సుప్రీంలో అవినాష్ కు ఎదురుదెబ్బ

Publish Date:May 17, 2023

Advertisement

వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు చుట్టూ గుడుగుడు గుంచం గుండే రాగం అన్నట్లుగా తిరుగుతోంది. సీబీఐ అవినాష్ రెడ్డి విచారణ అరెస్టు వ్యవహారంలో ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా వ్యవహరిస్తోంది.  తాజాగా   తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉన్న ముందస్తు బెయిల్ పై సుప్రీంను ఆశ్రయించారు. అయితే అవినాష్ కు సుప్రీం కోర్టులో ఊరట దక్కలేదు. విచారణ తేదీని సీజేఐ ధర్మాసనం ఖరారు చేయలేదు. విచారణ అత్యవసరమని భావిస్తే లిఖిత పూర్వకంగా  అభ్యర్థించాలని, దానిని బట్టి తాము విచారణ తేదీని ఖరారు చేస్తామనీ సుప్రీం స్పష్టం చేసింది. 

 అదలా ఉంటే మంగళవారం విచారణకు హాజరు కావాల్సిన వివేకా పార్టీ కార్యక్రమాలు ఉన్నందున నాలుగు రోజులు వ్యవధి కావాలని కోరితే.. సీబీఐ రెండో ఆలోచన లేకుండా మూడు రోజులు గడువు ఇచ్చింది.  ఆ వెంటనే ఆయన బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉన్న ముందస్తు బెయిల్ పై సుప్రీంను ఆశ్రయించారు. తన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు వెంటనే తేల్చేలా ఆదేశాలివ్వాని కోరుతూ సుప్రీం ను ఆశ్రయించారు.   తన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ సుప్రీం పరిశీలనలో ఉండడం వల్ల త్వరగా విచారణ జరగడం లేదని ఆ పిటిషన్ లో పేర్కొన్న అవినాష్ రెడ్డి వెకేషన్ కోర్టులో  తన ముందస్తు బెయిల్ విచారణ ముగించేలా ఆదేశాలు ఇవ్వాలని.. అప్పటివరకు సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలనీ కోరారు. అదే సమయంలో  19న విచారణకు రావాలన్న సీబీఐ నోటీసుకు సమాధానమిస్తూ హాజరౌతానని పేర్కొన్నారు.  

ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి పి  సుప్రీంను ఆదేశించడం ఆసక్తికరంగా మారింది. అవినాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు ఏ నిర్ణయం వెలువరిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.  అదలా ఉంచితే.. వివేకా హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకున్న ప్రతిసారీ.. జగన్ రియాక్షన్ ఏలా ఉంటోందన్న విషయంలో సామాన్య జనమే కాదు పరిశీలకులు కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. మంగళవారం అవినాష్ రెడ్డి  సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఆయన వ్యవధి కోరారు. దాదాపుగా అదే సమయంలో జగన్ హస్తిన షెడ్యూల్ ఖరారైంది. నీతి ఆయోగ్ సమావేశానికి ఆయన ఢిల్లీ వెడుతున్నారు. ఆ సమావేశం ఈ నెల 27న కాగా జగన్ మాత్రం ఒక రోజు ముందు అంటే 26వ తేదీ నాటికే ఢిల్లీ చేరుకుంటారు. ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోడీతో భేటీ అవుతారని చెబుతున్నారు.

సాధారణంగా ఈ నాలుగేళ్లలో జగన్ నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన సందర్భాలు లే వు. విత్త మంత్రి బుగ్గనే జగన్ తరఫున ఆ సమావేశాల్లో పాల్గొన్నారు. అలాంటిది ఈ సారి బుగ్గనను వద్దని జగన్ స్వయంగా వెళుతున్నారు. ఆయన పర్యటన లక్ష్యం నీతి ఆయోగ్ సమావేశం కాదనీ, తన బాబాయ్ హత్య కేసులో తమ పార్టీ ఎంపీని చిక్కుల నుంచి తప్పించడానికేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ హస్తిన పర్యటన పూర్తయ్యే వరకూ తన అరెస్టును నిలువరించుకునేందుకే అవినాష్.. మరోసారి సుప్రీంను ఆశ్రయించారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. ఇప్పటికే ఇదే ముందంస్తు బెయిలు పిటిషన్ పై సుప్రీం కోర్టు, తెలంగాణ హైకోర్టు కూడా తమ అభిప్రాయాలను చెప్పేశాయి. ముందస్తు బెయిలు పిటిషన్ విచారణను వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు.. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సీబీఐకి ఎటువంటి ప్రతిబంధకాలూ లేవని విస్పష్టంగా చెప్పేసింది.

అంతకు ముందు ముందస్తు బెయిలుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టు కొట్టి వేయడమే కాకుండా ఇలాంటి ఆదేశాలు కూడా ఇస్తారా అంటూ అసహనం వ్యక్తం చేసింది. దీంతో అవినాష్ ఇప్పుడు తాజాగా సుప్రీంను తన ముందస్తు బెయిలు పిటిషన్ ను త్వరగా విచారించేలా హైకోర్టును ఆదేశించాలంటూ సుప్రీం ను ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  అయితే సుప్రీంలో ఆయనకు ఊరట లభించకుండటంతో ఇక అరెస్టు అనివార్యం అన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. 

By
en-us Political News

  
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.