అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ తీర్పు వాయిదా
Publish Date:Apr 28, 2023
Advertisement
వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన శుక్రవారం కూడా తీర్పు రాలేదు. ఈ పిటీషన్ పై సుదీర్ఘంగా విచారణ సాగినప్పటికీ తీర్పు ఇవ్వలేమని
బెంచ్ పేర్కొంది. రేపటి నుంచే హైకోర్టుకు సెలవులు ఉన్నాయి కాబట్టి తీర్పు కోసం సుదీర్ఘ విచారణ జరిపినప్పటికీ న్యాయమూర్తి ఎవరూ ఊహించని విధంగా వాయిదా వేసారు. అత్యవసరమైతే చీఫ్ కోర్టుకు వెళ్లాలని న్యాయమూర్తి సూచించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ తీర్పు ఇన్ని రోజులు రిజర్వ్ పెడితే బాగుండదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. సీబీఐ తన పని తాను చేసుకుపోవచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు. సుప్రీం కోర్టు డైరెక్షన్ ప్రకారం ఈ కేసులో తాము జోక్యం చేసుకోబోమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జూన్ 5 కి వాయిదా పడింది.
http://www.teluguone.com/news/content/avinash-reddy-bail-adjourn-39-154449.html





