అత్తారింటికి దారేది టీజర్ సరికొత్త రికార్డ్
Publish Date:Jul 16, 2013
Advertisement
మెగాభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ‘అత్తారింటికి దారేది’ టీజర్ విడుదలయింది. ఊహించిన దానికంటే అది చాలా అద్భుతంగా ఉండటంతో మెగాభిమానుల ఆనందానికి అంతే లేదు. ముఖ్యంగా పవర్ స్టార్ తన స్టైల్లో పలికిన “వీడు ఆరడుగుల బులెట్...వీడు దైర్యం విసిరిన రాకెట్” డైలాగ్ కి వారుఆనందంతో కేరింతలు కొట్టారు. పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా వెరయిటీగా, మంచి కలర్ ఫుల్ గా చాలా బాగుంది. యూ ట్యూబ్ లో టీజర్ విడుదలయిన గంటలోనే అనేకవేల హిట్స్ రావడమే అది పవర్ స్టార్ అభిమానులకు ఎంతగా నచ్చేసిందో తెలియజెపుతోంది. కేవలం 38గంటలలో 4,68,564 మంది దానిని వీక్షిస్తే, 10,119 లైక్స్, మరియు 4724 కామెంట్స్ దానికి వచ్చాయి. ఇది తెలుగు చిత్ర సీమలో మరో సరికొత్త రికార్డని నిర్మాత బీ.వీ.యస్.యన్.ప్రసాద్ తెలిపారు. టీజర్ను అంతగా ఆదరించిన ప్రజలకి, మెగాభిమానులకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన ఆడియో రిలీజ్ మరియు వచ్చేనెల 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన అందాల భామలు సమంత మరియు ప్రణీతలు హీరోయిన్ లుగా నటించారు. పవర్ ఫుల్ డైలాగులకి పెట్టింది పేరయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కధ నందించి, దర్శకత్వం చేసారు. యువతరాన్ని ఉర్రూతలూగించే దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణ ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలు. వీటిని ప్రసిద్ద ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ రూపొందించారు. ఈ సినిమాను బీ.వీ.యస్.యన్.ప్రసాద్ తన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రవేట్ లిమిటడ్ బ్యానర్ పై నిర్మించగా, దానిని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సమర్పిస్తోంది. కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: రవీందర్.
http://www.teluguone.com/news/content/attarinti-daredi-new-record-32-24368.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్‌లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్‌లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





