అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం.. ఏపీ ప్రభుత్వం రోడ్‌మ్యాప్!

Publish Date:Jul 8, 2026

Advertisement

దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న అగ్రీగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం నడుంబిగించింది. పదేళ్లుగా కళ్లల్లో ఒత్తులు వేసుకుని, తాము దాచుకున్న ప్రతి పైసా తిరిగి వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్న అగ్రీగోల్డ్ బాధితులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో  న్యాయపరమైన చిక్కులన్నిటినీ   వేగంగా పరిష్కరించి..   ఆరు నెలల వ్యవధిలోనే సొమ్ములు బాధితులకు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ క్రమంలో అగ్రీగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియను ఆరు నెలలలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేలం ద్వారా వచ్చే నిధులతో బాధితులకు నేరుగా డబ్బులు చెల్లించేలా ఒక స్పష్టమైన, పారదర్శరమైన  కార్యాచరణను  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెడీ చేసింది.  సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. 

ఈ మంత్రివర్గ ఉపసంఘం భేటీలో  మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ నేరుగా పాల్గొనగా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్‌గా హాజరయ్యారు.  ఈ సమస్య పరిష్కారానికి,  కేసుల  విచారణ వేగవంతం కావడానికి ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటుతో పాటు, ప్రతి 15 రోజులకోసారి ఈ మంత్రుల కమిటీ సమావేశమై పురోగతిని   సమీక్షించాలని ఈ భేటీ నిర్ణయించింది. 

ప్రభుత్వ లేక్కల మేరకు.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా సుమారు 11.57 లక్షల మంది అగ్రిగోల్డ్  బాధితులున్నారు.  వీరందరికీ కలిపి మొత్తం  3 వేల 944 కోట్లు చెల్లించడమే లక్ష్యంగా ప్రస్తుత ప్రభుత్వం ఈ రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది. అగ్రిగోల్డ్‌కు చెందిన వేలాది కోట్ల విలువైన ఆస్తుల పరిరక్షణపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 23 వేల 599 ఎకరాల భూములను అధికారులు ఇప్పటికే  గుర్తించారు. ఈ భూములన్నింటినీ పూర్తిగా జియో ట్యాగింగ్ చేయడం ద్వారా రికార్డులను   డిజిటల్ రూపంలో భద్రపరచనున్నారు. తద్వారా ఎలాంటి ఆక్రమణలు జరగకుండా ఆస్తులను కాపాడనున్నారు. మరోవైపు సీఐడీ దర్యాప్తులో సుమారు  2 వేల కోట్ల రూపాయల విలువైన బాండ్లు ఏజెంట్ల వద్దనే ఉండిపోయినట్లు  గుర్తించారు. ఈ నకిలీ లేదా హోల్డ్ లో ఉన్న బాండ్లను నెలరోజుల్లో  పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు  చర్యలు చేపట్టనున్నారు.  

AP Government roadmap, AgriGold victims repayment, Vangalapudi Anitha, Nadendla Manohar, Telugunews

By
en-us Political News

  
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
కన్యాకుమారి యూట్యూబర్ ఇంట్లో ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారం, భారీగా నగదు చోరీకి గురయ్యాయి. సోషల్ మీడియాలో రీల్స్ కోసం చూపించిన సంపదే దొంగలను ఆకర్షించిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నింబోలి అడ్డాలో చిన్నారి బాలుడిపై దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల చర్యల కథనం.
హైదరాబాద్ ఐటీ హబ్ మాదాపూర్‌లోని ఒక ఓయో హోటల్ గదిలో యువతి దారుణంగా హత్యకు గురైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో ఒక ఆటో డ్రైవర్ దారుణంగా హత్యకు గురయ్యారు. ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహం తరలింపు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందాల గాలింపు మరియు హత్యకు గల కారణాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఇంగ్లాండ్‌లోని టెల్‌ఫోర్డ్‌లో సిక్కు బస్సు డ్రైవర్‌పై దాడి చేసి, బస్సును అపహరించి రాంగ్ రూట్‌లో బీభత్సం సృష్టించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వైరల్ అవుతున్న వీడియో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
నిజామాబాద్ ఆర్‌ఆర్ చౌరస్తాలో వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడు సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెల్లెలి హత్యకు 6 నెలల తర్వాత పక్కా ప్లాన్‌తో 10 సెకన్లలో 9 సార్లు కత్తితో నరికి చంపిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ రిベンజ్ మర్డర్ కేసు పూర్తి వివరాలు తెలుసుకోండి.
కర్ణాటక ఐపీఎస్ అధికారిణి డి. రూపా 20 ఏళ్ల సర్వీస్‌లో 40 బదిలీలు ఎదుర్కొన్నా భయపడకుండా అవినీతిపై పోరాడుతున్నారు. శశికళ జైలు కుంభకోణం, రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని నిలిచిన ఆమె నిజాయితీ సాహస గాథ ఇక్కడ చదవండి.
ఐపీఎస్ అధికారిణి సంజుక్తా పరాశర్ సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక కమాండో విభాగం కోబ్రా (CoBRA)కు తొలి మహిళా ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
పెళ్లయిన కేవలం రెండు వారాల్లోనే అమెరికాలోని మాసాచుసెట్స్‌లో హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల ఇంజనీర్ జాబీర్ హుస్సేన్ నిద్రలోనే కన్నుమూశారు. ఉదయం తల్లితో మాట్లాడిన కొద్ది గంటలకే చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన వివరాలు, కుటుంబ సభ్యుల ఆవేదన మరియు పార్థివదేహం రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై పూర్తి కథనం.
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.