మీకు ఉదయాన్నే ఈ అలవాట్లు ఉన్నాయా? వెంటనే మానేయడం మంచిది..

Publish Date:Feb 13, 2025

Advertisement

 

శరీరాన్ని ఆరోగ్యంగా,  దృఢంగా ఉంచుకోవడానికి, సరైన ఆహారం, సరైన  జీవనశైలిని నిర్వహించడం చాలా ముఖ్యం.  రోజంతా ఏమి చేస్తారు, ఏమి తింటారు,  రోజును ఎలా గడుపుతారు అనేవి ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా  రోజును ఎలా ప్రారంభిస్తారనేది  ఆరోగ్యానికి డైరెక్ట్ గా లింక్ కలిగి ఉంటుంది.అందుకే ఆరోగ్య నిపుణులు రోజూ ఉదయాన్నే ప్రజలు ఫాలో అయ్యే కొన్ని చెడ్డ అలవాట్ల గురించి చెప్పుకొచ్చారు.  ఈ అలవాట్లు వెంటనే మానేయడం వల్ల ఆరోగ్యం విషయంలో చాలా మంచి మార్పులు వస్తాయని కూడా పేర్కొన్నారు.  ఇంతకీ ఉదయాన్నే మానుకోవాల్సిన అలవాట్లు ఏంటో తెలుసుకుంటే.

అల్పాహారం తరువాత..

 ఉదయం నిద్రలేచి, అల్పాహారం తీసుకుని, మళ్ళీ నిద్రపోయేవారు ఉంటారు.  ఇది జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది.  ఇలాంటి ఆహారపు అలవాటు ఉన్నవారు  అనేక కడుపు సంబంధిత సమస్యలతో బాధపడతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తరచుగా  ఉదయం నిద్రలేవగానే మొబైల్ లేదా టీవీ చూడటం చాలామందికి అలవాటైపోయింది. ఈ అలవాటు చిన్నదిగా అనిపిస్తుంది.  కానీ ఇది  వయస్సుకు ముందే వ్యక్తులను వృద్ధులను చేస్తోంది. మొబైల్ ఫోన్‌ను అధికంగా వాడటం వల్ల కళ్ళు,  మెదడుపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. ఇది నిద్ర నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది.

కాఫీ, టీ..

చాలా మంది టీ లేదా కాఫీ తాగడం ద్వారా తమ రోజును ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల శరీరంలో కెఫిన్ పరిమాణం పెరుగుతుంది. ఇది గుండె,  రక్తపోటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం   జీర్ణ ఆరోగ్యానికి మంచిది కాదు, ఈ అలవాటు వల్ల గ్యాస్, మలబద్ధకం,  అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.

వైద్యులేమంటారంటే..

ఆరోగ్యంగా ఉండటానికి  దినచర్యను మెరుగుపరచుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూసే అలవాటు ప్రమాదకరం. దానికి బదులుగా వార్తాపత్రికలు లేదా పుస్తకాలు చదవాలి. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. ఇది  మెదడుకు శక్తినిస్తుంది.  దీని వల్ల  రోజు ఆరోగ్యంగా  ప్రారంభమవుతుంది. చాలా మంది ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానం చేయకుండా ముఖం, చేతులు కడుక్కున్న తర్వాత పనికి వెళతారు. ఈ అలవాటును క్రమం తప్పకుండా అలవాటు చేసుకోవడం వల్ల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.  అనేక అంటు వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది.  దినచర్య,  రోజువారీ అలవాట్లను మెరుగుపరుచుకుంటే ఆరోగ్యంగా ఉండటం సులభం అవుతుంది.


                                              *రూపశ్రీ.

By
en-us Political News

  
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి..
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ..
దంతాల నొప్పితో బాధపడుతున్నారా? ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు గారు జామ ఆకుల ద్వారా పంటి నొప్పిని మరియు నోటి సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో వివరించారు. ఆ సింపుల్ హోమ్ రెమెడీస్ ఇక్కడ తెలుసుకోండి...
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.