చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు.. ఆయన తప్పు చేయరు.. లోకేష్ కు రజనీకాంత్ ఫోన్

Publish Date:Sep 13, 2023

Advertisement

సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఆయనకు దేశ విదేశాల్లో అభిమానులు ఉన్నారు. ఆయనను అందరూ అజాత శత్రువుగా చెబుతారు. అందరితో మంచిగా ఉంటారు. పరుష వాక్యం అన్నది ఆయన నోటి నుంచి రాదు.  రాజకీయాలలోకి ఎంట్రీ ఇద్దామని ఆయన భావించి కూడా రాజకీయాలు తన నైనాజికి సరిపడవన్న భావనో ఏమో ఆ యోచన నుంచి విరమించుకున్నారు.

అటువంటి రజనీకాంత్ ను ఏపీలోని అధికార వైసీపీ వివాదంలోకి లాగింది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఎన్టీఆర్ ను యుగపురుషుడిగా, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిని విజనరీగా అభివర్ణించారు.  చంద్రబాబు కారణంగానే హైదరాబాద్ లో  ఐటీ అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్ వెళితే భారతదేశంలో ఉన్నామా? న్యూయార్క్ లో ఉన్నామా? అనిపించేలా అభివృద్ధి జరిగిందనీ, అందంతా చంద్రబాబు విజన్ వల్లే సాధ్యమైందన్నారు. చంద్రబాబుతో తనకు మూడు దశాబ్దాల స్నేహబంధం ఉందనీ, తన ప్రతి పుట్టిన రోజుకూ చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతారనీ రజనీకాంత్ ఆ సందర్భంగా చెప్పారు. ఆ ప్రసంగంలో రజనీకాంత్  ఎక్కడా రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. కానీ చంద్రబాబును ప్రశంసించడమే ఆయన చేసిన పాపం అన్నట్లుగా  వైసీపీ రజనీకాంత్ పై విమర్శల వర్షం కురిపించింది. మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని, నటుడు కం  పొలిటీషియన్ పోసాని కృష్ణ మురళి వంటి వారు రజనీకాంత్ పై అనుచిత వ్యాఖ్యలతో విమర్శలు గుప్పించారు. నువ్వు హీరోవా అంటూ హేళన చేశారు. దేశ విదేశాల్లో ఉన్న రజనీకాంత్ అభిమానులందరికీ ఆగ్రహం కలిగించారు. అయినా అప్పటికి రజనీకాంత్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ మేధావులూ, సామాన్యులూ కూడా రజనీకాంత్ పై వైసీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను తప్పుపట్టారు.  అయితే అప్పటికి ఊరుకున్న రజనీకాంత్ తన చిత్రం జైలర్ సినిమా వేడుకలో  మాత్రం ‘మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ జరగని ఊరు లేదు.. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్థమైందా రాజా?" అంటూ వైసీపీ వారికి చురకలు అంటించారు.  

మొదటి వాక్యాలను తమిళంలో చెప్పిన రజినీకాంత్.. చివరిలో మాత్రం 'అర్థమైందా రాజా' అని తెలుగులో చెప్పడం విశేషం. పోసాని మాట్లాడితే 'రాజా రాజా' అంటుంటారు. అందుకే పోసాని శైలిలోనే అర్థమైందా రాజా అంటూ వైసీపీ నాయకులకు రజినీ చురకలు అంటించారనే చర్చ అప్పట్లో జోరుగా సాగింది కూడా. మొత్తం మీద అలుంగుటయే ఎరుగని రజనీ కాంత్ కూడా వైసీపీ తీరుపై సౌమ్యంగానైనా గట్టి రిటార్డ్ ఇచ్చారు. అటువంటి రజనీకాంత్ ఇప్పుడు చంద్రబాబు అరెస్టు పై స్పందించారు. తన మిత్రుడు చంద్రబాబు  గొప్ప పోరాట యోధుడు అని, ఆయన ప్రజా శ్రేయస్సుకోతం నిరంతరం పరితపించే గొప్ప నాయకుడు అని ప్రశంసించారు.

చంద్రబాబు కుమారుడు లోకేష్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు ఆయనను ఏం చేయలేవని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఆయనకు శ్రీరామరక్ష అంటూ లోకేష్ కు ధైర్యం చేప్పారు.  తన స్నేహితుడు చంద్రబాబు తప్పు చేయరని, ఆయన చేసిన మంచి పనులు, నిస్వార్థ ప్రజా సేవే ఆయనను క్షేమంగా బయటకు తీసుకువస్తాయన్నారు.  

By
en-us Political News

  
హైదరాబాదు నగరంలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో దాండియా వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకున్న వేళ, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో విజయదశమి లేదా దసరాకు ప్రత్యేక స్థానం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
పదేళ్లుగా పెండింగ్‌లో రూ.20 కోట్ల విలువైన స్థలం.. పఠాన్ ఎన్డీఏలో చేరగానే గిఫ్ట్.!
హైదరాబాద్‌లోని ఉప్పల్‌–నాగోల్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.