Publish Date:Aug 12, 2022
ఉత్తరాఖండ్‌లో భారీవర్షాలు, వరదలతాకిడితో అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఇటీవలి వరదల తాకిడికి సుమారు ఎనిమిది దుకాణాలు, ఏటీఎం కూడా వరద నీటిలో కొట్టుకుపోవడం ఆశ్చర్యపరు స్తున్నది. జువెలరీ దుకాణాలు, సుమారు పాతిక లక్షలతో ఉన్న ఏటీఎం మునిగి వరదల్లో కొట్టుకుపో వడం, చూసి ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారు.
ఉత్తరకాశీ వద్ద నీటి ఉదృతి మరింత పెరగడంతో వరద తాకిడి ఊహించని స్థాయికి చేరుకుంది. దీంతో ఉత్తరకాశీలోని పురోలా బాగా దెబ్బతిన్నది. ముఖ్యంగా కుమోలా ఖాడ్ నీటి స్థాయి ఈ వర్షాల కారణంగా పెరిగిపోవడంతో పరిస్థితులు భయానకంగా మారాయని అధికారులు అంటున్నారు. చెట్లు, దుకాణాలతో పాటు ఏటీఎం కూడా బొమ్మల్లా కొట్టుకుపోవడం చూసినవారు వీడియో తీసి నెటిజన్లకు అందుబాటులో ఉంచారు.
ఇదేవిధంగా, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు, వరదల కారణంగా పర్వతాలు మట్టిపెళ్లలు పెద్దస్థాయిలో విరిగి పడ్డాయని అక్కడి ప్రజలు తెలిపారు. ఉత్తరకాశీలో హైవేలు వరద నీటిలో మునిగి పోయాయి. వర్షాలు, వరదలతో సాధారణ జనజీవనం అస్తవ్యస్థమయింది. పర్యాటకులు, ప్రాంతీయ ప్రజ లు అనేక మంది నానా అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగా, దెహరాడూన్ ఛాబ్రా గ్రామంలో ఉదయం నుంచీ భారీ వర్షాలు ముంచెత్తాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎస్‌డి ఆర్ ఎస్ దళాలు డెహ్రాడూన్ చేరుకున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/atm-25-141809.html
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.