జగన్మోహన్‌రావుపై వేటు..హెచ్ సీఏ నూతన అధ్యక్షుడిగా అమర్ నాథ్

Publish Date:Feb 3, 2026

Advertisement

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్సీఏ)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావుపై అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ సురేశ్‌కుమార్‌ కైత్‌ వేటు వేశారు. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఫోర్జరీ పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేసి.. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అమర్‌నాథ్‌ను  హెసీఏ అధ్యక్షుడిగా   ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ను బ్లాక్‌మెయిల్‌ చేశారన్న ఆరోపణలు రావడం,  సీఐడీ అరెస్టు నేపథ్యంలో జగన్మోహన్‌రావును ఇంతకుముందే హెచ్‌సీఏ సస్పెండ్‌ చేసింది. దీంతో ఉపాధ్యక్షుడు దల్జీత్‌సింగ్‌ హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంబుడ్స్‌మన్‌ తాజా తీర్పుతో అమర్‌నాథ్‌ పూర్తిస్థాయి అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ఉప్పల్‌ స్టేడియంలో నూతన అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌ బాధ్యతలు కూడా స్వీకరించారు.

2023 అక్టోబరు 20న జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో 63 ఓట్లు సాధించిన జగన్మోహన్‌రావు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఒక ఓటు తేడాతో అమర్‌నాథ్‌ రెండో స్థానంలో నిలిచారు. జగన్మోహన్‌రావు తప్పుడు పత్రాలు సమర్పించి అక్రమంగా పోటీ చేశారంటూ అంబుడ్స్‌మన్‌ను అమర్‌నాథ్‌ ఆశ్రయించారు. అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ కూడా అమర్‌నాథ్‌ వాదనలతో ఏకిభవించారు. మరోవైపు సన్‌రైజర్స్‌ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు చేసింది. శ్రీచక్ర క్లబ్‌ కోశాధికారిగా జగన్మోహన్‌రావు నకిలీ పత్రాలు సృష్టించి ఎన్నికల్లో పోటీ చేసినట్లు సీఐడీ నిర్ధారించింది. అధ్యక్షుడిగాఉన్న సమయంలో టెండర్లు లేకుండానే క్యాటరింగ్‌ కాంట్రాక్టులు కట్టబెట్టారని, అలానే ప్లంబింగ్, ఏసీలు, దుస్తుల కొనుగోళ్లలో కోట్లాది రూపాయల నిధులు పక్కదారి పట్టించారని ఆయనపై ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే 2025 జులై 9న సీఐడీ అధికారులు జగన్మోహన్ రావును అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

అమర్‌నాథ్‌ పిటిషన్‌ను విచారించిన అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ సురేశ్‌కుమార్‌ కైత్‌.. జగన్మోహన్‌రావు ప్రవర్తన హెచ్‌సీఏ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందని అభిప్రాయపడ్డారు. తప్పుడు పత్రాల ద్వారా పదవిని పొందడం వంటి తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తికి అధ్యక్షుడిగా కొనసాగే అర్హత లేదని అంబుడ్స్‌మన్‌ స్పష్టం చేశారు. హెచ్‌సీఏ ప్రయోజనాల దృష్ట్యా అధ్యక్ష పదవిని ఎక్కువ కాలం ఖాళీగా ఉంచలేమని పేర్కొన్న ఆయన ఎన్నికల్లో కేవలం ఒక్క ఓటు తేడాతో పరాజయం పాలై రెండో స్థానంలో నిలిచిన అమర్‌నాథ్‌ను అధ్యక్షుడిగాప్రకటిస్తున్నట్లు తీర్పు వెలువరించారు. త్వరలో ఐపీఎల్ జరగ నున్న నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడి నియమాకం అనివార్యమైంది.

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.