Publish Date:Feb 10, 2020
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన 24 గంటల తరువాత ఎన్నికల సంఘం పోలింగ్ శాతాన్ని తేల్చింది. మొత్తం మీద 62.59 శాతం పోలింగ్ నమోదైనట్లుగా ఈసీ ప్రకటించింది. అయితే ఈ ఆలస్యంపై ఆమాద్మీ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇంత ఆలస్యంగా పోలింగ్ శాతాన్ని ప్రకటించడం వెనుక మతలబు ఏంటని సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. అక్రమంగా ఈవీఎం లను తరలించి ఉంటారని ఆరోపిస్తున్నారు. పోలింగ్ ముగిసిన ఒక రోజు తరువాత ఓటింగ్ శాతాన్ని ప్రకటించడంపై ఆమాద్మీ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈసీ తీరు తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఎన్నికల సంఘం అధికారులు నిద్రపోతున్నారా? పోలింగ్ ముగిసిన 24 గంటల తరువాత ఓటింగ్ శాతాన్ని ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈవీఎం లు ట్యాంపర్ చేసే కుట్ర జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలను కూడా ఆప్ నేతలు పోస్టు చేసారు. బాబున పూర్ లోని ఓ పోలింగ్ స్టేషన్ లో కొన్ని ఈవీఎం లను వాడకుండా పక్కన పెట్టినట్లు తాము గుర్తించామని ఆప్ నేత సంజయ్ సింగ్ తెలిపారు.
ఎన్నికల సంఘం అధికారులు మాత్రం ఆప్ నేతల ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు. ఖచ్చితమైన సమాచారం అందించడం కోసమే ఆలస్యం జరిగిందని కొన్ని చోట్ల పోలింగ్ సమయం ముగిసిన తరువాత కూడా ఓటర్లు క్యూలో నిల్చోవడం వల్ల పోలింగ్ శాతంపై క్లారిటీ రాలేదన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత రాత్రి 10 గంటల 17 నిమిషాలకు 61.43 శాతం పోలింగ్ జరిగినట్లు తాము యాప్ లో అప్ డేట్ చేసినట్టు ఎన్నికల సంఘం అధికారి రణవీర్ సింగ్ చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు ఈసీకి సంబంధించిన యాప్ లో అప్ డేట్ చేస్తూ వచ్చారు. కాని, వాస్తవ పరిస్థితుల కంటే అందులో పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. మొత్తం డేటా ఎన్నికల సంఘానికి వచ్చి దానిని అనలైజ్ చేసేసరికి ఆలస్యమైందని అందుకే పోలింగ్ శాతాన్ని ఆలస్యంగా ప్రకటించామని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.
2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 67.5 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి దాదాపు 5 శాతం పోలింగ్ తగ్గింది. ఢిల్లీలో మొత్తం డెబ్బై స్థానాలకు పోలింగ్ జరగ్గా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 67 స్థానాలను గెలుచుకుంది. ఈసారి కూడా కేజ్రివాల్ సీఎంగా పగ్గాలు చేపడతారని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఈ నెల పదకొండున అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/arvind-kejriwal-slams-ec-over-delay-in-final-voter-turnout-25-94037.html
బీజేపీ డబుల్ ఇంజిన పవర్ అంటూ కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వమే ఉంటే ప్రగతి స్పీడందుకుంటుందని ఊదరగొట్టేస్తోంది.
విజయసాయి రెడ్డి.. చాలా కాలం తరువాత అమరావతిలో వైపీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ అనుబంధ సంఘాల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలే ఇప్పడు పార్టీ వర్గాల్లోనూ, రాజకీయ సర్కిల్స్ లోనూ ఓ రేంజ్ లో చర్చకు తావిచ్చాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన జాతీయ ఆకాంక్షలను వదులుకుని మరీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనం వహించినా కుమార్తెకు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇసుమంతైనా ఊరట కలిగించలేకపోయారు.
తెలుగుదేశం పార్టీతో కేశినేని నాని తెగతెంపులు ఖాయమైనట్లే కనిపిస్తున్నాయి. అయితే నాని ఆరోపిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీయే పొమ్మనలేక పొగపెట్టిందా? లేక పార్టీలో తమ్ముడు చిన్ని ఎదుగుదలను ఓర్వలేక తానే పొగపెట్టుకున్నాడా అంటే.. వేళ్లన్నీ కేశినేని నానివైపే చూపుతున్నాయనడంలో సందేహం లేదు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం, బెయిలుపై విడుదల చేయడం అన్నీ జరిగిపోయాయి. అయితే ఈ విషయాన్ని అటు అవినాష్ రెడ్డి.. ఇటు సీబీఐ కూడా అత్యంత గోప్యంగా ఉంచారు.
ఇప్పటి జనరేషన్ కు ఫఓన్ అంటే మొబైల్ అని మాత్రమే తెలుసు. 1980కి ముందు ప్రపంచాన్ని చూసిన వారికి ఫఓన్ అనే పరికరం మాత్రమే తెలుసు.
వారం రోజులు ఆలస్యం అయితే అయ్యింది కానీ ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి.
వైసీపీ అధినేత జగన్ పార్టీ క్యాడర్ నమ్మకాన్ని చూరగొనడంలో విఫలమయ్యారా? అంటే ఆ పార్టీ శ్రేణులు అవుననే అంటున్నారు. రాష్ట్రంలో పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర ప్రజావ్యతిరేకత వెనుక పార్టీ అధినాయకుడు క్యాడర్ విశ్వాసం కోల్పోవడం కూడా ఒక ప్రధాన కారణమని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డి తల్లి విజయమ్మ బుధవారం (జూన్ 7) అమరావతిలోని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నివాసానికి వెళ్లారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని హస్తం పార్టీ ఇచ్చినా.. కొట్లాడి తెచ్చింది మాత్రం నేనేనంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ బహిరంగంగానే ప్రకటించారు. అలా ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన క్రెడిట్ కొట్టేసి.. వరుస ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలో కొనసాగుతున్నారు
వివాదాలు సృష్టించి సినిమా సక్సెస్ కు బాటలు వేసుకోవడమన్నది కొత్త విషయమేమీ కాదు. ఈ విషయంలో ఆర్జీవీగా పిలవబడే రామగోపాల్ వర్మ అందరి కంటే రెండాకులు ఎక్కువే చదివాడని అంతా అనుకుంటారు.
విశ్వాసం పట్టుదల కలగలిసి సాగుతున్న నారాలోకేష్ యువగళం పాదయాత్ర రాయలసీమ నాలుగు జిల్లాలనూ చుట్టేసింది. మరో మూడు నాలుగు రోజులలో సీమలో లోకేష్ పాదయాత్ర పూర్తి అవుతుంది.
మాహిష్మతీ ఊపిరి పీల్చుకో.. నా కొడుకు వచ్చాడు, బాహుబలి తిరిగి వచ్చాడు. బాహుబలి సినిమాలో ఒక పవర్ ఫుల్ డైలాగ్ ఇది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు దాదాపుగా ఇలాంటి డైలాగ్ నే నినాదంగా మార్చుకున్నారు. తెలంగాణా ఊపిరి పీల్చుకో.. సోనియమ్మ బిడ్డ వస్తోంది. ప్రియాంక గాంధీ వస్తోంది అంటున్నారు.