చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ 2047

Publish Date:Aug 14, 2023

Advertisement

విజనరీ నారాచంద్రబాబునాయుడు విజన్ 2047 పేరిట ఒక డాక్యుమెంట్ ను విడుదల చేయనున్నారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ఈ డాక్యుమెంట్ ని మంగళవారం (ఆగస్టు 15) విశాఖపట్నంలో విడుదల చేయనున్నారు. 

 గ్లోబల్ లీడర్ గా భారత్ ఆవిర్భవించేందుకు ఐదు వ్యాహాలు  పేరుతో విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్న చంద్రబాబు నాయుడు. ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పన కోసం కొన్ని నెలలుగా గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్ఫర్మేషన్  (జీఎఫ్ఎస్టీ) బృందం పని చేస్తున్నది. జీఎఫ్ఎస్టీ చైర్మన్ అయిన చంద్రబాబునాయుడు  మేధావులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఉన్నత విద్యావంతులు, పలు రంగాల నిపుణుల సమక్షం లో  విశాఖలో ఈ విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేస్తారు. ఈ డాక్యుమెంట్ 2947 ను మేధావులు, వివిధ రంగాల నిపుణులు, ప్రొఫెసర్లు, విద్యార్థుల సమక్షంలో విడుదల చేస్తారు. 
గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఈ సంస్థ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్‌గా పనిచేస్తోంది. మూడేళ్ల క్రితం ఏర్పాటైనది. ఈ సంస్థకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చైర్మన్‌గా ఉన్నారు.

దీనిలో ఆర్థిక రంగ నిపుణులు, పర్యావరణ వేత్తలు, రిటైర్డ్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పని చేసిన అధికారులు, కార్పొరేట్ ప్రముఖులు, విద్య, వైద్య, న్యాయ, మీడియా రంగ నిపుణులు, కార్పొరేట్ రంగ వ్యక్తులు ఉన్నారు. విధానాల రూపకల్పన, పరిశోధన, నాలెడ్జ్ షేరింగ్ అనే అంశాలకు జిఎఫ్ఎస్టి వేదికగా పనిచేస్తోంది. మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగం, లాజిస్టిక్స్, తయారీ పరిశ్రమల, ఎంఎస్ఎంఈ పరిశ్రమలు, టెక్నాలజీ, ఎనర్జీ, స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్, వాతావరణ మార్పులు, ప్రజా ఆరోగ్యం వంటి అంశాలపై జిఎఫ్ఎస్‌టి పని చేస్తుంది.  
2047లో దేశం స్వాతంత్ర్యం సాధించి వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఆ నాటికి  ఇండియా  ప్రపంచ లోనే నంబర్   1 ఆర్థిక వ్యవస్థగా రూపొందే అవకాశం ఉంది. దీనిలో భాగంగా స్ట్రాటజీస్ ఫర్ ఇండియా@100 అనే కాన్సెప్ట్‌పై జిఎఫ్ఎస్టి పనిచేస్తుంది. ఆయా రంగాల నిపుణులు, విద్యావేత్తలు, సంస్థలు, వ్యక్తుల భాగస్వామ్యంతో  జీఎఫ్ఎస్టీ నివేదికలు సిద్దం చేస్తుంది.  

77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా  తెలుగుజాతి భవితవ్యాన్ని తీర్చిదిద్ధేందుకు... 2047 నాటికి దేశాన్ని గ్లోబల్ లీడర్ గా మలిచే వ్యూహాలపై చర్చించేందుకు... తనతో కలిసి రావాలని యువతను , మేధావులను  చంద్రబాబు పిలుపునిచ్చారు.  

తనతో కలిసి పాదయాత్రలో పాల్గొనేందుకు ఆగస్టు 15 మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం  వద్దకు చేరుకోవాల్సిందిగా  పిలుపునిచ్చారు.  అదే రోజు   సాయంత్రం ఎంజీఎం గ్రౌండ్స్ లో యువతతో ముఖాముఖి సదస్సులో ఆయన పాల్గొంటారు.

By
en-us Political News

  
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.