ఈ సారికి వెళ్లండి.. మళ్లీ రండి!

Publish Date:Mar 10, 2023

Advertisement

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ శుక్రవారం (మార్చి 10) ముచ్చటగా మూడో సారి విచారించింది. విచారణ ముగిసిన అనంతరం మళ్లీ పిలిచినప్పుడు రావాలని చెప్పి పంపించింది. యధా ప్రకారం విచారణ అనంతరం బయటకు వచ్చిన అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ సవ్యదిశలో సాగడం లేదని మీడియాకు చెప్పారు.

ఇలా ఉండగా అవినాష్ రెడ్డి సీబీఐ విచారణపై తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్ ను విచారించిన కోర్టు ఆయనను సోమవారం వరకూ అరెస్ట్ చేయవద్దని  సీబీఐని ఆదేశించింది.   కేసు పూర్తి వివరాల ఫైల్‌ను తమ ముందు ఉంచాలని ఆదేశించంది. కేసు విచారణలో భాగంగా సేకరించిన ఆడియో, వీడియో లను హార్డ్ డిస్క్ రూపంలో తమ ముందు ఉంచాలని కూడా  హైకోర్టు సీబీఐని ఆదేశిస్తూ  తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.  

తనను అరెస్టు చేయకుండా  సీబీఐకి ఆదేశాలివ్వాలని అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ  సందర్భంగా అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఈ   కేసులో సీబీఐ విచారణ ఏకపక్షంగా సాగుతోందన్నారు. రెండు దఫాలుగా అవినాష్ రెడ్డి నుంచి తీసుకున్న స్టేట్మెంట్‌ను పరిగణలోకి తీసుకోవద్దని కోరారు.   అవినాష్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను సీబీఐ ఎస్పీ రాంసింగ్ పదుల సార్లు ఎడిట్ చేశారని పేర్కొన్నారు. అంతే కాకుండా వివేకా హత్య కేసులో అసలు నేరస్థుడు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి  అని పేర్కొన్నారు.

ఇలా ఉండగా అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్‌లో వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె ఇంప్లీడ్ అయ్యారు.  తనపై వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేసినందున తమ వాదనలు వినాలని కోర్టును కోరారు.  మొత్తం మీద మూడో సారి విచారణకు సీబీఐ పిలవడంతో అవినాష్ రెడ్డి అరెస్టు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ విస్తృతంగా జరిగిన ప్రచారానికి తాత్కాలికంగా తెరపడింది. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సీబీఐ అవినాష్ రెడ్డికి చెప్పడంతో ఆయన అరెస్టు విషయంలో చర్చకు అయితే ఫుల్ స్టాప్ పడలేదు. మరో వైపు హైకోర్టు అవినాష్ రెడ్డిని విచారించిన సందర్భంగా రికార్డు చేసిన ఆడియో, వీడియోలను సమర్పంచాలని,  అలాగే సోమవారం వరకూ అరెస్టు చేయవద్దంటూ సీబీఐని ఆదేశించడంతో సోమవారం తరువాత ఏం జరుగుతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ వేగం చూస్తుంటే ఈ కేసు ముగింపు దశకు చేరుకుందన్న అభిప్రాయాన్ని న్యాయనిపుణులు వ్యక్తం చేస్తున్నారు. 

By
en-us Political News

  
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.