వెంకన్న భక్తులకు ఎందుకీ కష్టాలు?.. ఏసు రెడ్డి పాలనే కారణమా?

Publish Date:Apr 13, 2022

Advertisement

అదేమంత పెద్ద విషయం కాదు. భక్తుల ఆటు పోట్లు వెంకన్న దేవునికి కొత్త కాదు. ఒకే రోజు లక్ష మంది భక్తులు వచ్చినా, ఎలా మ్యానేజి చేయాలో టీటీడీ అధికారులు, సిబ్బందికి తెలియంది కాదు. అందుకు అవసరమైన వ్యవస్థ, సిబ్బంది, వనరులు ఇతరత్రా అవసరమైన అన్ని సదుపాయలు టీటీడీకి అందుబాటులో ఉన్నాయి. అయినా, మంగళవారం సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగింది. అదృష్టవ శాత్తు పెద్ద ప్రమాదం ఏదీ జరగలేదు కానీ నలుగురైదుగురు భక్తులు సొమ్మసిల్లి ఆసుపత్రుల పాలయ్యారు. ఇలాంటి సంఘటన ఎందుకు  జరిగింది. ఎక్కడెక్కడినుంచో వచ్చిన భక్తులు వందలు, వేల  సంఖ్యలో కొండ మెట్లు ఎక్కకుండానే, స్వామి వారిని దర్శించుకోకుండానే, వెనక్కి తిరిగి పోవలసిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇలా ఎందుకు జరిగింది? లోపం ఎక్కడుంది? అనే విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
నిజానికి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి, తిరుమల తిరపతి దేవస్థానములు (టీటీడీ) వివాదాలు కొండగా మారింది. అనేక వివాదాలు ఏడుకొండలను  చుట్టుముడుతూనే ఉన్నాయి. వెంకన్న దేవుని అస్తుల విక్రయం మొదలు, అన్యమత ఉద్యోగుల వివాదం వరకు, ప్రసాదాల విక్రయాలు మొదలు అన్నప్రసాద వితరణ వరకు, వీఐపీ దర్శనాలు మొదలు, అర్జిత సేవల వరకు , ఇలా అదీ ఇదీ అని కాకుండా, అన్ని విషయాల్లో వివాదాలు చుట్టు ముడుతూనే ఉన్నాయి. 

ఈ నేపధ్యంలో మంగళవారం సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట వెనక కూడా ఏదైనా కుట్ర దాగుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబం క్రైస్తవ కుటుంబం. ముఖ్యమత్రి ఏసు దేవుని భక్తుడు. అంతే కాదు, ఆయన  క్షణమైనా బైబిల్ వదలని పవిత్ర మాతృమూర్తి విజయమ్మ కడుపున పుట్టారు. సహజంగానే తల్లి నుంచి  క్రైస్తవ మత విశ్వాసాలను కణకణా నింపుకున్నారు. అదేమీ అభ్యంతరం కాదు కానీ,ఆయన తమ మత విశ్వాసాలను పరిపాలనలో  చొప్పించడం వల్లనే సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. ఏడు కొండలపై ఫై లేదా మరో హిందూ దేవాలయ ప్రాంగణంలో జరిగిన ఏ చిన్న సంఘటన అయినా, డొంకంతా కదలుస్తోంది. తప్పడం లేదు. జగన్ రెడ్డి మూడేళ్ళ పాలనలో ఇంచు మించుగా 200లకు పైగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి, పలు దేవాలయాల్లో విగ్రహాలు ద్వంస మయ్యాయి, రథాలు దగ్ధమయ్యాయి. ఇంతజరిగినా ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. సో.. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా జగన్ రెడ్డి ఇన్నర్ సోల్’ను అనుమానించక తప్పడం లేదు. 

అయితే, టోకెన్లను పంపిణీ తొక్కిసలాటకు సంబంధించి, టీటీడీ అదనపు కార్యనిర్వహక అధికారి ధర్మారెడ్డి కొంత వివరణ ఇచ్చారు. ఈనెల 9, 10, 11 తేదీలకు సంబంధించి ఒకేరోజు టోకెన్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. రెండు రోజుల విరామం అనంతరం కౌంటర్లు ఓపెన్‌ చేయాలని భావించామని.. వారాంతాల్లో దర్శనానికి వచ్చే వారి సంఖ్య పెరిగిందని, అయినా టైమ్‌ స్లాట్‌ వల్ల భక్తులకు చాలా త్వరగా దర్శనాలు కల్పించామని చెప్పుకొచ్చారు. ఈనెల 9, 10, 11 తేదీలకు సంబంధించి ఒకేరోజు టోకెన్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. రెండు రోజుల విరామం అనంతరం కౌంటర్లు ఓపెన్‌ చేయాలని భావించామని.. వారాంతాల్లో దర్శనానికి వచ్చే వారి సంఖ్య పెరిగిందన్నారు.

నిజానికి, ఇక్కడే భక్తులు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. వారాంతంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారనే విషయం అధికారులకు తెలియదా? తెలిసి కూడా శని, ఆదివారాల్లో సర్వదర్శనం టోకెన్ల జారీని ఎందుకు ఆపు చేశారు? ఎవరి కోసం ఆపుచేశారు? వంటిప్రశ్నలు వస్తున్నాయి. సరే, ఎందుకో కక్కుర్తి పడ్డారే అనుకున్నా, మంగళవారం కౌంటర్లు తెరిచే ముందు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు. భక్తులకు ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదు? అని భక్తులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చే నాధుడు దొరకడం లేదు.
 
అయితే, మొత్తం మూడు కౌంటర్లు కలిపి 18 నుంచి 20వేల మంది భక్తుల వచ్చారని ధర్మారెడ్డి చెప్పారు. రోజుకు 35వేల చొప్పున దర్శన టోకెన్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని తెలిసి కౌంటర్లు మూసేశామని.. అక్కడికే తిరుమల బస్సులను పంపించామని వివరించారు. టోకెన్లు లేకున్నా శ్రీవారిని దర్శించుకునే ఏర్పాట్లు చేశామని తెలిపారు. ముందుగానే వైకుంఠం-ఈ కాంప్లెక్స్‌ను సిద్ధం చేశామన్నారు. అన్ని సమస్యలనూ అధిగమించినందునే సాఫీగా దర్శనాలు సాగాయని చెప్పారు.

ముందు సిద్ధంగా ఉన్నందునే అరగంటలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని ధర్మారెడ్డి తెలిపారు. తాగునీరు, భోజనం, ఏసీలు, టీవీలు అన్నీ సిద్ధం చేశామని చెప్పారు. ఆ పరిస్థితిని మేం ఊహించే సిద్ధమైతే తమపై ఆరోపణలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు రకరకాల ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నామని ధర్మారెడ్డి వివరించారు. తితిదే అధికారుల నిర్లక్ష్యం అంటూ వ్యాఖ్యలు చేయొద్దని.. తమపై విమర్శలను ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు.

నిజమే ఈఓ చెప్పినదాంట్లో కొంత నిజం ఉండవచ్చును, కానీ, ముఖ్యమంత్రి అన్యమత విశ్వాసాలు, ప్రభుత్వ పరంగా సాగుతున్నహిందూ ధర్మ వ్యతిరేక కార్యకలాపాలు, రాష్ట్రంలో యధేచ్చగా, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న క్రైస్తవ మత ప్రచారం, మతంమార్పిడులుకారణంగా చీమ చిటుక్కుమన్నా, అనుమానించవలసిన పరిస్థితి తప్పడం లేదని అంటున్నారు. ఏమైనా జగన్ రెడ్డి పాలనలో హిందువులకే కాదు, హిందూ దేవుళ్ళకు, దేవాలయాలకు కూడా రక్షణ లేకుండా పోయింది, అనేది మాత్రం, అంతటా వినిపిస్తున్న నిజం.

By
en-us Political News

  
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.