టీ20 వరల్డ్ కప్ లో పాక్ కు షాక్.. కివీస్ తో ఆసీస్ ఫైనల్ పోరు...

Publish Date:Nov 11, 2021

Advertisement

టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్ సమరం ఎవరి మధ్యే తేలింది. కివీస్ తో ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా  తలపడనుంది. గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఆసీస్  విజయం సాధించింది. పాకిస్తాన్ విధించిన 177 పరుగులను చివరి ఓవర్ లో సాధించింది ఆసిస్. ఆరో వికెట్ కు స్టయినిస్, వేడ్ అద్బుతంగా ఆడి ఆసిస్ కు సంచలన విజయం అందించారు. తొలి ఓవర్ లో ఫించ్ డకౌట్ అయ్యాడు. తర్వాత వార్నర్ , మార్ష్ స్లోగా ఆడారు. ఐదో ఓవర్ లో ఫోర్ , సిక్సర్ తో దూకుడు పెంచాడు. దీంతో ఆరో ఓవర్ లో 50 పరుగులు దాటింది ఆసీస్ స్కోర్. ఏడో ఓవర్ లో మార్ష్ అవుట్ కావడంతో పాక్ పట్టు సాధించింది. తొమ్మిది ఓవర్ లో వార్నర్ సిక్సర్ బాదగా.. అదే ఓవర్ లో స్మిత్ అవుట్ కావడంతో ఆసీస్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. 11 ఓవర్ లో 49 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర వార్నర్ కూడా అవుట్ కావడంతో ఆసీస్ కష్టాల్లో పడింది. 

96 పరుగుల దగ్గర మాక్స్ వెల్ ను అవుట్ చేసి మ్యాచ్ పై మరింత పట్టు సాధించింది పాకిస్తాన్.  పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసిస్ టార్గెట్ రన్ రేట్ పెరుగుతూ పోయింది. స్ఠయినిస్ ధాటీగా ఆడటంతో ఆసిస్ కు మళ్లీ అవకాశాలు కన్పించాయి. 17 ఓవర్ లో స్టయినిస్ సిక్సర్, ఫోర్ కొట్టడంతో పాక్ శిబిరం డీలా పడింది.  18 ఓవర్ లో వేడ్ సిక్సర్ బాది ఆసిస్ ను విజయానికి చేరువ చేశాడు. 19 ఓవర్ లో స్టయినిస్ ఇచ్చిన క్యాచ్ ను హసన్ విడిచిపెట్టాడు. తర్వాత వేడ్ మూడు వరుస సిక్సర్లు కొట్టి  మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. 

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ అజామ్‌ శుభారంభం అందించారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. మ్యాక్స్‌వెల్‌ వేసిన మూడో ఓవర్‌లో చెరో ఫోర్‌ కొట్టగా.. హేజిల్‌వుడ్ వేసిన ఐదో ఓవర్‌లో రిజ్వాన్ ఓ సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో పాక్‌ 9 ఓవర్లకు 68/0తో నిలిచింది. ఈ క్రమంలోనే జంపా వేసిన పదో ఓవర్‌లో చివరి బంతికి బాబర్‌ అజామ్‌.. వార్నర్‌కి చిక్కాడు. తర్వాత రిజ్వాన్ జోరు పెంచాడు. 

జంపా వేసిన వేసిన 12 ఓవర్‌లో వరుసగా సిక్స్‌, ఫోర్‌ బాదాడు. హేజిల్‌వుడ్ వేసిన 17వ ఓవర్‌లో రిజ్వాన్‌ ఫోర్‌, సిక్సర్‌ బాదగా.. జమాన్‌ కూడా సిక్స్‌ బాదాడు. దీంతో ఈ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. స్టార్క్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో రిజ్వాన్‌.. స్మిత్‌కి చిక్కాడు. అదే ఓవర్లో జమాన్‌ ఫోర్‌, సిక్స్ కొట్టాడు. 19 ఓవర్‌లో అసిఫ్‌ అలీ (0), చివరి ఓవర్‌లో షోయబ్‌ మాలిక్ (1) వెనుదిరిగారు. ఆఖరి ఓవర్‌లో ఫకార్‌ జమాన్‌ రెండు సిక్స్‌లు బాదడంతో పాక్‌ భారీ స్కోరు సాధించింది.  ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ రెండు, కమిన్స్‌, జంపా తలో వికెట్ తీశారు.  

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.