బంగ్లాలో హిందువులపై దాడులు... హైదరాబాద్ అలర్ట్ 

Publish Date:Aug 10, 2024

Advertisement

నిన్న రిజర్వేషన్లతో అట్టుడికి బంగ్లాదేశ్ నేడు హిందువులపై దాడులతో అట్టుడికుతోంది. పలు దేవాలయాల మీద బంగ్లా ముస్లింలు దాడులు చేస్తున్న నేపథ్యంలో హైద్రాబాద్ అలర్ట్ అయ్యింది. ప్రపంచంలో ఎక్కడ మతకలహాలు జరిగినా ఆ ప్రభావం హైద్రాబాద్ పై పడుతుంది. ఇప్పటికే పాతబస్తీలో అదనపు పోలీస్ బలగాలు మొహరించాయి. బంగ్లాలో శాంతిభధ్రతలు అదుపు తప్పడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్ లో తలదాచుకున్నారు. అభధ్రతా భావంలో ఉన్న ప్రజలు బెంగాల్ గుండా హైద్రాబాద్ లోకి చొరబడుతున్నట్టు ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ కు సమాచారమందింది. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ ప్రభుత్వం బంగ్లాలో అధికారంలో ఉంది. కేవలం 8 శాతం మంది మాత్రమే హిందువులు ఉన్నారు. ఎక్కువగా కృష్ణ దేవాలయాలు ఉన్నాయి. వాటిని ధ్వంసం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అక్కడ హిందువులు రోడ్డెక్కారు. మేమే ఈ దేశ ప్రజలమని నినదిస్తున్నారు. 170 మిలియన్లలో ఎనిమిది శాతం ఉన్న హిందువులు శాంతిని నెలకొల్పాలని నినదిస్తున్నారు. హిందువుల ఇళ్లు, దేవాలయాలకు పలువురు ముస్లింలు రక్షణగా నిలిచారు. బంగ్లాదేశ్ నుంచి రోహ్యింగాలు ఎక్కువగా పాతబస్తీలో బస చేస్తున్నారు. వారికి ఆధార్ కార్డులు, వోటర్ కార్డులు కూడా వచ్చేశాయి. ఒక రాజకీయ పార్టీ ప్రోద్బలంతో రోహ్యింగాలు పాత బస్తీలో మకాం వేశారు.తాజాగా బంగ్లా నుంచి హిందువులు ఎక్కువగా హైద్రాబాద్ కు వచ్చే అవకాశాలున్నట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ కు సమాచారమందింది. ‘‘హైదరాబాద్ లో అత్యంత పురాతన దేవాలయాలు ఉన్నాయి.  గంగా జమునా తెహజీబ్ కు హైదరాబాద్  ప్రతీక. లౌకికవాదం, మతసామరస్య పరిరక్షణలో దేశానికే హైదరాబాద్  ఆదర్శం. మరీ ముఖ్యంగా ఇక్కడ  ముస్లింలు, హిందువులు అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. హిందువుల పండుగల్లో ముస్లింలు.. ముస్లిం ప్రార్ధనల్లో హిందువులు పాల్గొంటారు. ఎవరికి కష్టం వచ్చినా.. ఒకరికొకరు అండగా ఉంటారు. తాజాగాజరుగుతున్న అల్లర్లలో అక్కడ బంగ్లా ముస్లింలు హిందూ దేవాలయాలకు రక్షణ వలయంగా నిలిచారు. హైదరాబాద్ ముస్లింలు కూడా రక్షణగా నిలుస్తారు. అల్లర్లు జరిగినప్పుడు  స్థానిక   ముస్లింలే వలయంగా నిల్చొని గాజిబండ కామాక్షి దేవాలయాన్ని రక్షించిన విషయాన్ని  ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, మానసిక నిపుణురాలు యమునాపాఠక్  గుర్తు చేశారు.   ప్రస్తుతం బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకురాలుగా కొనసాగుతున్న ఆమె హైద్రాబాద్ లో విద్వేషాలను రెచ్చగొట్టడం సరి కాదన్నారు. హిందువులు, ముస్లింలు కల్సి పండగలు చేసుకునే సాంప్రదాయం  అనాదిగా కొనసాగుతుందన్నారు. కష్ట సమయంలో హిందువులకు ముస్లింలు అండగా నిలిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో అండగా నిలుస్థారని యమునాపాఠక్ విశ్వాసం వ్యక్తం చేశారు. బంగ్లాలో అల్లర్ల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో మొహరింపు ఎక్కువయ్యింది. 

By
en-us Political News

  
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.