చంద్రబాబు లీగల్ ములాఖత్ కుదింపు వెనక మరో కుట్ర?

Publish Date:Oct 18, 2023

Advertisement

వైసీపీ ప్రభుత్వం అక్రమంగా బనాయించిన స్కిల్  కేసులో  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టై  దాదాపు 40 రోజులు కావస్తోంది. కోర్టులలో వాయిదాల పరంపర కొనసాగుతూనే ఉంది.  సీఐడీ ఈ కేసుకు సంబంధించి ఆధారాలు సమర్పించడంలో  ఘోరంగా విఫలమైంది. మొత్తానికి ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ, వాదనలు ముగిసాయి. తీర్పు రిజర్వులో ఉంది. సర్వోన్నత న్యాయస్థానం చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై శుక్రవారం (అక్టోబర్ 20) తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి వరకూ చంద్రబాబు జైల్లో ఉన్నన్ని రోజులు ఆయనను కలిసేందుకు ములాఖత్ సాధారణంగానే ఉండేది.    సాధారణంగా కుటుంబ సభ్యులు, మిత్రులకు ములాఖత్ లో అవకాశం ఇస్తారు. ఇలా వారానికి రెండుసార్లు కలిసే అవకాశం ఉంటుంది.  ఇది కాకుండా లీగల్ ములాఖత్ అని మరో అప్షన్ కూడా ఉంటుంది. ఈ లీగల్ ములాఖత్ లో న్యాయవాదులు చంద్రబాబును   రోజుకు రెండుసార్లు కలిసే వెసులు బాటు ఉంటుంది. 

చంద్రబాబు విషయంలో కూడా  ఇప్పటి వరకూ అలాగే వారానికి రెండుసార్లు కుటుంబ సభ్యులు, మిత్రులకు.. రోజుకు రెండుసార్లు లాయర్లకు ములాఖత్ అవకాశం ఇచ్చారు. కానీ  ఉన్నట్లుండి ఇప్పుడు ఒక్కసారిగా ములాఖత్ సంఖ్యను కుదించినట్లు జైళ్ల శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇకపై రోజుకు ఒక్కసారి మాత్రమే లీగల్ ములాఖత్ కు అవకాశం ఇస్తామని జైలు అధికారులు చెబుతున్నారు. గతంలో వారానికి రెండుసార్లు ఉన్న ఫ్యామిలీ-ఫ్రెండ్స్ ములాఖత్ ను కూడా వారానికి ఒక్కసారికి పరిమితం చేయనున్నట్లు చెబుతున్నారు. నిత్యం న్యాయవాదులు చంద్రబాబును కలుస్తుండడంతో జైలులో ఉన్న ఇతర ఖైదీలు ఇబ్బంది పడుతున్నారని.. ఈ కారణంతోనే చంద్రబాబు లీగల్ ములాఖత్ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు.  దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.   జైళ్ళ శాఖ డీఐజీని కలిసి ఇదే అంశంపై ఫిర్యాదు కూడా చేశారు. జైళ్ల శాఖ ఈ ములాఖత్ కుదింపు అంశాన్ని పరిశీలిస్తున్నది.

నిజానికి రోజుకు రెండుసార్లు లీగల్ ములాఖత్ అనేది చంద్రబాబు హక్కు. ఒక్క చంద్రబాబు మాత్రమే కాదు..  సాధారణంగా అందరికీ ఉన్న హక్కు. అయితే ఇతర ఖైదీలకు ఇబ్బంది కారణంగా ఒక్క చంద్రబాబు ములాఖత్  సంఖ్యను ఒకటికి కుదించడం అంటే హక్కులను కాలరాయడమే అవుతుంది,  
అయితే, చంద్రబాబు లీగల్ ములాఖత్ సంఖ్యను రెండు నుంచి ఒకటికి కుదించడం వెనుక  భారీ కుట్ర  ఉందని  న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లీగల్ ములాఖత్ ద్వారానే చంద్రబాబు అటు పార్టీ వ్యవహారాలపై సలహాలు, సూచనలు ఇస్తున్నారని.. మరోవైపు కేసుకు సంబంధించి కూడా న్యాయ నిపుణులతో కీలక అంశాలను ప్రస్తావిస్తూ ముందుకు నడిపిస్తున్నారని వైసీపీ బలంగా అనుమానిస్తోంది. అందుకే పార్టీతో పాటు కేసు విషయంలో చంద్రబాబు యాక్టివిటీ తగ్గించాలన్న కుట్రలో భాగంగానే ఈ తరహా సాకులతో చంద్రబాబు లీగల్ ములాఖత్ ను రెండు సార్లు నుంచి ఒక సారికి తగ్గించిందని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

స్కిల్ కేసు పై ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు విచారణలు కొనసాగుతున్నాయి. ఒక్క స్కిల్ స్కామ్ కేసే కాదు. ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు, అంగళ్ల అల్లర్ల కేసుతో పాటు తాజాగా అమరావతి సీఆర్డీఏ కేసును కూడా మళ్ళీ రీ ఓపెన్ చేయాలనీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇలా అన్ని రకాల కేసులపై ఏకకాలంలో కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు విచారణలు కొనసాగుతున్న క్రమంలో పదుల సంఖ్యలో లాయర్లు జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ అవుతున్నారు. అది అవసరం కూడా. ఈ క్రమంలోనే ములాఖత్ పై ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురి చేయాలన్న ఆలోచనలోనే ప్రభుత్వం జైళ్ల అధికారుల ద్వారా ఈ తరహా కుట్రకు తెరతీసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని జైళ్ల శాఖ డీజీపీ దృష్టికి తెలుగుదేశం తీసుకువెళ్లింది.  ఆయన ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.

By
en-us Political News

  
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
​కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.