Publish Date:Oct 28, 2023
సినిమాల్లో కమెడియన్ పాత్రల నుంచి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన బాబూమోహన్ రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారా? బిజెపి ప్రకటించిన రెండు జాబితాలో తన పేరు రాకపోవడంతో ఆయన రోడ్డెక్కారు. పార్టీ తనను అవమాన పరుస్తుందని, పైగా తన కుటుంబంలో చిచ్చు పెట్టే విధంగా ప్రకటనలు చేస్తుందని బాబు మోహన్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన తెలుగుదేశం పార్టీలో 1999 ఆందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రయ్యారు. తర్వాత టిఆర్ఎస్ అభ్యర్థిగా 2004,2014 ఎన్నికల్లోపోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో తనకు టిఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో బాబూ మోహన్ బిజెపిలోకి జంప్ అయి టికెట్ సంపాదించారు. టిఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ చేతిలో ఓటమి పాలయ్యారు.ఈ ఎన్నికల్లో బిజెపి ఆందోల్ టికెట్ కేటాయించకపోవడంతో బాబు మోహన్ బిజెపికి, ఎన్నికలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.
తన పాపులారిటీ గురించి తెలియదా? తానెవరో తెలియదా? తనను ఎన్నో జాబితాలో పెడతారు? అయినా తాను ఈసారి పోటీకి దూరంగా ఉండాలనుకున్నానని బాబూ మోహన్ అన్నారు. తన పేరు మొదటి, రెండో జాబితాలో లేకపోవడంపై ఆయన పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయదల్చుకోలేదన్నారు. బీజేపీకీ దూరంగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు. తాను ఫోన్ చేసినా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ లిఫ్ట్ చేయడం లేదన్నారు. తన కుమారుడికి టిక్కెట్ ఇస్తున్నామని చెబుతూ కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అధిష్ఠానం స్పందనను బట్టి తన నిర్ణయం ఉంటుందన్నారు.
వరుస జాబితాల పేరుతో దాపరికం తనకు నచ్చడం లేదన్నారు. పార్టీ రాష్ట్ర పెద్దలు కావాలని తనను పక్కన పెడుతున్నట్లుగా అనిపించిందన్నారు. టిక్కెట్ ఎవరికైనా ఇచ్చుకోనీయండి.. మా అబ్బాయికి అంటున్నారు.. నా కొడుక్కే ఇవ్వండి.. కానీ అది తనకు నేరుగా చెప్పాలి కదా? అని బాబూ మోహన్ ప్రశ్నించారు. నాన్చుడు ధోరణి సరికాదన్నారు. నేను అందరికీ తెలిసిన వ్యక్తిని అని, అలాంటి తనను ఎన్నో జాబితాలో పెడతారని ప్రశ్నించారు. అందుకే బాధతో పార్టీకి, పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అధిష్ఠానం నిర్ణయాన్ని బట్టి పార్టీలో ఉండాలా? రాజీనామా చేయాలా? చూస్తానన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/babu-mohan-fire-on-bjp-39-164160.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.