దయచేసి ఈ పండ్లతో మిల్క్ షేక్ చేసుకుని తాగకండి!

Publish Date:Apr 18, 2026

Advertisement

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు,  ఫ్రూట్ మిల్క్ షేక్ లు తాగడానికే ఇష్టపడతారు. ప్రూట్ జ్యూస్ లు, ఫ్రూట్ షేక్ లు తాగినప్పుడు శరీరానికి చాలా స్వాంతన లభిస్తుంది. అయితే.. కొన్ని రకాల పండ్లతో ప్రూట్ మిల్క్ షేక్ తయారు చేసుకుని తాగడం అస్సలు మంచిది కాదట.  ఏ పండ్లతో మిల్క్ షేక్ లు తయారు చేసుకుని తాగకూడదు?  దీనికి గల కారణాలు ఏంటి? మిల్క్ షేక్ అంటే తెగ ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి..


సిట్రస్ ఫ్రూట్స్..

నారింజ, నిమ్మకాయ వంటి సిట్రస్ ప్రూట్స్ ను పాలతో కలిపి మిల్క్ షేక్ లు తయారుచేసుకుని తాగడమే కాదు.. అసలు పాలతో కలిపి తీసుకోకూడదు కూడా. వీటిలోని సిట్రిక్ యాసిడ్ పాలతో చర్య జరపడం వల్ల అది హానికరంగా మారుతుంది.  ఇలా తీసుకున్నప్పుడు ఎసిడిటీ,  కడుపునొప్పి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

పైనాపిల్..

పైనాపిల్ లో ఉండే ఎంజైమ్ లు పాలతో చర్య జరపడం వల్ల కడుపు సమస్యలు చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది.  అందుకే పైనాపిల్ ను పాలతో తీసుకోకూడదు,  పైనాపిల్ మిల్క్ షేక్ తాగకూడదు.

జామకాయ..

జామకాయను పాలతో కలిపి తీసుకోకూడదట.  ఎందుకంటే జామకాయ మిల్క్ షేక్ కడుపునొప్పికి కారణం కావచ్చు, అంతేకాకుండా.. కడుపు బరువుగా, ఉబ్బరంగా మారే అవకాశం ఉంటుంది.

సిట్రస్ పండ్లు+ అరటిపండ్లు మిల్క్ షేక్..

సిట్రస్ పండ్ల షేక్ తాగడమే ఆరోగ్యానికి మంచిది కాదు..అలాంటిది కొందరు సిట్రస్ షేక్ ను అరటిపండ్లతో కలిపి తాగుతుంటారు. ఇది అస్సలు మంచిది కాదు.. ఈ కాంబినేషన్ జీర్ణక్రియను నెమ్మది చేస్తుంది. జీర్ణక్రియను దెబ్బతీస్తుంది.

బొప్పాయి..

బొప్పాయి పండును మిల్క్ షేక్ గా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఇది చర్మానికి, జీర్ణక్రియకు అస్సలు మంచిది కాదు.

నిమ్మజాతి పండ్లు +మామిడి పండ్లు..

నిమ్మజాతి పండ్లు అయిన నారింజ, నిమ్మ,  బత్తాయి మొదలైన పండ్లను మామిడి పండ్లతో కలిపి తినకూడదట. ఈ కాంబినేషన్ శరీర వేడిని పెంచి కడుపు సమస్యలను పెంచుతుంది.

                                 *రూపశ్రీ.

By
en-us Political News

  
ధూమపానం ఆరోగ్యానికి హానికరం.  ఈ విషయాన్ని పేపర్ లు,  టీవీ యాడ్స్ మాత్రమే కాకుండా ఏకంగా  సిగరెట్ ప్యాకెట్ ల పైన కూడా రాసి ఉంటుంది. ఇలా ఎవరు ఎంత చెప్పినా సరే..
గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలకు ఇంట్లోనే వాము, ధనియాలు, జీలకర్ర, సోంపుతో ఆయుర్వేద చూర్ణం ఎలా తయారు చేయాలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించిన పూర్తి వీడియో.
మోకాళ్ల నొప్పి ప్రస్తుతం అన్ని వయస్సుల వారిలో కనిపిస్తున్న సాధారణ సమస్యగా మారింది. మెట్లు ఎక్కడం, నడవడం, ఎక్కువసేపు నిలబడటం వంటి రోజువారీ పనులు కూడా కష్టంగా అనిపిస్తాయి. ఈ వీడియోలో యోగా ఆచార్య ధాకారం గారు మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడే ...
గాలి కాలుష్యం, ఆహార కాలుష్యం, నీటి కాలుష్యం.. ఇలా ప్రతిదీ కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉన్నాయి.  బయటకు వెళ్లినప్పుడు వాహనాల పొగతో పాటు ఎన్నో కారణాల వల్ల గాలి కాలుష్యం అవుతుంది.
రోజుకు కేవలం 5 నిమిషాలు ఉద్గీత ప్రాణాయామం చేస్తే శరీరం, మనసుకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? సరైన విధానం, శాస్త్రీయ ప్రయోజనాలు, ఎవరు చేయాలి? ఎవరు చేయకూడదు? అనే వివరాలను సీనియర్ యోగా థెరపిస్ట్ శ్రీమతి శ్రావంతి రఘు ఈ వీడియోలో వివరించారు.
Black Spots on Onions,Are They Safe to Eat,Black Mold on Onions,What Black Spots on Onions Really Mean
gut microbiome, dysbiosis, gut brain connection, gut health, gut bacteria, good bacteria, bad bacteria, TeluguOne Health,
Avoid These Pulses During the Rainy Season,Stay Away from These Pulses,Dont Eat These Pulses During the Monsoon
ఈ రోజుల్లో క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు చాలా మందిని ప్రభావితం చేస్తున్నాయి. అయితే మన రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వర్షాకాలంలో చాలా మంది పకోరాలు, సమోసాల వంటి వేయించిన ఆహారాల కంటే మొక్కజొన్నను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు.
రక్తంలో క్లాట్స్ ఏర్పడకుండా ఉండేందుకు, రక్త ప్రసరణను మెరుగుపరచేందుకు, బరువు నియంత్రణకు తోడ్పడే వంటింటి సహజ చిట్కాలను ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు..
నేటికాలంలో ఉపవాసం కేవలం దేవుడు, సంప్రదాయం, మతానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు..  ఫిట్‌నెస్ ప్రపంచంలో కూడా ఉపవాసం  బాగా ప్రాచుర్యం పొందింది. 16:8 డైట్ వంటి పద్ధతుల నుండి రోజుకు ఒకసారి..
మెనోపాజ్ (Menopause) వచ్చిన తర్వాత మళ్లీ బ్లీడింగ్ రావడం సాధారణ విషయం కాదు. చాలా మంది మహిళలు దీనిని చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.