Publish Date:Apr 22, 2025
ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబాపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. షర్బత్ జిహాద్ అంటూ రాందేవ్ బాబా చేసిన కామెంట్స్‌పై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలి ఫుడ్స్ లిమిటెడ్‌కు వ్యతిరేకంగా హమ్దార్ద్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ నెల ప్రారంభంలో బాబా రాందేవ్ పతంజలి గులాబీ షర్బత్‌ను ప్రారంభించినప్పుడు రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. "మీకు షర్బత్ ఇచ్చే కంపెనీ సంపాదించే డబ్బును మదర్సాలు, మసీదులను నిర్మించడానికి ఉపయోగిస్తారు. కానీ మీరు దీన్ని తాగితే (పతంజలి గులాబీ షర్బత్‌ను ఉద్దేశిస్తూ) గురుకులాలు నిర్మిస్తాం. ఆచార్య కులం అభివృద్ధి చెందుతుంది.
పతంజలి విశ్వవిద్యాలయం విస్తరిస్తుంది. భారతీయ శిక్షా బోర్డు పెరుగుతుంది" అని అన్నారు. కాగా.. బాబా రాందేవ్ హమ్దర్ద్ పేరుని ప్రస్తావించనప్పటికీ దాన్ని ఉద్దేశించే పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. దీనిపైనే హమ్ దర్డ్ కంపెనీ ఢిల్లీ కోర్టుని ఆశ్రయించింది. కాగా..రాందేవ్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే సోషల్ మీడియా నుంచి ఆ వీడియోను తొలగించేలా ఆదేశించాలని తెలిపింది. హమ్దర్ద్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇది ఆ సంస్థ ఉత్పత్తిని అగౌరవపరచడం కంటే తీవ్రమైందని, అవి ద్వేషపూరిత వ్యాఖ్యల కిందికే వస్తాయని వాదించారు. దీనిపై స్పందించిన కోర్టు... "బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యలు కోర్టు అంతరాత్మను షాక్‌కు గురి చేశాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఎంతమాత్రం కరెక్ట్ కాదు అని పేర్కొన్నాది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/baba-ramdev-39-196714.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.