పరీక్షకి భయపడితే బట్టతల వచ్చేసింది!

Publish Date:Aug 4, 2016

Advertisement

 

మన రోజువారీ జీవితాల మీద ఒత్తిడి చూపే ప్రభావం అంతా ఇంతా కాదని అందరికీ తెలిసిందే! ఒత్తిడి మన ఆలోచనా విధానమే కావచ్చు. కానీ అది మన ఆరోగ్యం మీద చూపే ప్రభావం దారుణంగా ఉంటుంది. అజీర్ణం దగ్గర్నుంచీ గుండెపోటు వరకూ ఒత్తిడి ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో రోజూ చదువుతూనే ఉన్నాము. కానీ ఈ వారం అంతర్జాతీయ పత్రికలలో వచ్చిన ఓ వార్త ఒత్తిడి గురించి మరింత భయాన్ని రాజేసింది. అదేమిటంటే...

 

కేటీ అన్నా మూర్‌ అనే 20 ఏళ్ల యువతి ఇంగ్లండులోని బోర్నెమోత్‌ విశ్వవిద్యాలయంలో చదువుతోంది. కేటీకి, పట్టులా ఒత్తుగా ఉండే తన పొడవాటి జుట్టంటే మహా ఇష్టంగా ఉండేది. అలాంటిది ఒక రోజున తలస్నానం చేస్తుండగా, గుప్పిళ్ల నిండా జుట్టు చేతికంది రావడం చూసి నిర్ఘాంతపోయింది కేటీ. అలా అడపాదడపా ఊడటం మొదలుపెట్టిన జుత్తు, రోజులు గడిచేకొద్దీ విపరీతంగా రాలిపోయింది. ఒక రెండు వారాలు గడిచేసరికి దాదాపు 70 శాతం జుట్టు రాలిపోయింది.

 

కేటీ తన అరకొర జుట్టుతో తరగతులకు వెళ్లడానికి కూడా సిగ్గుపడిపోయింది. ఇక తన గదిని ఖాళీ చేసి తండ్రి దగ్గరకు వెళ్లిపోయింది. కేటీ సమస్యను విన్న వైద్యులు ఎన్ని పరీక్షలు చేసినా ఉపయోగం లేకపోయింది. చివరికి తేలిందేమంటే... మరో రెండు నెలలలో విశ్వవిద్యాలయంలో జరగబోతున్న పరీక్షల విషయంలో ఒత్తిడికి లోనవ్వడం వల్ల కేటీ జుత్తు అలా రాలిపోయిందట. పైగా మిగిలిన కాస్త జుత్తు కూడా ఊడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించి పంపారు వైద్యులు.ఇంతకీ కేటీకి వచ్చిన రుగ్మత పేరు- ‘అలోపేసియా అరేటా’! శరీరం తన సొంత కణాలనే శత్రువులుగా భావించి, వాటి మీద దాడి చేయడంలో (autoimmune disease) ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. సాధారణంగా జన్యువుల కారణంగా వచ్చే ఈ ‘అలోపేసియా అరేటా’ కొన్ని సందర్భాలలో తీవ్రమైన ఒత్తిడి వల్ల కూడా ఏర్పడవచ్చని చెప్పుకొచ్చారు. అందుకు కేటీ ఉదంతమే ఒక ఉదాహరణ.

 

సాధారణంగా ఈ వ్యాధికి గురైనవారిలో ఓ నెల నుంచి సంవత్సరం లోపల మళ్లీ జుట్టు వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే అలా జుట్టు మళ్లీ పెరగడానికి స్టెరాయిడ్లను వాడాల్సి రావచ్చు. పైగా ఒకసారి ఈ రుగ్మత వచ్చి మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నవారిలో మళ్లీ మళ్లీ వ్యాధి తిరగబెట్టే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే కేటీ ఇక మరో గత్యంతరం లేక ఓ విగ్గుని కొనుక్కోవాలని అనుకుంటోంది. ఆ విగ్గు కొనుక్కోవడం కోసం తనకు సాయం చేయండంటూ ఆన్‌లైన్‌లో (https://www.gofundme.com/katieswig) అభ్యర్థిస్తోంది.

 

అదండీ విషయం! ఒత్తడి ఎంత పని చేస్తుందో మనకి మరోసారి తెలిసివచ్చింది కదా! అందుకే మన జీవితాలలోకి ఒత్తిడి ప్రవేశించకుండా జాగ్రత్తపడదాం. బతుకు అనే ఈ సముద్రాన్ని అలవోకగా దాటేందుకు ప్రయత్నిద్దాం.

 

- నిర్జర.

By
en-us Political News

  
పిల్లలు ఫోన్ వాడితే కళ్ళు పాడవుతాయా? కంటి అలసట, స్క్రీన్ టైమ్ ప్రభావం, ఐ ఎక్సర్‌సైజులు మరియు కంటి ఆరోగ్యంపై డా. కాసు ప్రసాద్ రెడ్డి ఇచ్చిన ముఖ్యమైన సూచనలు తెలుసుకోండి.
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆహారంలో రకరకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని వైద్యులు చెబుతారు...
ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా  ఖాళీ సమయంలో..  చాలామంది  చిప్స్, నామ్కీన్, బిస్కెట్లు , ఇతర జంక్ ఫుడ్‌ను తింటుంటారు...
భారతీయుల ప్రధాన ఆహారం అన్నం.  మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు రోజులో కనీసం రెండు పూటల అయినా అన్నం ఉండాల్సిందే.. ఒకవేళ మధ్యాహ్న  భోజనంలో అయినా,  రాత్రి భోజనంలో అయినా చపాతీ లాంటివి తిన్నా....
వినికిడి లోపం అంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా శబ్దాలను వినలేకపోవడం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలా సందర్భాలలో వినికిడి సమస్యలు మెల్లిగా  మొదలవుతాయి. మొదట్లో దీని లక్షణాలు  చాలా సాధారణంగా అనిపిస్తాయి...
ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నరాల బలహీనత మరియు విపరీతమైన నీరసం. షుగర్, బీపీ, అధిక బరువు, పోషకాహార లోపం లేదా దీర్ఘకాలికంగా వాడే కొన్ని మందుల....
ఎసిడిటీ నేటి కాలంలో చాలా మందిలో కామన్ గా మారిన సమస్య.  చిన్న వయసు వారి నుండి పెద్దల వరకు అందరికీ గ్యాస్, ఎసిడిటీ పెద్ద సమస్యగా మారుతోంది. మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం,  రాత్రి  ఆలస్యంగా..
ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తుంటారు. చర్మాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి..
ఇంట్లో కాఫీ, టీలు సాధారణంగా స్టీల్ లేదా పింగాణీ కప్పులలో తాగుతారు. కానీ బయటకు వెళ్లినప్పుడు చాలామంది  దుకాణాల దగ్గర కాఫీ..
ఎక్కిళ్లు ఏ వయసు వారికైనా వచ్చే ఒక సాధారణ సమస్య. ఎక్కిళ్లు సాధారణంగా కొన్ని నిమిషాల్లో వాటంతట అవే ఆగిపోతాయి, కానీ కొన్నిసార్లు అవి తగ్గకుండా చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి...
మన చుట్టూ ఉండే ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధాలలో జామ ఆకులు ఒకటి. ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే లభించే ఈ జామ ఆకులతో కషాయం....
ఈ రోజుల్లో ఎయిర్ కండిషనర్లు (ఏసీలు) విలాస వస్తువు లా కాకుండా ఒక అవసరంగా మారాయి. ఇంట్లో, ఆఫీసులో, లేదా కారులో అయినా,  పగలు రాత్రి తేడా లేకుండా ఏసీల చల్లని గాలిలో సమయం గడుపుతారు...
నేటి కాలంలో నిమ్మరసం ఎంతో ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి . శరీరాన్ని చల్లబరచడం నుండి డీహైడ్రేషన్‌ను నివారించడం వరకు నిమ్మరసం ప్రయోజనాలు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.