బాబు గొప్ప విజనరీ.. అమరావతి నగరం కాదు దేవతల రాజధాని.. బాబా రామ్ దేవ్

Publish Date:Jun 20, 2026

Advertisement

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబును దేశంలోనే  గొప్ప విజన్ ఉన్న ఉత్తమ నాయకుడిగా అభివర్ణించారు.  

గత నాలుగు దశాబ్దాలుగా  చంద్రబాబు నాయుడు ఈ దేశం కోసం,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమం కోసం ఏది అడిగితే   అది తాను చేస్తూనే ఉన్నామన్న బాబా రాందేవ్..  చంద్రబాబు సమాజంలోని అందరినీ సమానంగా చూసే ఒక గొప్ప లీడర్ అని, అందుకే ఇక్కడి ప్రజలు ఆయన్ని ఎంతో గౌరవిస్తూ, దేవుడిలా భావిస్తారన్నారు.  

నవ్యాంధ్ర రాజధాని అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదనీ..  అది సాక్షాత్తూ దేవతల రాజధాని రామ్ దేవ్ అమరాతిని  పవిత్రమైన దేవ భూమిగా అభివర్ణించారు.   అమరావతి నగర ప్రణాళికలో నలభై శాతం పచ్చదనం అంటే గ్రీనరీకి మరియు అరవై శాతం కాంక్రీట్ నిర్మాణాలకు ప్రాధాన్యత ఉంటుందన్నఆయన ఈ  సమతుల్యత  భవిష్యత్తులో ప్రకృతి అందాలను, స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి ప్రజలు స్విట్జర్లాండ్ లాంటి సుదూర దేశాలకు వెళ్లాల్సిన అవసరం   ఉండదని అమరావతే వాటిని తలదన్నేలా ఉంటుందని బాబా రాందేవ్ అన్నారు.  ఇక యోగా అనేది మన భారత ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలు,  జీవన విధానంలో  అంతర్భాగమన్న బాబా రామ్‌దేవ్  ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.  

By
en-us Political News

  
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు నగర అభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టు
బీజేపీ నా సీటు చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ అన్నారు.
నేను హోంమంత్రిని కాకపోవడం ఆ క్రిమినల్స్ అదృష్టం...
సమాజంలో నేరస్థులను కేవలం నేరస్థులుగానే చూడాలని, వారికి కులం లేదా మతం అనే ముసుగు
హైదరాబాద్‌లోని KBR పార్క్ సమీపంలో కొత్తగా అమల్లోకి వచ్చిన వన్‌వే ట్రాఫిక్ నిబంధనలు పలువురు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
గాదె సాయికృష్ణ అదృశ్యం ఉదంతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనంగా మారింది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
ప్రముఖ సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు కన్నుమూశారు.
విశాఖలోని రుషికొండ ప్యాలెస్ ను పీపీ పద్ధతిలో ఆతిథ్య రంగానికి అప్పగించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నట్టు ముగ్గురు మంత్రుల కమిటీ ప్రకటించింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లతో యోగభ్యాసం చేయించిన రామ్ దేవ్ బాబా
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం, అలాగే పోలీసుల కస్టడీలోనే అతను మరణించాడంటూ వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
యోగా గురు  బాబా రామ్‌దేవ్‌తో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఇక్కడి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం  జరిగిన ఈ  కార్యక్రమంలో వేలాది మంది   పాల్గొని రికార్డు సృష్టించారు.
ఈ నెల 26వ తేదీ వరకు మధ్యం తర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు బండి భగీరథ జైలు నుంచి మధ్యంతర బెయిల్‌ పై విడుదలయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.