జైల్లో ఏ7ని కలిసిన ఏ8 భేటీ

Publish Date:Jun 15, 2023

Advertisement

కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి గురువారం చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. జైలులో ఉన్న తన తండ్రి వైయస్ భాస్కరరెడ్డిని పరామర్శించారు. తండ్రి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని ఆయనే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా తండ్రికి ఆరోగ్యంపై అవినాష్ రెడ్డి పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంత చిన్నాన్న వైయస్ వివేకా హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డితోపాటు ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఈ హత్య కేసులో వైయస్ భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు గతంలోనే అరెస్ట్ చేసి.. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆయితే ఇటీవల ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తండ్రిని కలిసేందుకు వైయస్ అవినాష్ రెడ్డికి జైలు అధికారులు అనుమతి ఇచ్చారు.  

మరోవైపు వివేకా హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు మరో సారి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వగా.. తన తల్లి తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని.. ఆ క్రమంలో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్నారని... ఆమెకు సహయంగా ఉండాల్సి ఉందంటూ కారణం చూపుతూ.. సీబీఐ విచారణను వాయిదా వేస్తూ వచ్చారు.

ఆ క్రమంలో సీఎం వైయస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి రావడం.. ఆ తర్వాత వైయస్ అవినాష్ రెడ్డికి కోర్టు నుంచి ముందస్తు బెయిల్ లభించడం చకచకా జరిగిపోయాయి. అయితే వివేకా హత్య కేసులో వైయస్ భాస్కరరెడ్డి ఏ7 ముద్దాయి కాగా, వైయస్ అవినాష్ రెడ్డి ఏ8 ముద్దాయిగా ఉన్న విషయం విదితమే.

By
en-us Political News

  
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.