కోస్తాంధ్ర తీరంలో అలల కల్లోలం- ‘అసని’ తుపాను బీభత్సం

Publish Date:May 11, 2022

Advertisement

మచిలీపట్నానికి ఆగ్నేయంగా కేంద్రీకృతమైన ‘అసని’ తీవ్ర తుపాను బలహీపడి తుపానుగా మారింది. అయితే.. కోస్తాంధ్ర తీరంలో అసని తుపాను తీవ్ర అలజడి రేపుతోంది. తీరాన్ని తాకక ముందే ఐదుసార్లు దిశ మార్చుకుని భయపెట్టింది. ప్రస్తుతం అసని తుపాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఈశాన్యం దిశగా కదులుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో పూర్తిగా భూభాగం మీదకు వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాను కారణంగా ఏపీలోని అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

అసని తుపాను అలజడి కారణంగా వాతావరణశాఖ అధికారులు ఉత్తరాంధ్రలో హై అలెర్ట్ ప్రకటించారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేడు అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. కోనసీమ జిల్లాలోని అంతర్వేది, శంకరగుప్తం, ఓడరేవు తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం, గాలుల తీవ్రత కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరిపంటకు భారీగా నష్టం వాటిల్లింది. అసని తుపాను తీవ్రత దృష్ట్యా నేడు ఏపీలో జరగాల్సిన ఇంటర్ పరీక్షను వాయిదా వేశారు. తుపాను ప్రభావంతో ఒడిశా తీరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. గంటకు 85 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వారు వెల్లడించారు. అసని తుపాను ఎఫెక్ట్ తో 37 రైళ్లను రద్దు చేశారు. తుపాను తీవ్రత నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు.

తుపాను ఎఫెక్ట్ తో మచిలీపట్నం సమీపంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదారి, పశ్చిమ గోదారి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు వస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రకాశం జిల్లా సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో ప్రచండమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. తుపాను కారణంగా కాకినాడ, విశాఖ పోర్టుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10 జారీ చేశారు. కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. మత్స్యకారులు ఎవరూ మే 12 వరకు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లొద్దని వాతావారణశాక హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల రోడ్డు దెబ్బతిన్నాయి. అరటి, బొప్పాయి, వరి పంటలు బాగా దెబ్బతిన్నాయి.

అసని తుపాను ప్రభావం తెలంగాణపైన కూడా పడింది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలకు వాతావరణశాఖ ప్రాథమిక హెచ్చరిక జారీచేసింది.

అసని తుపానుపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్షించారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రెడీగా ఉంచారు. అసని తుపాను గురువారం ఉదయం నుండి మధ్యాహ్నం లోపల కాకినాడ- విశాఖపట్నం మధ్యా తీరాన్ని దాటుతుందని భారత వాతావరణశాఖ తెలిపింది.

By
en-us Political News

  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.