డ్రైవింగ్ చేస్తూ సినిమా చూసిన ఆటో డ్రైవర్.. సీపీ సజ్జనార్ సీరియస్.!

Publish Date:Oct 14, 2026

Advertisement

హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. ఒకవైపు నావిగేషన్‌.. మరోవైపు సినిమా.. చెవులకు పెద్ద హెడ్‌ఫోన్లు పెట్టుకుని రంగురంగుల లైట్ల మధ్య వాహనం నడుపుతున్న ఈ ఆటో డ్రైవర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆటో నంబర్ TG15U2657గా గుర్తించగా, ఈ వింత  ప్రమాదకర సెటప్‌ను చూసిన ప్రయాణికులు, నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడటానికి ఇదో మల్టీ-స్క్రీన్ గేమింగ్ విన్యాసంలా అనిపించినా, వెనుక కూర్చున్న ప్రయాణికుల పాలిట మాత్రం ఇది నడుస్తున్న మృత్యుశకటంగా మారుతోంది.

రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు డ్రైవర్ దృష్టి పూర్తిగా ప్రయాణంపైనే ఉండాలి. ఒక్క క్షణం దృష్టి మళ్లినా ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులు, రోడ్డు మలుపులు కనిపించక ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాంటిది డ్రైవింగ్ చేస్తూనే నేరుగా సినిమా చూడటం, చెవులకు హెడ్‌ఫోన్లు లేదా ఇయర్‌బడ్స్ ధరించడం వల్ల బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా పోతుంది. దీనివల్ల రహదారిపై ఎమర్జెన్సీ హారన్లు, ఇతర వాహనాల హెచ్చరికలను గమనించే సామర్థ్యం పూర్తిగా సన్నగిల్లుతుంది. ఆటోలో ప్రయాణించేవారు డ్రైవర్‌పై నమ్మకంతో తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని ఆశిస్తారు. కానీ డ్రైవర్లు వినోదం కోసం ఇలాంటి మొబైల్ మాయాజానంలో మునిగిపోతే అమాయక ప్రయాణికుల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.

మోటారు వాహనాల చట్టం (MV Act) ప్రకారం రహదారి భద్రతకు ముప్పు కలిగించేలా, ఇతరుల ప్రాణాలకు ప్రమాదం తెచ్చేలా డ్రైవింగ్ చేయడం తీవ్రమైన నేరం. ఇలాంటి డేంజరస్ డ్రైవింగ్‌కు పాల్పడేవారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి భారీ జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దయ్యే అవకాశమూ ఉంది. వినోదం కోసం వాహనాన్ని థియేటర్‌గా మార్చడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ఈ వ్యవహారంపై స్పందించిన సైబరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్, సంబంధిత ట్రాఫిక్ అధికారులను (HYDTP) అప్రమత్తం చేస్తూ ఆటో డ్రైవర్‌ను గుర్తించి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సంఘటన కేవలం ఆటోలకే పరిమితం కాకుండా కార్లు, టూవీలర్లు, బస్సులు, లారీలు వంటి అన్ని రకాల వాహనాల డ్రైవర్లకు ఒక హెచ్చరిక లాంటిది. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్లు, హెడ్‌ఫోన్లు వాడకం ఎంతటి ప్రాణాంతకమో దీని ద్వారా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు కూడా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. డ్రైవర్ ఫోన్ చూస్తున్నా, సినిమా చూస్తున్నా లేదా చెవుల్లో హెడ్‌ఫోన్లు పెట్టుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ప్రయాణికులు మౌనంగా ఉండకూడదు. వెంటనే వారిని వారించాలి. ఒకవేళ డ్రైవర్ హెచ్చరికలను పట్టించుకోకుండా ప్రమాదకరంగా వాహనం నడిపితే, ఏమాత్రం వెనుకాడకుండా డయల్ 112కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలి. ప్రయాణంలో మీ అప్రమత్తత మీ ప్రాణాలను కాపాడటమే కాకుండా ఎందరో అమాయకుల ప్రాణాలను రక్షిస్తుందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.

 

 

 

[ Auto Driver Watches Movie, Hyderabad Traffic News, Sajjanar Warning, Dangerous Driving, Road Safety rules, Dial 112, CM Revanth reddy, Minister ponnam prabhakar, Telugu One, Telugu News ]

By
en-us Political News

  
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.