండబద్ధలు కొడుతున్నారు కొందరు. 

అంతేనా బాలయ్యను చూసి నేర్చుకోమని కూడా సూచిస్తున్నారు కొందరు. బాలయ్య బాబు మీ అంత బిజీగా లేకున్నా.. ఆయన కూడా సేమ్ టూ సేమ్ ఇటు సినీ కథానాయకుడు, అటు రాజకీయ నాయకుడే. మధ్యలో ఫ్యామిలీ ఎఫైర్స్, ఆపై బసవతారకం ట్రస్ట్, ఇంకా హిందూపూర్ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఎంతో చక్కగా హ్యాండిల్ చేస్తున్నారు. సినిమా తీయడం విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ఆపై కథలను కూడా పర్ఫెక్ట్ గా ఎంపిక చేసుకుంటున్నారు. అలాంటి ఫ్లో మెయిన్ టైన్ చేయాల్సింది పోయి.. మనమేం మాట్లాడినా వర్కవుట్ అవుతోంది కదాని చెప్పి.. ఎలా పడితే అలా సినిమా చూస్తారనడానికి లేదన్న హెచ్చరికలు అందుతున్నాయ్. ఇది పోతే పోయింది ఓజీ, ఉస్తాద్ ఉన్నాయని లైట్ తీస్కోడానికి లేదనీ.. చేస్తే పక్కాగా సినిమాలు చేయడం.. లేదంటే వాటిని పక్కన పెట్టి సీరియస్ పాలిటిక్స్ మీద దృష్టి సారించడం చేయాలన్న సలహా సూచనలు, స్వయానా ఆయన సైనికులు, వీర మహిళల నుంచే అందుతున్నాయ్..

లేకుంటే ఏంటీ రభస? పవన్ సినిమా కోసం ర్యాలీలు తీయడమేంటి? సినిమా చూడమని కూడా బలవంత పెట్టడమేంటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అయితే సినిమా టికెట్ ఫ్రీ పథకం ప్రవేశ పెట్టడంతో సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోల్ అవుతోంది. ఇదేంటి పవనన్నా.. సినిమా చూడ్డం ఏమీ స్కూలుకెళ్లడం లాంటి నిర్బంధ వ్యవహారం కాదే అని నిలదీస్తున్నారు.. కొందరు అభిమానులు. పవన్ సినిమా హిట్ చేయడం వల్ల లాభాలను ఏకరవు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక వేళ మీరు ఈ సమాజానికి ఏదైనా లబ్ధి చేకూర్చి పెట్టాలంటే నేరుగానే చేయవచ్చు. సినిమా రూపంలో దాన్ని చేయాల్సిన అవసరం లేదన సలహాలు అందుతున్నాయ్. మరి చూడాలి పవన్ ఇటు బాలకృష్ణలాంటి వారి నుంచి ఏదైనా నేర్చుకుంటారా? లేక సినిమాలు పక్కన పెట్టి సీరియస్ పాలిటిక్స్ మీద ఫోకస్ పెడతారా? తేలాల్సి ఉందంటున్నారు సైనికులు.
 

By
en-us Political News

  
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.