అవినాష్ రెడ్డి అఫిడవిట్ లో వివేకా హత్య కేసు

Publish Date:Apr 20, 2024

Advertisement

ఒక వైపు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిపై విమర్శలు చేస్తూ మాట్లాడకూడదంటూ కడప కోర్టు గాగ్ ఆర్డర్ ఇచ్చింది. మరో వైపు కడప లోక్ సభ వైసీపీ అభ్యర్థిగా  శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన అవినాష్ రెడ్డి తన అఫడివిట్ లో   వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి తనపై  రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. వాటిలో ఒకటి హత్య, రెండు సాక్ష్యాల విధ్వంసం కేసులు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఈ కేసులు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ లో తాను ఏ8 అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కేసు విచారణ సీబీఐ కోర్టులో కొనసాగుతోందని వివరించారు.  

ఈ రెండు క్రిమినల్ కేసులూ కాకుండా అదనంతా తనపై మైదకూరులో మరో కేసు ఉందని అవినాష్ రెడ్డి అఫిడవిట్ లో పేర్కొన్నారు.  ఇక ఆస్తుల విషయానికి వస్తే  తనకూ తన భార్యకూ కలిపి 25.51 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు. అలాగే 32.75లక్షల రూపాయల విలువ చేసే ఇన్నోవా కారు ఉందని,  అలాగే వెలమవారి పల్లె, భకరాపురం,అంకాలమ్మగూడూరులలో తన పేరుపై 27.04 ఎకరాలు ఉన్నాయని అఫిడవిట్ లో వివరించారు.  ఇవి కాకుండా తన భార్యపేరుపై విశాఖ పట్నంలో, కడప జిల్లాలోని వల్లూరు, ఊటుకూరు, పొనకామిట్టలో  33.90 ఎకరాల భూమి  ఉందని పేర్కొన్నారు.

ఎవరి నోటీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి మాట రాకూడదని కోర్టు ఆదేశాలున్నప్పటికీ, అవినాష్ రెడ్డి అనివార్యంలో తన ఎన్నికల అఫిడవిట్ లో  ఆ హత్య కేసుకు సంబంధించి తాను ఏ8గా ఉన్నాననీ, రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయనీ పేర్కొనక తప్పలేదు. మొత్తం మీద అనివాష్ ఎన్నికల అఫిడవిట్ ఇప్పుడు కడప వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 

By
en-us Political News

  
2014లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీని రకరకాలుగా  చిత్రహింసలకు గురిచేసి, ఉక్కిరిబిక్కిరి చేసి,
బంతి బంతికీ ఆధిక్యతలు మారిపోతూ, చివరి బంతి వరకూ విజయం అటా ఇటా అని దోబూచులాడుతుంటే.. ఒక మ్యాచ్ లో ఇంత కంటే మజా ఏముంటుంది? అలాంటి మ్యాచ్ ఐపీఎల్ లో భాగంగా గురువారం రాత్రి హైదరాబాద్- రాజస్థాన్ జట్ల మధ్య జరిగింది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనాచౌదరి విజయం సునాయాసమేనని తెలుగుదేశం కూటమి శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి. సుజనా చౌదరి విజయం కోసం కూటమి భాగస్వామ్యపక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి పని చేస్తున్నాయి.
తెలంగాణలో ఎండలు చండప్రచండంగా ఉన్నాయి. ఉదయం ఏడున్నర గంటల నుంచే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగానే నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం (మే2) శ్రీవారిని మొత్తం 65వేల 313 మంది దర్శించుకున్నారు.
జగన్ సంక్షేమ పథకాలన్నీ డొల్లే. అందుకు ఉదాహరణగా ఆరోగ్య శ్రీ పథకాన్ని చెప్పుకోవలసి ఉంటుంది. ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులైనవారికి ఉచితంగా చికిత్స పొందే విలువను రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంది. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇస్తున్నట్లు జగన్ ఆర్భాటంగా ప్రకటించారు.
కేదార్ నాథ్ ఆలయం సమగ్ర అభివృద్ధి పథకంలో భాగంగా, ఆలయ సమీపంలో రూపుదిద్దుకోనున్న కేదార్ పరిచయ్ మ్యూజియం నిర్మాణ నిపునిగా డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని కేంద్ర సాంస్కృతిక శాఖ నియమించింది.
ఎద్దు చేలో పడి మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పరిస్థితి కూడా ఇలాగే వుంది. పేర్ని కిట్టు తండ్రి పేర్ని నాని
చేవెళ్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి హేమాహేమీలు త‌ల‌ప‌డుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్ర‌స్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్‌ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వ‌ర్ రెడ్డి, జ్ఞానేశ్వ‌ర్ స్థానికులు.
గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో వున్న రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్
భయపడినట్టే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన పెన్షన్‌ జగన్ పుణ్యమా అని బ్యాంకులకు
నిందితులంతా ఆర్థికంగా, రాజ‌కీయంగా బాగా శక్తిమంతులని, ఏదో ఒక కారణం చూపుతూ పిటిషన్లు దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. ఏదో ఒక కారణంతో ఒక దాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ... దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, అత్యంత సీనియర్ అఖిల భారత సర్వీసు అధికారులు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, మీడియా హౌస్‌లు, అత్యంత ధనవంతులైన వ్యాపారులున్నారు. నిందితులుగా ఉన్న వ్యక్తులు, కంపెనీలు దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను ఉపయోగించుకుంటూ.. కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.