అయ్యో అలీ... ఇంతా చేసి దక్కిన పదవి ఇదా?

Publish Date:Oct 27, 2022

Advertisement

అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నామినేటెడ్ పోస్టుతో సరిపెట్టారు. టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీకి ఏపీ సీఎం జగన్ మూడున్నరేళ్లు అదిగో పదవి.. ఇదిగో పదవి అని ఊరించి ఊరించి చివరికి ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా  నియమించారు.ఈ పదవిలో అలీ రెండేళ్లు కొనసాగుతారు.

టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ తెలుగు తెరపై చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలెట్టి హీరోగా, కమెడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు. ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో  2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో వైసీపీ గూటికి చేరాడు. ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీకి ఎన్నో సేవలు అందించాడు. దీంతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అలీకి రాజ్యసభ టికెట్ హామీ ఇచ్చారు. మూడున్నరేళ్లు గడిచిపోయాయి. అలీకి పదవి దక్కలేదు.. సరికదా పార్టీలో ఆయన ఒకరు ఉన్నారన్న విషయమే ఎవరికీ తెలియదన్నట్లుగా అలీ పరిస్థితి తయారైంది.

ఇప్పుడు పుణ్యకాలం దాదాపుగా పూర్తయిన తరువాత ఇక తప్పదన్నట్లు తనకు ఓ సలహాదారు పదవిని అప్పగించి జగన్ చేతులు దులుపుకోవడం పట్ల అలీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయనకు సన్నిహితంగా మెలిగే వారు చెబుతున్నారు. రాజ్యసభ లేదా వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి కావాలని కోరిన తనకు ఊరించి..ఊరించి చివరికి ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి కట్టబెట్టడం పట్ల అలీ సంతోషంగా లేరనీ, తాను కోరింది, కోరుకున్నది ఇలాంటి పదవి కాదని తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు చెబుతున్నారు. అలీలో అసంతృప్తి గూడకట్టుకుందన్న విషయాన్ని గమనించి ఏదో బుజ్జగించడానికే ఈ పదవి కట్టబెట్టారని అలీ చెబుతున్నారని ఆయన సన్నిహితులే అంటున్నారు.

అయితే అయితే అలీ  బహిరంగంగా అసంతృప్తి వెల్లగక్కలేదు. ఏది ఏమైనా అలీకి సలహాదారు పదవిపై మాత్రం సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు పేలుతున్నాయి. జగన్ నిజ్జంగానే అలీకి పదవి ఇచ్చారు అంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.  అలీ ఇంటికి అల్లుడు వచ్చిన వేళా విశేషమో మరేమో కానీ,(ఈ మధ్యనే అలీ తమ కుమార్తె వివాహం చేశారు)ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయనకు పదవి కట్టబెట్టారని జోకులేస్తున్నారు.

నిజానికీ ,అలీ, పోసానీలతో పాటుగా మోహన్ బాబు ఫ్యామిలీ, పృధ్విరాజ్ గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ రెడ్డి ఒక్క పృద్వీని మాత్రమే ఎస్వీబీసీ టీవీ చానల్ చైర్మన్ పదవికి నామినేట్  చేశారు. అది కూడా మూడు నాళ్ళ ముచ్చటగానే ముగిసి పోయింది. ఆయనపై ఏవో ఆరోపణలు రావడంతో ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీని పక్కన పెట్టేశారు. పృధ్విరాజు పార్టీకి దూరమయ్యారు.

అటు మోహన్ బాబు కూడా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అలీ, పోసాని మాత్రం ఇంకా పార్టీని వదల కుండా  చకోర పక్షుల్లా జగన్ రెడ్డి దయకోసం, కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. జబర్దస్త్ రోజా మంత్రి పదవికోసం ఎంతగా తాపత్రయ పడ్డారో, అంతకంటే ఎక్కువగా అలీ, పోసాని నామినేటెడ్ పదవుల కోసం తాపత్రయ పడుతున్నారని అంటారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఆలీని ఒకటికి రెండు సార్లు ఇంటికి పిలిచి మరీ ఒట్టి చేతులతో పంపించారు. రెండు మూడు సార్లు ఆయనకు పదవులు కేటాయించినట్టు ప్రచారం సాగింది. తొలుత రాజ్యసభ, ఆ తరువాత కేబినెట్ హోదాతో సమానమైన వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి అలీకి కేటాయించనున్నారన్న ప్రచారం జరిగింది. అలీ దంపతులు కలిసిన సందర్భంలో మీకు గుడ్ న్యూస్ చెబుతానంటూ స్వయంగా జగన్ చెప్పడంతో పాపం అలీ అమాయకంగా ఉబ్బితబ్బిబ్బయ్యారు. అయితే గుడ్ న్యూస్ ఏదీ అలీ చెవిన పడలేదు.  ఇప్పుడు ఇంత కాలానికి అలీకి ఓ పదవి కట్టబెడుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నా.. అదేమీ అలీకి గుడ్ న్యూస్ కాదని అంటున్నారు. ఎందుకంటే..

రాజ్యసభకు ద్వైవార్షిక ఎన్నికలు జరిగిన ప్రతిసారీ రాష్ట్రం నుంచి ఎంపిక చేసే అభ్యర్థుల జాబితాలో అలీ పేరు ప్రముఖంగా వినిపించేది. సినీ సమస్యలు చర్చించేందుకు చిరంజీవి, నాగార్జున, ప్రభాస్‌ తదితరులతోపాటు అలీని కూడా సీఎం జగన్ ప్రత్యేకంగా పిలిపించారు.  ఆ తర్వాత అలీ మీడియాతో మాట్లాడుతూ... ‘త్వరలోనే మంచి రోజు వస్తుంది’ అని   సీఎం స్వయంగా చెప్పారంటూ ఉబ్బితబ్బిబ్బైపోయాడు.  దీంతో అలీకి రాజ్యసభ స్థానం పక్కా అని అలీతో సహా అంతా భావించారు.  అది జరగలేదు. ఆ తర్వాత   అలీని మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌గా నియమిస్తారంటూ ప్రభుత్వం నుంచే లీకులు వచ్చాయి. అదీ జరగలేదు. చివరకు   ఇప్పటికే ఇద్దరు మీడియా సలహాదారులుండగా  మరో సలహాదారుగా అలీ కంటితుడుపుగా ఒక పదవిని కట్టబెట్టారు. ఇప్పటికే  మీడియా సలహాదారుగా జీవీడీ కృష్ణమోహన్‌, జాతీయ మీడియా సలహాదారుగా దేవులపల్లి అమర్ ఉండగానే ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అనే కొత్త పోస్టును సృష్టించి దానిని అలీకి కట్టబెట్టారు జగన్. 

By
en-us Political News

  
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది.
గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు.
 ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  
యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.