సముద్రంలో కుప్పకూలిన విమానం.. బహామాస్ లో10 మంది దుర్మరణం.!
Publish Date:Jul 11, 2026
Advertisement
బహామాస్ లో జరిగిన విమాన ప్రమాదంలో పది మంది దుర్మరణం పాలయ్యారు. బహామాస్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న రోజే అంటే శుక్రవారం (జులై 10) ఈ దుర్ఘటన జరిగింది. 10 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక చిన్న విమానం సముద్రంలో కుప్పకూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్నవారంతా మరణించారు. ఈ దారుణ ఘటనపై స్పందించిన బహామాస్ ప్రభుత్వం.. ప్రమాదానికి గురైన విమానయాన సంస్థ ఫ్లెమింగో ఎయిర్ సర్వీసులను తాత్కాలికంగా పూర్తిగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బహామాస్ రాజధాని నసావులోని లిండెన్ పిండ్లింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సెస్నా 402 రకానికి చెందిన చిన్న విమానం శాన్ ఆండ్రోస్ ద్వీపానికి పది మంది ప్రయాణీకులతో బయలు దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. నసావుకు పశ్చిమంగా ఉన్న నార్త్ ఆండ్రోస్ సముద్ర జలాల్లో ఈ విమానం కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక చర్యల బృందాలు సముద్రంలో గాలింపు చేపట్టాయి. విమాన ప్రమాదం తర్వాత ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడని బహామాస్ ప్రధాని ఫిలిప్ బ్రేవ్ డెవిస్ తొలుత అధికారికంగా ప్రకటించినప్పటికీ.. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి కూడా మరణించాడు. Bahamas plane crash, Flamingo Air crash, Nassau plane crash ocean, Cessna 402 ocean crash, Bahamas flight accident 10 dead, Bahamas independence day tragedy
http://www.teluguone.com/news/content/bahamas-plane-crash-36-225687.html





