బాబు నోట ముందస్తు మాట.. జగన్ మరో గత్యంతరం లేదని వ్యాఖ్య

Publish Date:May 17, 2022

Advertisement

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి నోట ముందస్తు ఎన్నికల మాట వచ్చింది. మహానాడు ఏర్పాట్ల సమీక్ష కోసం పార్టీ నేతలతో మంగళవారం సమావేశమైన చంద్రబాబు.. వైసీపీ సర్కార్ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగిందన్నారు. తెలుగుదేశం బాదుడే బాదుడు కార్యక్రమానికి వస్తున్న జన స్పందన, వైసీపీ గడప గడపకూ కార్యక్రమానికి ఎదురౌతున్న ప్రజా నిరసనలు ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఇక ప్రభుత్వాన్ని నడిపే సత్తా జగన్ కు లేదని అందుకే ముందస్తుకు వెళ్లడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

జగన్ సంక్షేమ పథకాలను కొనసాగించే పరిస్థితి లేదనీ, అందుకే ముందస్తుకు వెళ్లక తప్పదనీ పరిశీలకులు ఇప్పటికే విశ్లేషణలు చేస్తున్న సంగతి విదితమే. గడప గడపకూ కార్యక్రమంలో పథకాల లబ్ధిదారులే ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న సంఘటనలు ఎదురౌతున్న నేపథ్యంలో చంద్రబాబు మాటలు రాజకీయ ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. జనం తమ కష్టాలు తీర్చేది తెలుగుదేశం పార్టీయే అని భావిస్తున్నారని చెప్పిన చంద్రబాబు మరింత దూకుడుగా ప్రజలలోకి వెళ్లి జగన్ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

గడప గడపకూలో వైసీపీ నేతలను జనం నిలదీస్తున్న తీరు చూస్తుంటే.. జగన్ పాలన పట్ల ఎంతగా విసిగిపోయారో అవగతమౌతోందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న చంద్రబాబు అతి విశ్వాసం వద్దనీ, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. విమర్శించే వారిపై దాడులు, తెలుగుదేశం నాయకులకు బెదరింపులతో జగన్ రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్న చంద్రబాబు వాటన్నిటినీ ఎదుర్కొనేందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉందన్నారు.

గుంటూరు జిల్లాలో వెంకాయమ్మపై దాడి, వైఎస్సార్ కడప జిల్లా తెలుగుదేశం కార్యదర్శి సాయినాథ్ శర్మకు బెదరింపులు, ఆయన కారు ధ్వంసం వంటి సంఘటనలు చంద్రబాబు మాటలలోని వాస్తవాన్ని ఎత్తి చూపుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రశ్నించే జనాలపై దాడులు, తెలుగుదేశం నేతలు, శ్రేణులకు బెదరింపులు, దాడులు ఏవో ఒకటి రెండు జిల్లాలకు పరిమితమై లేవనీ, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందనీ పరిశీలకలు సైతం చెబుతున్నారు. రోజు రోజుకూ ఆర్థిక పరిస్థితి దిగజారుతుండటం, పథకాలలో కొతలతో జనంలో ఆగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు జగన్ పథకాలు పూర్తిగా నిలిచిపోకముందే ఎన్నికలకు వెళ్లడం మేలన్న భావనలో ఉన్నారన్నది పరిశీలకుల విశ్లేషణ.

ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం జగన్ మదిలో ‘ముందస్తు’ ఆలోచన మెదులుతోందని సంకేతం ఇచ్చిన సంగతి విదితమే. అలాగే బీసీల ప్రయోజనాలను కాపాడటంలో చాంపియన్ అని చెప్పుకునేందుకే ఇప్పటి దాకా వారిని పట్టించుకోని జగన్ హఠాత్తుగా ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ టికెట్ ఇవ్వడం ద్వారా బీసీల ఓట్లకు గాలం వేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నోటి వెంట ముందస్తు మాట రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాదుడే బాదుడులో భాగంగా జిల్లాల పర్యటనల్లో చంద్రబాబుకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇక జగన్ కంచుకోటగా చెప్పుకునే ఉమ్మడి కడప జిల్లాలో చంద్రబాబు బుధవారం పర్యటించనున్నారు. ఈ పర్యటనకు తెలుగుదేశం శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.

By
en-us Political News

  
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.