రెండవ విడత కోవిడ్ మరణాల పై ఆడిట్.. కేంద్రానికి పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సిఫారసు

Publish Date:Sep 14, 2022

Advertisement

రెండవ విడత కోవిడ్ మరణాలు, ఆక్సిజన్ కొరత పై ఆడిట్ చేయాల్సిందేనని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ  కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పని తీరు పై పార్లమెంటు స్థాయీ సంఘం కేంద్రానకి సమర్పించిన నివేదికలో ఈ మేరకు సిఫారసు చేసింది.    వైద్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పని తీరుపై స్థాయీ సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.  అత్యవసర సమయం లో  సదరు మంత్రిత్వ శాఖ పూర్తి  నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సభాసంఘం ఆ నివేదికలో పేర్కొంది.

రెండవ విడత కోవిడ్ మరణాలను సమీక్షించాలని, ఆక్సిజన్ కొరత ఏర్పడిందా లేదా  అన్న అంశం అలాగే మరణించిన కుటుంబాలకు, బాధితులకు అందించిన నష్ట పరిహారం పై ఆడిట్ జరగాలని  సమాజ్ వాదీ పార్టీ నేత రాం గోపాల్ యాదవ్  నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ తన నివేదికలో కేంద్రానికి సూచించింది.  వైద్య కుటుంబ సంక్షేమ శాఖపై  పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమర్పించిన రిపోర్టులో కోవిడ్ మరణాలకు ఆక్సిజన్ కొరత కారణం గా మరణించారా లేదా ?అన్న అంశం పై  నిజనిర్ధారణ చేయాలని సూచించింది.

ఈ మేరకు మరణించిన కుటుంబలాకు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం, ఆక్సిజన్ అందించడం అత్యవసర సమయం లో సకాలం లో వైద్యసహాయం అందించడం లో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని   స్టాండింగ్ కమిటీ అభిప్రాయ పడింది .అసలు కోవిడ్ కారణంగా దేశంలో సంభవించిన మరణాల సంఖ్య ఎంత,  ఆ మరణాలకుఆక్సిజన్ కొరత కారణమా అన్న అంశంపై ఆడిట్ అవసరమనిపేర్కొంది. వైద్య కుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాలలో కోవిడ్  మరణాల పై ఆడిట్ నిర్వహించాలని వాటిని తప్పని సరిగా రికార్డు చేయాలని స్టాండింగ్ కమిటీ  పేర్కొంది. ఇటువంటి ఆడిట్  ప్రభుత్వ బాద్యతగా కమిటీ పేర్కొంది. పారదర్శకత తో ప్రభుత్వ సంస్థలు జవాబుదారీ తనంతో వ్యవహరించాలని ఆక్సిజన్ కొరత ఉందా లేదా?సహజ మరణాలు ఎన్ని? కోవిడ్ కారణంగా సంభవించిన మరణాల సంఖ్య ఎంత? ఆక్సిజన్ అందక మరణించిన వారెంతమంది బాధితులకు ఇచ్చిన నష్టపరిహారం వివరాలు   తెలపాలని కమిటీ కోరింది. అయితే చాలా ప్రాంతాలాలో రోగుల కుటుంబ సభ్యులు  ఆక్సిజన్ సిలిండర్ల కోసం క్యూ లైన్లలో  నిలబడ్డ ఘటనలు ఉన్నాయని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఇటువంటి   ఘటనలపై  మీడియాలో కధనాలు వెలువడిన ఉదంతాలను ఉటంకించిన స్థాయీ సంఘం రాష్ట్రాలు ఆక్సిజన్ కొరతను తెలుపుతూ ఎన్ని విజ్ఞప్తులు చేసినా  సరఫరాలో జాప్యం జరిగిందని పేర్కొంది. ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాలో రిగా వ్యవహరించలేదని డిల్లి ప్రభుత్వం చేసిన ఆరోపణలను కమిటీ పరిగణలోకి తీసుకుంది. ఇదే అంశం పై దిల్లి హైకోర్ట్ కేంద్రాన్ని  మందలించిన విషయాన్ని కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది.

ఆ  తరువాత వినియోగించని ఆక్సిజన్ ట్యాంకార్ల ను తిప్పి పంపిన  విషయం కమిటీ తీవ్రంగా పరిగణించింది. కాగా గతం లో కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను కేంద్ర పాలిత ప్రాంతాలను మరణించిన వారి వివరాలాను ఇవ్వాలని కోరిన విషయాన్ని కమిటీ గుర్తు చేసింది. రెండవ విడత కోవిడ్ పరిస్థితులపై, ఆక్సిజన్ కొరత పై  2౦ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలాలో పరిశీలించి నివేదికను రూపొందించినట్లుపార్లమెంటు స్థాయీ సంఘం తన నివేదికలో పేర్కొంది.           

By
en-us Political News

  
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.