చంద్రబాబు గొప్ప విజనరీ.. కన్వాల్ లేఖీ

Publish Date:Oct 18, 2023

Advertisement

నారా చంద్రబాబు నాయుడు.. అభివృద్ధికి ఐకాన్. ప్రజా సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్. సాంకేతికతను ప్రజా ప్రయోజనాలకు అనుసంధానం చేయడంలో ముందుంటారు. అందరూ  రేపటి గురించి  ఆలోచిస్తే.. చంద్రబాబు మాత్రం రేపటి  తరం గురించి  కూడా ఆలోచిస్తారు. ఇలా చంద్రబాబు గురించి ఎంత చెప్పినా, ఎంత చెప్పుకున్నా తక్కువే. అటువంటి చంద్రబాబును.. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి వారికి ఉఫాథి, ఉద్యోగావకాశాలు కల్పించాలన్న సదుద్దేశంతో తీసుకువచ్చిన స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసింది. ఒక్క ఆధారం చూపకుండా.. అరెస్టు చేసేసి, ఇప్పుడు ఎలాగూ అరెస్టు చేశాం కదా.. ఆయనను విచారించి ఆధారాలు సంపాదిస్తామన్న వితండవాదన చేస్తోంది.

ఈ కేసులో కావాలనుకుంటే చంద్రబాబుకు ఒక్క రోజులో బెయిలు మంజూరై ఉండేది. అయితే ఆయన బెయిలుపై బయటకు రావడం కంటే.. తనపై కేసునే సవాల్ చేయడానికే చంద్రబాబు మొగ్గు చూపారు. అందుకే ఇది తప్పుడు కేసు క్వాష్ చేయండంటూ కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తనకు అలవాటైన సాగదీత విధానంతో కోర్టులో క్వాష్ పిటిషన్ పై తీర్పు జాప్యం అయ్యేలా అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నది. అందులో కొంత మేరకు సఫలమైందనే చెప్పాలి. అయితే కోర్టుల్లో వాదనల్లో ప్రభుత్వ  డొల్లతనం ప్రస్ఫుటంగా బయటపడుతోంది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని సామాన్యులకు, చిన్న పిల్లలకు సైతం అర్థమైపోయింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఒకటి  రెండు రోజులలో తీర్పు వచ్చే అవకాశం ఉంది.

అయితే చేయని నేరానికి, లేని కేసులో జగన్ ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన తీరుపై రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల నుంచీ ఖండనలు వెల్లువెత్తుతున్నాయి.  సామాన్య ప్రజలు, ఐటీ ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరు రోడ్ల పైకి వచ్చి తమ నిరసనలను తెలుపుతూ..బాబు కు సంఘీభావం చెపుతున్నారు. రాజకీయాలతో ఇసుమంతైనా సంబంధం లేని పారిశ్రామిక వేత్తలు, బిజినెస్ సర్కిల్స్ లో దిగ్గజాలైన వారు కూడా సామాజిక మాధ్యమంలో స్పందిస్తున్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. ఇ యామ్ విత్ బాబు హ్యాట్ టాగ్ తో వారి పోస్టులు వైరల్ అవుతున్నాయి. 

తాజాగా చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఇన్వెంటస్ ఎండీ కన్వాల్ రేఖీ లింకెన్డెన్ లో షేర్ చేసిన పోస్టులో చంద్రబాబు ఓ విజనరీ అంటూ పేర్కొన్నారు. ఆయన దార్శనికత.. చిట్టడవిలా.. కొండలు, గుట్టలతో నిండిన నిర్మాణుష్య ప్రదేశాన్ని హైటెక్ సిటీగా మార్చిందని పేర్కొన్నారు.   సంపద సృష్టిలో దేశానికి రెండో ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందింది. చంద్రబాబు విజన్ హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చేసిందని పేర్కొన్నారు.  హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చే క్రమంలో సైబరాబాద్ నగర నిర్మాణానికి, రాష్ట్ర భవిష్యత్, పురోగతి, ప్రగతి, పెట్టుబడుల ఆకర్షణ కోసం చంద్రబాబు పడిన తపన, అందుకోసం ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా రాష్ట్రానికి సీఈవోగా ఆయన చేసిన కృషి ప్రస్తావించి ఆయన నిజంగా చాలా చాలా గ్రేట్ అని కన్వాల్ రేఖీ పేర్కొన్నారు.  

అప్పట్లో విదేశీ దిగ్గజ సంస్థల అధినేతలు, ప్రతినిథులతో ఆయన నిర్వహించిన సమావేశం వివరాలనూ వివరించారు. తానూ ఆ సమావేశంలో భాగస్వామినేనని పేర్కొన్న ఆయన.. ఆ సమావేశానికి ముందు జరిగిన వివరాలను పూసగుచ్చినట్లు వివరించారు. వాస్తవానికి తాము హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉందనీ, అయితే అప్పటికి దుబాయ్ లో ఉన్న చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి పొద్దున్నే తాను వచ్చి కలుస్తాను ఉండమని కోరారు. అన్నట్లుగానే తెల్లవారి నాలుగు గంటలకల్లా చంద్రబాబు తమతో భేటీ అయ్యారని కన్వాల్ రేఖీ పేర్కొన్నారు. ఆ భేటీలో  రాష్ట్ర భవిష్యత్, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఐటీ పురోగతి తదితర అంశాలపై తమ మధ్య అర్ధవంతమైన చర్చ జరిగిందనీ, భేటీ తరువాత ఆయన తమను పోలీసు ఎస్కార్ట్ తో ఎయిర్ పోర్టుకు పంపించారని కన్వాల్ రేఖీ పేర్కొన్నారు. అటువంటి విజన్ ఉన్న నేత, అభివృద్ధి కోసం, ప్రగతి కోసం అంతగా తపనపడే నేత చంద్రబాబునాయుడు తప్ప మరొకరు ఉండరని పేర్కొన్నారు.

 కన్వర్ రేఖి పోస్టు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. చంద్రబాబు వంటి గొప్ప నేతను అక్రమంగా అరెస్టు చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా భారత్ ప్రతిష్ట మసకబారిందని నెటిజన్లు అంటున్నారు. జగన్ ఒక సైకో సీఎం అని సందేహాతీతంగా చంద్రబాబు అక్రమ అరెస్టు రుజువు చేసిందని విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఒక దార్శనికుడిని రాజకీయ వైరంతో మరుగున పడేయాలని చూస్తే ఆకాశంపై ఉమ్ము వేయడానికి చూసినట్లే. చంద్రబాబు విషయంలో ఈ విషయం పదే పదే రుజువు అవుతోంది. ఇప్పుడు జగన్  సర్కార్ ఆయనపై కక్ష సాధింపుతో వ్యవహరిస్తోంది. దీనివల్ల ఆన ప్రతిష్టకు కానీ, గొప్పతనానికి కానీ వీసమెత్తు నష్టం జరగలేదు.. కానీ అక్రమంగా అరెస్టు చేసిన జగన్ ప్రతిష్ట మాత్రం పాతాళానికి పడిపోయింది. దేశ విదేశాల నుంచి ఆయన అక్రమ అరెస్టును ఖండిస్తూ వెల్లువెత్తుతున్న ఆందోళనలే సాక్ష్యం. నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారూ చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో  ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ క్యాంపస్ ఆవిర్బావానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానై వ్యవహరించిన చంద్రబాబు ముందు చూపును ప్రస్తావిస్తూ నాడు ఆయన హైదరాబాద్ కు ఇండియన్ బిజినెస్ స్కూలు రావడంలో పోషించిన పాత్రను గుర్తు చేస్తున్నారు.  రాజకీయాల కంటే రాష్ట్ర ప్రగతి, పురోగతికే ప్రాధాన్యత ఇచ్చి, వర్తమానంతో పాటు భవిష్యత్ తరాల బాగును దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు  తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాలే  ఆయనకు ఒక ప్రత్యేక నేతగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాయని ప్రశంసలు గుప్పిస్తున్నారు.  

By
en-us Political News

  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.