ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌ అరెస్ట్‌

Publish Date:Apr 7, 2026

Advertisement

 

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సిడ్నీలో మద్యం మత్తులో కారు నడుపుతూ పోలీసులకు చిక్కిన ఘటన కలకలం రేపింది. న్యూ సౌత్ వేల్స్ పోలీసులు నిర్వహించిన సాధారణ తనిఖీల్లో భాగంగా వార్నర్ కారును ఆపి ర్యాండమ్ బ్రెత్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షలో ఆయన రక్తంలో ఆల్కహాల్ శాతం అనుమతించిన పరిమితి కంటే రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు.

దీంతో నిబంధనలు ఉల్లంఘించినందుకు పోలీసులు వార్నర్‌ను అదుపులోకి తీసుకుని మారుబ్రా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత షూరిటీపై విడుదల చేశారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో భాగంగా వార్నర్ వచ్చే మే 7, 2026న సిడ్నీలోని డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఈ కేసులో ఆయన డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కావడంతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.

పీఎస్ఎల్ మధ్యలో సిడ్నీకి...

ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026లో కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్, మ్యాచ్‌ల మధ్య విరామం లభించడంతో తన స్వస్థలం సిడ్నీకి వెళ్లారు. ఈ సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన వార్నర్ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

By
en-us Political News

  
వైజాగ్‌లో కాగ్నిజెంట్ ఐటీ సెజ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మధురవాడ, రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న ఇళ్ల అద్దెలు మరియు కొత్త ఐటీ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల మాస్టర్ ప్లాన్ కోసం 6 నెలల డెడ్‌లైన్ విధించారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యాలు, వైజాగ్ బే సిటీ ప్రాజెక్ట్ విశేషాలు మరియు రాయలసీమ హార్టికల్చర్ విప్లవంపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హెబ్బాల్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న సిగ్నల్ రహిత కారిడార్, సదాహళ్లి అండర్‌పాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫినిష్ ది జాబ్ అంటూ ఓవల్ ఆఫీస్ నుండి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టెహ్రాన్‌లో వ్యక్తమవుతున్న ప్రతీకార జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై  కేసు నమోదు చేశారు.
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్‌లైన్‌లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా పోర్ట్‌ఫోలియోలోని వి మార్క్ ఇండియా మల్టీబ్యాగర్ స్టాక్ ఒక్కరోజే 81% పతనమైందా ఇన్వెస్టర్లు ఎందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదో, 5:1 బోనస్ షేర్ల వెనుక ఉన్న అసలు మార్కెట్ లెక్కలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకోండి.
కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో దాదాపు 8 శాతం పడిపోయాయి. ఆదాయం పెరిగినప్పటికీ, ప్రత్యర్థి టైటాన్ కంపెనీ ఫలితాల ప్రభావం మరియు మార్కెట్ అంచనాల వల్ల ఈ భారీ పతనం సంభవించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
నోబుల్ సంస్థ సరికొత్తగా తెచ్చిన నోబుల్ ఆస్ప్రే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ పూర్తి రివ్యూ. $199 ధర, బ్లూటూత్ 6.0, LDAC సపోర్ట్ ఉన్నా ఈ ఇయర్‌బడ్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయో ఇక్కడ చదవండి.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో వైరల్ హిట్ నింజా లక్స్ కేఫ్ ప్రీమియర్ ఎస్ప్రెస్సో మెషిన్‌పై ఏకంగా 53% భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఆస్ట్రేలియాలో ఆల్-టైమ్ లో ధరకు దొరుకుతున్న ఈ త్రీ-ఇన్-వన్ కాఫీ మేకర్ ఫీచర్లు, ధర వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.