బాబర్ , కెప్టెన్సీ రాకుంటే దిగిపో... సలీంమాలిక్ 

Publish Date:Oct 26, 2022

Advertisement

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో సూపర్12కి చేరుకున్న పాకిస్తాన్, భారత్ మొన్న ఆాదివారం తలపడిన సంగతి తెలిసిందే. అందులో ఊహించనివిధంగా భారత్ సూపర్ స్టార్ కింగ్ కోహ్లీ ఒక్కడే వీరోచిత బ్యాటింగ్ ప్రధర్శనతో భారత్ చివరి ఓవర్లో గెలిచిన సంగతి తెలిసిందే. కాగా గెలవాల్సిన మ్యాచ్ ని భారత్ కు అలా అప్పగించావని పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ పై పాకిస్తాన్ మాజీలు మండిపడుతున్నారు. కెప్టెన్సీ రాకుంటే వదిలేయమని సలీం మాలిక్ వంటి మాజీలు సూచించారు.

అసలు కెప్టెన్ గా జట్టును అవసరమై సమయంలో ధైర్యాన్నిస్తూ ముందుకు నడపడంలో ఘోరంగా విఫలమయ్యావంటూ బాబర్ అజామ్ పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సలీం మాలిక్ మండిపడ్డాడు. 160 పరుగుల టార్గెట్ భారత్ అవలీలగా కొట్టేయగలదు. అయినా మంచి అవకాశం వచ్చినపుడు దాన్ని అనుకూలం చేసుకోలేకపోవడమేమిటని మాలిక్ ప్రశ్నించాడు. బౌలర్లను ఉత్సాహపరచకపోవడమే దారుణమన్నాడు. అసలు ప్రపంచకప్ పోటీకి సారధ్యం వహించే సత్తా ఏమాత్రం ప్రదర్శించలేదని, నాయకత్వం చేపట్టలేనపుడు తప్పుకోవడమే మేలని మాలిక్ సూచన చేశాడు. 

బౌలింగ్, బ్యాటింగ్ పరంగానూ కెప్టెన్ విఫలం కావడంతోపాటు కనీసం జట్టును గెలిచే దిశలో ఉత్సాహ పరచక చతికిలపడ్డాడని ఇప్పటికే అతని మీద మీడియా కూడా విరుచుకుపడుతోంది. ఎంతో పోటా పోటీగా జరిగిన మ్యాచ్ లో చివరి దశలో పేలవ ప్రదర్శన  పాక్ అభిమానులను దెబ్బతీసింది. దీనికి తోడు కింగ్ కోహ్లీని నిలువరించలేకపోవడం పాక్ బౌలింగ్ స్థాయిని మరోసారి బయటపెట్టింది. వారి సూపర్ స్టార్ యువ పేసర్ అఫ్రిదీ కూడా ఏమాత్రం ప్రభావం చూపకపోవడమే జట్టును, పాక్ అభిమాను లను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది.  

ఎంతో ఉత్కంఠభరితంగా జరిగన మ్యాచ్ లో  కోహ్లీ ఎంతో సమయస్పూర్తితో ఆడుతూ, ఎంతో సహనం ప్రదర్శిస్తూ ఆడాడని పాక్ జట్టు ప్రశంసించింది. అయితే మరో వంక బాబర్ అజామ్ కెప్టెన్ గా ఒత్తిడిని అధిగమించే మార్గాన్ని పట్టుకోలేకపోయాడని, తప్పుడు నిర్ణయాలతో గెలవాల్సిన మ్యాచ్ ని వదిలేయ డమేమిటని మాలిక్ మండిపడ్డాడు. యువ ప్లేయర్ వి సమర్ధుడవని కెప్టెన్సీ ఇచ్చారు, సీనియర్లు లేక కాదని, అయినా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడం దారుణమ న్నాడు.  దీనికంటే జట్టు నాయకత్వం వదులుకోవడమే మేలని సలీం మాలిక్ సూచించాడు.

By
en-us Political News

  
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్‌ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.