Publish Date:May 23, 2023
అవినాష్ రెడ్డి సీబీఐ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి పడుతున్న పాట్లు చూస్తుంటే.. వివేకా హత్య కేసులో ఆయన ప్రమేయాన్ని ఆయనే స్వయంగా అంగీకరిస్తున్నట్లుగా అనిపించకమానదు. లేకుంటే సీబీఐ అరెస్టు చేస్తుందేమోనని అంతగా భయపడాల్సిన అవసరమేంటో అర్థం కాదు. ఇదే వివేకా హత్య కేసులో స్వయానా ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది.
ఆ సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు వచ్చిందన్న ప్రచారమూ చేసుకున్నారు. అయినా సీబీఐ ఆయనను ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించి మరీ జైలుకు తరలించింది. మరి తన వద్దకు వచ్చే సరికి అవినాష్ ఎందుకు వణికిపోతున్నారు. పెద్ద గ్యాంగ్ స్టర్ లా మూకలను అడ్డుపెట్టుకుని ఎందుకు దాక్కుంటున్నారు. తల్లి అనారోగ్యం పేరు చెప్పి ఒక ఆస్పత్రినే యుద్ధభూమిగా మార్చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ప్రస్తుతం కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి వద్ద పరిస్థితి చూస్తే.. ఆ ఆస్పత్రిలో ఉన్న ఇతర రోగులు, వారి బంధువులను హోస్టేజీలుగా పట్టుకుని జగన్ రెడ్డి సీబీఐ తన వద్దకు రాకుండా నిలువరిస్తున్నారా? అన్న అనుమానం కలుగక మానదు. ఇక ఆయన చివరి ఆశ సుప్రీం కోర్టులో ఆయన పిటిషన్ విచారణ. ఆ విచారణలో కూడా అవినాష్ కు ఊరట లభించకుంటే..ఇక ఆయన అండర్ గ్రౌండ్ కు వెళ్లడమే తరువాయి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పులివెందుల నుంచి తల్లిని కర్నూలు తీసుకు వచ్చే విషయంలో కూడా ఆయన సీబీఐ సహా అందరినీ కన్ఫ్యూజ్ చేసేలాగే వ్యవహరించడాన్ని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఒక వేళ ఆయన కనుక తన తల్లిని కర్నూలు తీసుకువస్తున్నట్లు ముందుగానే సీబీఐకి సమాచారం ఇచ్చి బయలుదేరి ఉంటే.. విశ్వభారతి ఆసుపత్రి అవినాష్ అనుచరుల కబ్జాలోకి వెళ్లే అవకాశం వారిచ్చి ఉండేవారు కాదని, అప్పుడు అవినాష్ కు తప్పించుకునే అవకాశాలు ఉండేవి కావనీ అంటున్నారు. ఒక వైపు సీబీఐ బృందాలు ఛేజ్ చేస్తుండగా అండర్ గ్రౌండ్ కు వెళ్లే అవకాశం ఉండదన్న భావనతోనే ఆయన విశ్వభారతి ఆస్పత్రిలో షెల్టర్ తీసుకున్నారనీ, సుప్రీంను ఆశ్రయించడం, 27 వరకూ గడువు ఇవ్వాలంటూ సీబీఐని కోరడం ఇవన్నీ కూడా తప్పించుకునే వ్యూహంలో భాగమేనని అంటున్నారు.
సుప్రీం కోర్టులో ఒక వేళ ఆయనకు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిలు విచారణ పూర్తయ్యే వరకూ అరెస్టు నుంచి రక్షణ లభిస్తే.. ఆ సమయంలో ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్లే అవకాశాలే అధికంగా ఉన్నాయని జరుగుతున్న పరిణామాలను ఉటంకిస్తూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాంటి ఉద్దేశమే లేకుంటే.. అవినాష్ ఈ పాటికే సీబీఐ విచారణకు హాజరై ఒక వేళ సీబీఐ ఆయనను అరెస్టు చేసినా న్యాయస్థానాలలో బెయిలు కోసం ప్రయత్నించే వారనీ అంటున్నారు.
అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకెళ్లి బయటకు వచ్చిన సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. అందుకు భిన్నంగా సీబీఐ అరెస్టును తప్పించుకునేందుకు అవినాష్ ప్రయత్నిస్తున్నారంటే వివేకా హత్య కేసులో ఆయన ప్రమేయానికి సంబంధించిన పూర్తి ఆధారాలను సీబీఐ ఇప్పటికే సేకరించిందన్న సమాచారం ఆయనకు అందడమే కారణమంటున్నారు. అందుకే సీబీఐ అధికారులు తన సమీపానికి కూడా రానీయని విధంగా అవినాష్ రెడ్డి తనకు రక్షణగా ఆస్పత్రి వద్ద తన అనుచరులు, వైసీపీ మూకలను మోహరింపచేశారని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/avinash-trails-for-abscond-25-155770.html
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.