రెండు రోజుల్లో చంద్రబాబు అరెస్ట్?

Publish Date:Sep 6, 2023

Advertisement

తనను ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందని మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో పల్లె ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమంలో చంద్రబాబు బుధవారం ప్రసంగించారు. ఆ సందర్భంగా చంద్రబాబునాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు  సంచలనంగా మారాయి. అధికారపక్షం తనను బయటకు రాకుండా అడ్డుకుంటున్నదనీ.. తనపై కూడా దాడులు చేస్తున్నారని.. తమ పార్టీ శ్రేణులపై కూడా రౌడీలతో దాడులు చేయిస్తున్నారని.. ఇప్పుడు తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ అరాచక పాలన అంతం కోసం ఇంటికొకరు చొప్పున తనతో పాటు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.  ఒకటి, రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని.. తనపై కూడా దాడులు జరిగే అవకాశం కూడా ఉందని  వ్యాఖ్యానించారు.

అయితే వైసీపీ నేతలు ఎన్ని చేసినా  ఏం చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న చంద్రబాబు, మహాభారతం, రామాయణంలో ధర్మం గెలిచినట్టు చివరకు తెలుగుదేశమే విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ రాని మెజార్టీ ఈ ఎన్నికల్లో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన.. నిప్పులా బతికిన తనను తప్పుడు వ్యక్తిగా చూపేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అంగళ్ళలో తనమీద హత్యా ప్రయత్నం చేసి తిరిగి తనపైనే ఐపీసీ 307కింద కేసు పెట్టారని చంద్రబాబు పేర్కొన్నారు. అంతేకాదు తామే దాడులు చేసినట్టు ఒత్తిడి చేస్తూ స్టేట్మెంట్లు రాయిస్తున్నారని, కావాలని తప్పుడు కేసులలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. యువగళం పాదయాత్రకు వచ్చి దాడులు చేసి టిడిపి నేతలపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని.. ఏపీ సీఎం సైకోలా వ్యవహరిస్తున్నారని, సైకో పాలన నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

కాగా, చంద్రబాబు తనను అరెస్ట్ చేస్తారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో సంచలనంగా మారింది. అసలు చంద్రబాబును ఏ కేసులో అరెస్ట్ చేస్తారనే చర్చలు మొదలయ్యాయి. ఇటీవల కాలంలో  ఐటీ శాఖ నుండి చంద్రబాబుకు షోకాజ్ నోటీసులు వచ్చినట్టుగా ఓ జాతీయ పత్రిక కథనం ప్రచురింది. గత ప్రభుత్వ హయంలో వివిధ కాంట్రాక్టుసంస్థల నుంచి చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని, ఈ కేసులోనే ఐటీశాఖ నోటీసులు ఇచ్చినట్లు జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొంది. లెక్క చూపని డబ్బు రూ.118 కోట్లు ఆయన వద్ద ఉందని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించినట్లు కథనంలో రాసుకొచ్చారు. ఈ కథనం ఆధారంగానే చంద్రబాబుపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది. కాగా, ముందస్తు సమాచారం లేకుండా చంద్రబాబు ఎప్పుడూ మాట తూలరు. సరైన ఆధారం ఉంటేనే ఆయన మీడియాకు చెబుతారు. ఇలాంటి సమయంలో తన అరెస్ట్ ను ఆయనే ఇప్పుడు ధృవీకరించడం టీడీపీ వర్గాల్లో అలజడి సృష్టిస్తున్నది.  

అయితే వస్తున్న కథనాల ప్రకారం చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇచ్చింది ఐటీ విభాగం. కానీ, ఐటీ విభాగానికి అరెస్ట్ చేసే అధికారం లేదు. ఈడీకి అరెస్ట్ చేసే అధికారాలు ఉన్నాయి. అంటే ఈ వ్యవహారం ఇప్పుడు ఈడీకి అప్పగించనున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజులలో ఈ వ్యవహారం ఈడీకి వెళ్తుంది.. అప్పుడు తనను అరెస్ట్ చేస్తారని చంద్రబాబు చెప్పినట్లు భావించాల్సి వస్తుంది. మరోవైపు చంద్రబాబును అరెస్ట్ చేసేది కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాదని.. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచే ఈ అరెస్టులు ఉండనున్నాయని కూడా మరో వాదన వినిపిస్తుంది. ఏపీ సర్కారే తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారని, అక్రమ కేసులు బనాయించి ఒక్కసారైనా చంద్రబాబును అరెస్ట్ చేయాలని సీఎం జగన్ ఆశపడుతున్నారని.. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న జగన్ వచ్చే సమయానికి ఆయన కోరిక తీర్చాలని కొందరు ప్రభుత్వ పెద్దలు కంకణం కట్టుకున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మరి ఇంతకీ చంద్రబాబు ఏ కేసులో అరెస్ట్ కాబోతున్నారు. ఒక వేళ ఆయన అరెస్ట్ అయితే టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకోనున్నాయో చూడాల్సి ఉంది.

By
en-us Political News

  
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.