ఆజాద్ రాజీనామా .. కాంగ్రెస్’లో కొత్త ట్విస్ట్

Publish Date:Aug 27, 2022

Advertisement

కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు ఇద్దరు కాదు, చాలా మంది  నాయకులు పార్టీని వదిలి బయటకు వెళ్లి పోయారు. ముఖ్యంగా 2019 ఎన్నికల ఓటమి తర్వాత, సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా డజన్ల కొద్ది నేతలు క్యూకట్టిమరీ పార్టీని వదిలి వెళ్ళిపోయారు. ఇంకా పోతూనే ఉన్నారు.అదే క్రమమలో పార్టీ సీనియర్ నాయకుడు, ఒకప్పుడు ట్రబుల్ షూటర్’గా పార్టీని అనేక విధాల ఆదుకున్న గులాం నబీ ఆజాద్’ కూడా పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఐదు పదుల అనుబంధాన్ని తెంచుకుని పార్టీకి  గుడ్’ బై చెప్పారు.  

నిజానికి, గులాం నబీ ఆజాద్’ పార్టీని వదిలిపోవడం ఉహించని విషయం కాదు. అనూహ్య పరిణామం అసలే కాదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్’గా కీలక బాధ్యతలు నిర్వహించిన గులాం నబీ ఆజాద్’ చాలా కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. అలాగే,పార్టీ అధినాయకత్వం కూడా ఆయన్ని, పరాయి వాడిగానే చూస్తోంది. కొంత దూరంగానే ఉంచుతోంది. 

సుమారు రెండేళ్ళ క్రితం 2020లో ఆజాద్ సహా మరో 22 సీనియర్ నాయకులు, జీ 23 పేరిట ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి ఆ వేదిక ప్రధాన లక్ష్యం, పార్టీని బతికించు కోవడమే, అందుకే, పార్టీ సంస్థాగతంగా బలపడవలసిన అవసరాన్ని నొక్కి చెపుతూ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. సంస్థాగత వ్యవహారాలపై దృష్టి పెట్టాలని కోరారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని కోరారు. 

ఇక అక్కడి నుంచి, పార్టీ సీనియర్ నాయకులకు, పార్టీ అధిష్టానానికి మద్య దూరం పెరుగుతూవచ్చింది. జీ 23కి అసమ్మతి ముద్ర పడింది. అజాద సహా, జీ 23 నాయకులకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయింది. అవమనాలు ఎదురయ్యాయి. ఏ నేపధ్యంలోనే, పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ పార్టీకి రాజీనామా చేసి, ఎస్పీ మద్దతుతో రాజ్యసభకు ఎనికయ్యారు.మరో వంక  కొద్ది రోజుల క్రితం జమ్మూ కశ్మీర్’ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్’ పదవి పుచ్చుకున్నట్లే పుచ్చుకుని వద్దని వదిలేశారు. ఏఐసీసీ, జమ్మూ కశ్మీర్’ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్’ గా అయన పేరు ప్రకటించిన కొద్ది గంటలకే అయన రాజీనామా చేశారు. ఆయన వెనక, హిమాచల ప్రదేశ్ ప్రచార కమిటీ చైర్మన్ ఆనంద్ శర్మ అదే బాటలో  అడుగేశారు. ఆయన రాజీనామా చేశారు. 

అదలా ఉంటే, గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం కంటే, ఆయన తమ రాజీనామా లేఖలో ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశాలు అవుతున్న్నాయి. ఆజాద్ ఐదు పేజీల లేఖలో, ప్రధానంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. రాహుల్ గాంధీ అపరిపక్వ రాజకీయాల కారణంగానే కాంగ్రెస్ పార్టీకి ఈ దుర్గతి పట్టిందని, ఆరోపించారు. చివరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ 'చేయాల్సింది భారత జోడో యాత్ర కాదు..కాంగ్రెస్ జోడో యాత్ర అంటూ, నేరుగా రాహుల్ గాంధీ పైనే అస్త్రాలను ఎక్కుపెట్టారు. అంతేకాదు,  కాదు “ఏఐసీసీని నడిపే కోటరీ ఆధ్వర్యంలో పోరాడాలన్న సంకల్పం, సామర్థ్యాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. భారత్ జోడో యాత్ర కన్నా ముందు పార్టీ అధినాయకత్వం కాంగ్రెస్ జోడో యాత్రను చేపట్టాల్సింది" అని ఆజాద్ దుయ్యబట్టారు. రాహుల్‌గాంధీ ప్రవేశంతోనే కాంగ్రెస్‌కు కష్టాలు ఆరంభమయ్యానని ఆజాద్‌ ఆరోపించారు. అదే విధంగా 2019 ఎన్నికల ఓటమి తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడాన్ని తప్పుపట్టారు.  రాహుల్‌ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు అయ్యాక పార్టీ నాశనమైందని, అనుభవజ్ఞులైన నేతలను రాహుల్‌ పక్కకు పెడుతున్నారంటూ విమర్శించారు ఆజాద్‌. కొత్త కోటరీ ఏర్పాటు చేసుకొని అపరిపక్వ రాజకీయాలు చేశారని విమర్శించారు. పార్టీలోని సంస్థాగత మార్పుల కోసం లేఖ రాసిన 23 మంది నేతలను తీవ్రంగా అవమానించారని అని ఆయన అన్నారు.అలాగే, సోనియా గాంధీ, కేవలం నామమాత్రపు అధ్యక్షురాలిగా మిగిలిపోయారని, నిర్ణయాలు అన్నీ, రాహుల్ గాంధీ ఆయన చుట్టూ చేరిన కోటరీ తీసుకుంటోందని లేఖలో పేర్కొనారు. 
నిజానికి, ఆజాద్ ప్రస్తావించిన అంశాలు ఏవీ కొత్తగా వింటున్నవి కాదు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చాలా కాలంగా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అనేక మంది సీనియర్ జూనియర్ నాయకులు వ్యక్తిగత సంభాషణల్లో రాహుల్ గాంధీ కారణంగానే పార్టీ, రోజురోజుకు బలహీనమవుతోందని అంటూనే ఉన్నారు. అయితే, పిల్లి మెడడలో  గంట కట్టే ప్రయత్నం ఎవరూ చేయలేదు. నిజానికి, చేయలేదని అనేందుకు కూడా లేదు ఎందుకంటే, జీ 23 లేఖలో సంస్థాగతంగా పార్టీ బలోపేతం కావలసిన అవసరాన్ని, నొక్కి చెప్పారు.అలాగే, పార్టీ సీనియర్ నాయకులు సమయం వచ్చిన ప్రతి సందర్భంలోనూ పార్టీ అధ్యక్ష ఎన్నికల గురించి ఇతరత్రా తీసుకోవలసిన నిర్ణయాల విషయంలో హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా అధిష్టానం పట్టించుకోలేదు.

అయితే ఇప్పుడైనా పార్టీ, అధినాయకత్వం వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని, అడుగులు వేస్తుందా ? అంటే, అలాంటి సూచనలు కనిపించడం లేదు. అజాద్’ తమ లేఖలో ప్రస్తావించిన అంశాలను పక్కన పెట్టి, ఆయన రాజీనామాకు ఎంచుకున్న సమయం సరింది కాదని  పార్టీ తప్పుపడుతోంది. కాంగ్రెస్ పార్టీ వివిధ అంశాలపై బీజేపీతో పోరాడుతోన్న సమయంలో ఆజాద్ పార్టీని  వీడటం దురదృష్టకరమని పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ పేర్కొన్నారు. నిజానికి, కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకునేందుకు, ఆజాద్ రాజీనామా ఒక అవకాశం కల్పించింది. కానీ, పార్టీ అందుకు సిద్ధంగా ఉన్న దాఖలాలు అయితే కనిపించడంలేదనే పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తానికి అజాద్ రాజీనామాతో కాంగ్రెస్ ప్రస్థానం మరో మలుపు తిరిగింది.. పార్టీ భవిష్యత్ మరింత ప్రశ్నార్ధకంగా మారింది.

By
en-us Political News

  
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది. గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు, అభివృద్ధి , సుపరిపాలన, సంక్షేమం, సాధికారత విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది. అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సేవల వివరాలను అందించనుంది.
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.