కరోనా కోరల్లో బాల్యం చిక్కకుండా

Publish Date:Aug 3, 2020

Advertisement

శతాబ్దాల తరబడి భారతదేశంలో పురుడుపోసుకున్న బాలకార్మిక వ్యవస్థ ఆంగ్లేయుల కాలంలో విజృంభించింది. ఆ తర్వాత దేశానికి స్వాతంత్య్రం రాగానే అనేక చట్టాలు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు రూపొందించారు. రాజ్యాంగ పరంగా నిర్భంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టారు. అయితే చట్టాలను చేసిన పాలకవర్గం వాటిని అమలు చేయడంలో శ్రద్ధ చూపించలేదు. ఫలితంగా  బాలల బంగారు భవిష్యత్ సమయం చిక్కినప్పుడల్లా ఫ్యాక్టరీల ఇసుప చక్రాల మధ్య, వస్తువుల తయారీ పరిశ్రమల్లో యంత్రాల మధ్య నలిగిపోతున్నే ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా బాల్యాన్ని కాలనాగులా కాసేందుకు కాపు కాస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నో స్వచ్చంధ సంస్థలు పోలీసు వ్యవస్థ బాలకార్మిక వ్యవస్థ బలోపేతంగా కాకుండా విసృత్తమైన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా లాక్ డౌన్ తో దేశం లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితి బాలకార్మిక వ్యవస్థ ను బలోపేతచేస్తుంది. లాక్ డౌన్ అనంతరం ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నంలో చాలా కుటుంబాల్లో  బాలలు పలకా పట్టాల్సిన చేతులతో పనిముట్లు పడుతున్నారు. ప్రమాదకరమైన పరిశ్రమల్లోనూ చేరుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్ది బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని అనేక స్వచ్చంధ సంస్థలు కోరుతున్నాయి. కరోనా నేపథ్యంలో పెరగనున్న బాలకార్మిక వ్యవస్థపై కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ దేశవ్యా ప్తంగా సర్వే నిర్వహించింది.  దేశవ్యాప్తంగా బాల కార్మికవ్యవస్థ, మాన వ అక్రమరవాణ, కార్మిక చట్టాల ఉల్లంఘన అంశాలపై 50మందికి పెగా ఎన్‌జిఒలు, వందలాది మంది ప్రతిస్పం దనను ఆధారంగా చేసుకుని ఈ సర్వే నివేదికను సత్యార్థి ఫౌండేషన్ రూపొందించింది. సర్వేలో 89 శాతం ఎక్జిఒ లు, ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.  ఈ నివేదికలోని వివరాల్లోకి వెళ్లితే ..

లాక్ డౌన్ ఎత్తి వేసిన అనంత రం బాలకార్మిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు పిల్లల అక్రమరవాణా పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమైంది.  లైంగిక దోపిడి కోసం పిల్లల అక్ర మరవాణా పెరిగే ప్రమాదం ఉందని ఈ సంస్థ పేర్కొంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే తీరుగా లే దు.  ఆయా రాష్ట్రాల పరిస్థితులు, మౌలికసదుపాయాలు, ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలను బట్టి కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ సమస్య ఉంది. కరోనా కారణంగా ఆయా రాష్ట్రాల్లో బాలల అక్రమ రవాణా పెరిగే అవకాశాలున్నాయి. కార్మిక చట్టాలు దుర్వినియోగం అయ్యే ప్రమా దం కూడా ఉందని ఈ నివేదికలో ఆందోళన వ్యక్తం చేశా రు. 

ఈ పరిస్థితి అరికట్టాలంటే  గ్రామస్థాయిలో ఎక్కుగా నిఘావ్యవస్థ పెంచాలని, చట్టా న్ని అమలు చేసే సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సామాజిక కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.  లాక్ డౌన్ అనంతరం బాల్యవివాహాలు కూడా పెరిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  పరిస్థితులను చక్కదిద్ది బాల్యాన్ని పరిశ్రమల్లో బందీ కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నారు.  గ్రామస్థాయిలో నిఘావ్యవస్థ  రూపొందించి చట్టాలను బలోపేతం చేయా ల్సిన అవసరం ఉందని కైలాష్ సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ అభిప్రాయ పడింది. గ్రామస్థాయిలో గ్రామ పంచాయి తీలు పిల్లలను పనుల్లోకి వెళ్లకుండా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అలాగే మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు తమవంతు కృషి చేస్తూ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు.  వ్యాపార కార్యకలాపాలు, వస్తువుల తయారీ కంపెనీల్లో బాలకార్మికులు పనులు చేయకుండా చూడాల్సిన బాధ్య తస్థానిక అధికారులతో పాటు పౌరులపై కూడా ఉంది.  స్వచ్ఛంద సంస్థల కృషితో రక్షిం చబడిన పిల్లలను వారి వయోపరిమితుల ఆధారంగా విద్యారంగం వైపు మళ్లించాలనీ, రక్షించబడిన పిల్లల కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం అందించాలన్నారు. గ్రామాల్లో అక్రమ రవాణా నియంత్రించడానికి పాఠశాలలు, సంఘాలు, స్థానిక పరిపాలన సంస్థలు కలిసి కట్టుగా కృషి చేయాలి.  అవగాహన కార్యక్రమాలను, ప్రచారాలను నిర్వహించి అక్రమరవాణాను అరికట్టాలని ఫౌండేషన్ అభిప్రాయపడింది.  ప్రధానంగా అక్రమరవా ణాకు సంబంధించి ఝార్ఖండ్, బీహార్, వెస్ట్బంగాల్, అస్సాం తదితర ప్రాంతాలను ఫౌండేషన్ తన నివేదికలో విశ్లేషించింది. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రధానం గా అక్రమ తరలింపు అంశంలో రైల్వే సహకారం అనివా ర్యంగా గుర్తించాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి అధికంగా అక్రమంగా బాలల రవాణా జరిగే ప్రమాదం ఉందని పేర్కొంది.  బాలకార్మిక వ్యవస్థను అడ్డుకోవడానికి ప్రజల్లో అవగాహన కల్పించేలా అనేక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. 


ఆపరేషన్ ముస్కాన్..

బడిలో పాఠాలు చదువుకోవల్సిన బాల్యం యంత్రాల రణగొణధ్వునుల మధ్య జీవిత పాఠాలు నేర్చుకోవలిరావడం బాధాకరం. అయితే బాలకార్మికులను గుర్తించి వారి ఇండ్లకు చేర్చడం, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం కోసం ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని తెలంగాణ పోలీసులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫ్యాక్టరీల పై దాడులు నిర్వహించి బాలకార్మికులను పని బాట నుంచి తప్పిస్తున్నారు. మానవ అక్రమ రవాణాపై, బాలకార్మికులపై సమాచారం ఉంటే తక్షణం పోలీసులకు తెలియచేయాలని అధికారులు ప్రజలను కోరారు.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.