ఓవైసీ! దయచేసి మా ఊర్లో అడుగుపెట్టద్దు

Publish Date:Jan 30, 2013

Advertisement

 

ఓవైసీ సోదరులిరువురూ కాంగ్రెస్ పార్టీకి తలాక్ ఇచ్చి బయటకి వచ్చిన తరువాత, తమ మజ్లిస్ పార్టీని రాష్ట్రమంతా విస్తరించాలనే తాపత్రయంతో సభలు సమావేశాలు నిర్వహించి నోరు జారారు. దాని పర్యవసానంగా నిత్యం కోర్టులు, పోలీసులు, కేసులు అంటూ ఇప్పుడు తిరుగుతున్నారు. దీనికి తోడూ, పోలీసులు వారిపై ఉన్న పాతకేసులు కూడా తిరగాదోడటంతో, ఇక వారికిప్పుడు తమ పార్టీ గురించి కానీ, సభల గురించి గానీ ఆలోచించే తీరికేలేకుండా పోయింది. అయినప్పటికీ, దెయ్యం వెంటబడినట్లు వారిపై వివిధ రాష్ట్రాలలో నమోదయిన కేసులు ఇప్పటికీ వారి వెంటబడుతూనే ఉన్నాయి.

 

ఇదే క్రమంలో, బుధవారంనాడు ఔరంగాబాద్‌ పోలీసులు స్వయంగా వచ్చి అసదుద్దీన్‌ ఓవైసీకి కోర్టు సమన్లు అందజేయడమే గాకుండా, అయన ఇంటిని కూడా తణికీలు చేశారు. పనిలో పనిగా అయన వచ్చే నెల 1వ తేదీన ఔరంగాబాద్‌లో తలపెట్టిన బహిరంగసభకు అనుమతి నిరాకరిస్తునట్లు కూడా తెలియజేసారు. అసుదుద్దీన్ ఓవైసీ మరో మారు తన ఉపన్యాసం ద్వారా ప్రశాంతంగా ఉన్న తమ నగరంలో చిచ్చుపెట్టే అవకాశం ఉందని భావించిన ఔరంగాబాద్‌ కమిషనర్‌. ఫిబ్రవరి 1 నుంచి మార్చి నెలాఖరువరకు తమ నగరంలో ఎటువంటి సభలకు అనుమతినీయమని స్పష్టం చేశారు. అందువల్ల అసుదుద్దీన్ ఓవైసీని తమ నగరంలోకి సభల కోసం అడుగు పెట్టవద్దని ఆయన సూచించారు.

By
en-us Political News

  
Bipin Rawat last minutes in eye witness version, bipin rawat, helicopter, crash, spot, cds,
భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం దేశ ప్రజలను, ఆర్మీ వర్గాలను కలవరానికి గురి చేసింది.  అత్యంత భద్రత, సురక్షితమైనదిగా చెబుతున్న MI-17v5 హెలికాప్టర్ క్రాష్ కావడం నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది.
చట్టం ముందు అందరూ సమానమే కానీ, రాజకీయ నాయకులు కొంచెం ఎక్కువ సమానమని సామాన్యులు అనుకుంటే, కాదనేందుకు కారణాలు కనిపించవు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ మొదలై, ఇంచుమించుగా పుష్కరకాలం పూర్తయింది. అయినా, విచారణ సాగుతూనే వుంది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్ ) పైనే రచ్చ రచ్చ అవుతోంది. ఓటీఎస్ స్కీమ్ పై జనాలు భగ్గుమంటున్నా మొండిగా ముందుకు వెళుతోంది జగన్ సర్కార్. ఎవరికి బలవంతం లేదు.. స్వచ్ఛందమే అని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నా... క్షేత్రస్థాయిలో మాత్రం జనాలను బెదిరిస్తూ అధికారులు వసూల్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఏడాది కింద‌టి విష‌యం. దేశ‌మంతా లాక్‌డౌన్‌. ప్ర‌జ‌ల‌పై క‌ఠిన ఆంక్ష‌లు అమ‌ల్లో ఉన్నాయి. ఎలాంటి పండుగ‌లూ, వేడుక‌లూ జ‌ర‌ప‌వ‌ద్ద‌ని ఆదేశాలు ఇచ్చారు. రూల్స్ బ్రేక్ చేస్తే.. జ‌రిమానాలు వేస్తామ‌నే హెచ్చ‌రికలు జారీ అయ్యాయి. దేశ‌వ్యాప్తంగా ఇంత‌టి క‌ఠిన నిబంధ‌న‌లు విధించిన దేశ ప్ర‌ధాని కొలువుదీరి ఉన్న పీఎంవో ఆఫీసులోనే లాక్‌డౌన్ స‌మ‌యంలో గ్రాండ్ పార్టీలు జ‌రిగితే..? విందు, వినోదం.. ఆట‌, పాట‌ల‌తో ప్ర‌ధాని కార్యాల‌య సిబ్బంది సంబ‌రాలు చేసుకుంటే..? అంత‌కంటే దారునం ఇంకేమైనా ఉంటుందా? ఆంక్ష‌లు విధించిన పాల‌కుల స‌న్నిధిలోనే అధికారులు అలా పార్టీలు చేసుకోవ‌డం ఏమ‌న్నా సమంజ‌స‌మా? అందుకు దేశ ప్ర‌ధాని జాతికి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. త‌ప్పు చేసిన అధికారుల‌పై వేటు వేశారు. ఈ విష‌యం బ్రిట‌న్‌లో ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్‌.
బిపిన్ రావ‌త్ హెలికాప్ట‌ర్‌కు ప్ర‌మాదం జ‌రిగింది. వెంట‌నే జ‌నాలంతా గూగుల్‌లో వెతికారు. ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ తెలుసుకున్నారు. రావ‌త్ అనే కాదు.. ప్ర‌జ‌ల‌కు ఏ స‌మాచారం కావాల‌న్నా.. గూగుల్ త‌ల్లిని అడిగేస్తుంటారు. క‌రోనా టైమ్‌లో అయితే.. గూగులే అంద‌రికీ దిక్చూచిగా నిలిచింది. ఇక క్రికెట్ మ్యాచ్‌లు అయితే.. గూగుల్‌లో లైవ్ అప్‌డేట్స్ చూడాల్సిందే. ఇలా.. 2021లో గూగుల్‌లో మోస్ట్ ట్రెండింగ్‌గా నిలిచిన టాపిక్స్ ఏంటో తెలుసా...? తాజాగా, 2021లో భారతీయులు గూగుల్‌ (Google Trends 2021)లో ఎక్కువగా వెతికిన సమాచారానికి సంబంధించిన జాబితాను గూగుల్ విడుదల చేసింది. అవేంటంటే....
భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతి  పట్ల పార్లమెంట్ ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనపై కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉభయసభల్లో  ప్రకటన చేశారు. హెలికాప్టర్ ప్రమాదం చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని జగన్మోహన్ రెడ్డి సర్కార్ మరో యూ టర్న్ తీసుకుంది. గ్రామ కార్యదర్శులను మహిళా కానిస్టేబుళ్లుగా మారుస్తూ జారీ చేసిన జీఓ నెంబరు 59ను  వెనక్కి తీసుకుంది. గురువారం జీవో నెం.59పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో  జీవోను ఉపసంహరించుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.
హెలికాప్టర్ ప్రమాదంలో తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ఆకస్మికంగా మృతి చెందారు. తమిళనాడులోని కున్నూర్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో రావత్ సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. అయితే.. తదుపరి సీడీఎస్ ఎవరనే అంశంపై ఊహాగానాలు ఇప్పడు దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో  భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ చనిపోవడం పట్ల పార్లమెంట్ ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. బిపిన్ రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనపై కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉభయసభల్లో  ప్రకటన చేశారు. హెలికాప్టర్ ప్రమాదం చాలా దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు.
భార‌త సైన్యంలోకే అత్యున్న‌త హోదా. దేశ తొలి సీడీఎస్‌. అంత‌కుముందు ఆర్మీ చీఫ్‌. అలాంటి బిపిన్ రావ‌త్‌ స‌తీమ‌ణి మ‌ధులికా సేవా కార్య‌క్ర‌మాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. భ‌ర్త ఆర్మీ ఆప‌రేష‌న్స్‌లో బిజీగా ఉంటే.. భార్య సైనికుల సేవ‌లో, ప్ర‌జా సేవ‌లో నిమ‌గ్న‌మ‌య్యేవారు. అలాంటి మ‌ధులికా.. రావ‌త్‌తో పాటే హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో చనిపోవ‌డం బాధాక‌రం. 
రాహుల్ గాంధీ పుణ్యాన కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది. అది నిజం. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఏనాడు లేని విధంగా వరసగా రెండు సార్లు ఎన్నికల్లో ఓడిపోవడమే కాకుండా, రెండు సార్లు రెండంకెల స్థానాలకే పరిమితం అయింది. అయినా, ఈనాటికి కూడా, దేశంలో కాంగ్రెస్ పార్టీకి 20 శాతం వరకు ఓటు షేర్ ఉంది.
తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటనలో తెలుగుతేజం, పారా కమాండో బి.సాయితేజ మరణం అందరికీ దుఃఖకారణమే. సాయితేజ అకాల మరణం చిత్తూరు జిల్లా వాసులనే కాకుండా యావత్ తెలుగు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన సాయితేజకు తెలుగు ప్రజలు ఘనంగా నివాళి అర్పిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.