ఆ మూడు పార్టీల పొత్తు పొడుపు ..కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రబాబు

Publish Date:May 24, 2022

Advertisement

రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. శాశ్వత ప్రయోజనాలే  ఉంటాయి. ఇది ముమ్మాటికి నిజం. ఇప్పటికే అనేక సందర్భాలలో రుజువైన వాస్తవం. ఆంధ్ర ప్రదేశ్’లో అధికార వైసీపీని ఓడించేందుకు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు, అధికార పార్టీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని, జనసేన అధినేత పవన్ కళ్యాన్ ప్రకటించినప్పుడు చాలా మంది అనుమానాలు వ్యక్త పరిచారు. అదెలా సాధ్యమని,అయ్యే పనికాదని పెదవి విరిచారు.అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం అక్కడితో ఆగిపోలేదు. బీజేపీ జాతీయ నాయకులతో ఆయన ఏమి మాట్లాడారో ఏమో కానీ, టీడీపీతో పొత్తుకు బీజేపీ ఒప్పించే బాధ్యతను కూడా తానే తీసుకున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వాన్ని ఒప్పించగలననే విశ్వాసం వ్యక్త పరిచారు. అయినప్పటికీ, రాష్ట్ర బీజేపే నాయకులు అందుకు విరుద్ధంగా ప్రకటనలు చేశారు. చేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ మాట నిలబడుతుందా అనే అనుమానాలు ఇప్పటికీ వ్యక్తమవుతున్నాయి. 
అయితే, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ‘పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించారు. దేశ ప్రజలు,వాహనదారులపై భారాన్ని తగ్గించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర స్థాయి పన్నులను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం పిలుపునివ్వడాన్ని కూడా చంద్రబాబు స్వాగతించారు. రాజస్థాన్, ఒరిస్సా, తమిళనాడు ప్రభుత్వాలు ఇంధనంపై తమ పన్నులను తగ్గించాయని, ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే బాటలో వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. 

నిజానికి, 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై ఇలా సానుకూలంగా ఎప్పుడూ స్పందించే లేదు. తొలిసారిగా ఆయన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. అది కూడా పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పవన్ కళ్యాణ్ పొత్తుల ప్రకటనకు కొనసాగిపుగానే చంద్రబాబు స్పందన ఉందని, ఇది ఆ మూడు పార్టీలు మళ్ళీ దగ్గరవుతున్నాయి అనేందుకు ఒక సంకేతమని విశ్లేషకులు అంటున్నారు.   

మరోవంక పవన్ కళ్యాణ్ కూడా కేంద్రం నిర్ణయంపై అభినందనీయమంటూ ప్రసంసలు కురిపించారు,  'పెరుగుతున్న ధరలతో కష్టాల్లో ఉన్న ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుతో ఉపశమనం లభిస్తుందని నేను భావిస్తున్నాను. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వ అగ్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.9.50, రూ.7 చొప్పున తగ్గించడం అభినందనీయం' అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 
'బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో, కొంతమేరకు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉన్నందున, దిగువ-ఆదాయ వర్గాలు, మధ్యతరగతి ప్రజలు ఉపశమనం పొందవచ్చని నేను భావిస్తున్నాను.పీఎం ఉజ్వల్ యోజన పథకం కింద ఇస్తున్న గ్యాస్ సిలిండర్లపై రూ.200 తగ్గింపు కచ్చితంగా పేదలకు మేలు చేస్తుంది' అని అన్నారు పవన్ కళ్యాణ్. 

ఇలా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసించడం ద్వారా, బీజేపీకి స్నేహ హస్తం అందించారని అనుకోవచ్చని అంటునారు. నిజానికి, తెలుగు దేశం, చంద్రాబాబు నాయుడు, రాష్ట్ర పయోజనల దృష్ట్యా బీజేపీతో పొత్తుకు సిద్దంగా ఉన్న సంకేతాలు ఉండబట్టే, పవన్ కళ్యాణ్’ విపక్షాల ఓటు చీలకుండా చూస్తానాయి మాట ఇచ్చారని  జనసీన నాయకులు అంటున్నారు. అలాగే, టీడీపీతో పొత్తుకు బీజేపీ జాతీయ నాయకత్వం కోడా సిద్ధంగా ఉందని అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీని ఒప్పించే బాధ్యతను తీసుకున్నారని అంటున్నారు. అయితే, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని, అదే విధంగా చంద్రబాబు స్పందనకు బీజేపీ జాతీయ నాయకత్వం ఎలా స్పందిస్తుంది, అనే దానిపై పొత్తు పొడుపు ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

By
en-us Political News

  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.