రాప్తాడులో వైసీపీ నాయకుల వీరంగం
Publish Date:Aug 27, 2022
Advertisement
రాష్ట్రంలో వైసీపీ పార్టీవారి వీరంగం మరింత పెరిగిందన్న అభి ప్రాయాలు రాష్ట్రమంతటా వెల్లు వెత్తు తు న్నాయి. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు రెచ్చి పోయా రు. పట్టపగలు అందరూ చూస్తుండగానే టీడీపీ నాయకులపై భౌతిక దాడికి దిగారు. అచ్చం సినిమాల్లో సీన్ తలపించేవిధంగా ఉందన్నారు. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మేజర్ పంచాయతీ ఉప సర్పంచి వైసీపీ నాయకుడు ఎం.రాజారెడ్డి మరికొందరితో కలిసి టీడీపీలోకి చేరేందుకు మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురానికి శుక్రవారం (ఆగష్టు 26 )ఉదయం బయలుదేరారు. వీరివెంట మండలంలోని టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. వీరి వాహనాలు కుంటిమద్ది చెరువు కట్ట మీదకు వెళ్లగానే వైసీపీ నాయకులు తమ వాహనాలు అడ్డుగా ఉంచారు. ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర్‌రెడ్డి, అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. ఆయన కూడా టీడీపీ నాయ కులపై భౌతిక దాడులు చేశారు. మాజీ ఎంపీపీ అంకే అమరేంద్ర, టీడీపీ నాయకులు వడ్డే దుర్గా, అమరేంద్ర రెడ్డి తదితరులపై దాడి చేశారు. ఇష్టం వచ్చినట్లు తిడుతూ, కాళ్లతో తంతూ వీరంగం సృష్టించారు. దీంతో స్థానికులూ ఎంతో భయాందోళనకు గురయ్యారు. ఉప సర్పంచి రాజారెడ్డిని కారులో నుంచి బయటకు లాగి, వైసీపీ నేతల వాహనంలోకి తోసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పరిటాల సునీత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ చెన్నే కొత్తపల్లికి బయలుదేరారు. వీరిని రామగిరి పోలీసు స్టేషన్ వద్ద పోలీసులు అడ్డు కున్నారు. దీంతో పోలీసుల తీరును ఖండిస్తూ, స్టేషన్ ఎదుటే వారు బైఠాయించారు. టీడీపీ జిల్లాఅధ్యక్షుడు బీకే పార్థసారథి కూడా అక్కడికి చేరుకుని, నిరసనకు దిగారు. రాప్తాడు, ధర్మ వరం నియోజకవర్గాల నుంచి టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున చేరుకోవడంతో రెండు గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దాడి జరిగినట్లు ఆధారాలు చూపిస్తే ఎమ్మెల్యే సోదరుడిని అరెస్టు చేస్తామని, అలా చేయక పోతే తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తానని సీఐ చిన్నగౌస్ శపథం చేశారు. రెండు వర్గాలూ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి.
http://www.teluguone.com/news/content/attack-on-tdp-leaders-in-raptadu-25-142727.html