అసెంబ్లీ సమావేశాలు ఎందుకోసం?ఎవరి కోసం ?

Publish Date:Sep 13, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఏమి కోరుకుంటున్నారు? ఏమి ఆశిస్తున్నారు?  రాష్ట్ర శాసన సభ వేదికగా ముఖ్యమంత్రి చేసిన సుదీర్ఘ ప్రసంగం విన్న ఎవరికైనా, ఇదే అనుమానం వస్తుంది.  సోమవారం (సెప్టెంబర్ 12) కేవలం మూడు గంటల పాటు జరిగన సభలో సుమారు రెండు గంటలు సాగిన ముఖ్యమంత్రి ప్రసంగంలో, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కుంటున్న ఏ ఒక్క సమస్యనూ ప్రస్తావించలేదు.కేంద్ర ప్రభుతాన్ని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని విమర్శించడం కోసమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారా,  అనే అనుమానం వచ్చే విధంగా ముఖ్యమంత్రి ప్రసంగం సాగింది.  

పోనీ, అందులో అయినా ఏదైనా  కొత్త విషయం వుందా? అంటే, అదీ లేదు. ఇప్పటికే, పార్టీ వేదికలు,బహిరంగ సభలు, విలేకరుల సమావేశాలలో ఒకటికి పదిసార్లు ఏకరవు పెట్టిన విషయాలనే, అసెంబ్లీ వేదికగా మరో సారి ఏకరవు పెట్టారు. నిజమే కావచ్చును,కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి, దేశానికి ప్రమాదకరంగా పరిణమించిందని, ముఖ్యమంత్రి భావిస్తే భావించవచ్చును. ఆయన జాతీయ పార్టీ పెట్టి దేశాన్నిప్రగతి పథంలో ముందుకు తీసుకుపోదామనుకుంటే, అందుకు కూడా ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఆయన ప్రధాన మంత్రి కావాలనుకుంటే కాదనే వారుండరు. గుజరాత్ ముఖ్యంత్రిగా మోడీ ఎలాంటి పాలన అందించారో ఏమో కానీ, దేశ ప్రజలు ఆమోదిస్తేనే ఆయన ప్రధాని అయ్యారు. అలాగే రేపు దేశ ప్రజలు ఆమోదిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రధాని కావచ్చును. అందుకు ఎవరూ అభ్యతరం చెప్పరు.  

కానీ, అందుకోసం తెలంగాణ శాసన సభను ప్రచార వేదిక చేసుకోవడం, ఏమిటనేదే సామాన్య ప్రజలు అడుగుతున్నప్రశ్న. ఆరు నెలల తర్వాత, అది కూడా కేవలం రెండే రెండు రోజులు (మొదటి రోజు  సంతాప తీర్మానాలతో సభ వాయిదా పడింది) శాసన సభ జరుగతున్న వేళ రాష్ట్రంలో సమస్యలే లేవన్నట్లు, ముఖ్యంత్రి రాజేకీయ ప్రసంగం చేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు కొదవ లేదు?  ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా ‘జాతి’ ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం (కేంద్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వం) విఫలమైందని ఆరోపిస్తూ,ఇంచు మించుగా రెండు నెలలకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న వీఆర్‌ఏలు, బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసాల ముట్టడికి ప్రయత్నించారు. రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

బంజారాహిల్స్‌ పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అలాగే జిల్లా నుంచి హైదరాబాద్ వస్తున్న వీఆర్ఏలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినట్లు వీఆర్ఎ జేఏసీ ఆరోపిస్తోంది. నిజానికి వీఆర్‌ఏల జేఏసీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాత్రమే కోరుతున్నామని జేఏసీ ప్రధాన కార్యదర్శి ఎస్కే దాదెమియా తెలిపారు. అంతేకాదు  ప్రభుత్వం తమను చర్చలకు పిలిచి, సమస్యలు పరిష్కరించి, సమ్మె విరమింప చేసేందుకు చర్యలు తీసుకోవాలని మాత్రమే కోరుతున్నామన్నారు.

రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న ఉద్యోగులను చర్చలకు పిలకుండా, అరెస్టులు, అక్రమ నిర్బంధాలతో ఆందోళనను అంచి వేయాలనుకోవడం, ఎంత వరకు సమంజసం? అది ఎలాంటి ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది? ఇది ఏ మోడల్ పాలనకు సంకేతం అవుతుందని వీఆర్ఏలే కాదు సామాన్యులు కూడా అడుగుతున్న ప్రశ్న. గతంలో ఆర్టీసీ ఉద్యోగుల  సమ్మె విషయంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే అణచివేత విధానాలను అవలంబించిన నేపధ్యాన్ని జేఏసీ నేతలు గుర్తు చేస్తున్నారు. అంతే కాదు, ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నదని వీఆర్ఏలు ప్రశ్నిస్తున్నారు. నిజానికి, ప్రభుత్వ వైఖరికి విసిగిపోయిన వీఆర్ఏలో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా సర్కార్ లో చంలనం లేక పోగా, స్వయంగా ముఖ్యమంత్రి వీఆర్‌ఏల ఆందోళన  అర్థంలేని ఆందోళన అంటూ  ఆగ్రహం వ్యక్తం చేశారు. కావచ్చు, వారిది అర్థం లేని ఆందోళన అయినా కావచ్చును, కానీ, ప్రజస్వామ్య పద్దతిలో వారిని చర్చలకు పిలిచి సమస్యను చర్చించడంలో తప్పేముందని, తెరాస ఎమ్మెల్యేలు కూడా ప్రశ్నిస్తున్నారు.  

నిజానికి, ఒక్క వీఆర్ఏ సమస్యనే కాదు, ధరణి సమస్యకు బడుగు రైతులు బలవుతున్నారు. అన్నిటినీ మించి, సంక్షేమ హాస్టళ్ల  విద్యార్ధులు, విద్యాశాఖ మంత్రి   సబితా ఇంద్రా రెడ్డి చెప్పినట్లుగా ‘సిల్లీ’ సమస్యలతో చచ్చిపోతున్నారు. వర్ధన్న పేట గురుకుల హాస్టల్ లో కలుషిత ఆహరం తిని 60 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. అందులో పది మంది విద్యార్ధులు ఇప్పటికీ ఇంకా  కోలుకో లేదు. చికిత్స పొందుతున్నారు. ఈ మధ్యనే కామరెడ్డి జిల్లాలోని ఓ బీసీ హాస్టల్ లో ఓ చిన్నారి పాము కరిచి కన్నుమూసింది. ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధులు, ఎదుర్కుంటున్న సిల్లీ సమస్యల గురించి అయితే చెప్పనే అక్కరలేదు. కలుషిత ఆహారం కారణంగా ఒక విద్యార్థి చనిపోయారు. వందల మంది పిల్లలు తీవ్ర అస్వత్తకు గురయ్యారు.  అసఫాబాద్ లో ఒక డిగ్రీ విద్యార్ధిని చని పోయారు. మరో నలుగురు చిన్నారులు చనిపోయారు.

పరిగిలో వందమందికి పైగా పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. సంక్షేమ హాస్టల్స్ పరిస్థితి ఇంట అద్వాన్నంగా ఉంటే, అసెంబ్లీలో చర్చ ఉండదు. కాంగ్రెస్ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించినా ముఖ్యమంత్రి పట్టించుకోరు. సభా ముఖంగా ఒక హామీ ఇవ్వరు.. ఇదేమి తీరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఇవి మాత్రమే కాదు, చెప్పుకుంటూ పోతే .. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల చిట్టా ఇంకా వుంది.. కానీ, ముఖ్యమంత్రి ఆలోచనలు మాత్రం మరోలా ఉన్నాయి ..

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.