ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. ఎక్కడా తగ్గేదే లే అన్నట్లుగా ఆధునిక సాంకేతికతను ఆధారం చేసుకుని మరీ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసిన సీఐడీ తాజాగా ఆయన పీఏ దిలీప్ ను అదుపులోనికి తీసుకుంది. అంతకు ముందే వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని విచారించింది.
ఈ అరెస్టుల పర్వం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది. మద్యం కుంభకోణం తీగ లాగితే తాడేపల్లి ప్యాలస్ డొంక కదులుతుందన్న భయం వైసీపీలో కనిపిస్తోంది. రాజ్ కేసిరెడ్డి అరెస్టుతో జగన్ పార్టీ కీలక నేతలతో తాడేపల్లి ప్యాలెస్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి హడావుడిగా పొలిటికల్ అఫైర్స్ కమిటీని వేయడం చూస్తుంటే.. మద్యం కుంభకోణం కేసులో తానూ జైలుకు వెళ్లక తప్పదన్న భయంలో ఆయన ఉన్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.
ఇక ఈ కేసులో నాలుగు మార్లు నోటీసులు అందుకుని కూడా విచారణకు డుమ్మా కొట్టి విదేశాలకు చెక్కేయాలని స్కెచ్ వేసుకున్న రాజ్ కసిరెడ్డిని ఆయన గోవా నుంచి వస్తున్నట్లుగా అందిన కచ్చితమైన సమాచారంతో శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. రాజ్ కేసిరెడ్డి శంషాబాద్ నుంచి మారుపేరుతో చెన్నై అక్కడ నుంచి విదేశాలకు చెక్కేయడానికి పక్కా ప్రణాళిక రచించుకున్నట్లు సీఐడీ పసిగట్టింది. ఇక కోర్టు కూడా రాజ్ కేసిరెడ్డిని ఏడు రోజుల సీఐడీ కస్టడీకి అప్పగించడంతో ఈ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. ఇక రాజ్ కేసిరెడ్డి పీఎ దిలీప్ అరెస్టు కూడా విమానాశ్రయంలోనే ఉంది. విచారణకు గైర్హాజర్ కావడమే కాకుండా దుబాయ్ పారిపోవడానికి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న దిలీప్ ను సీఐడీ అరెస్టు చేసింది. అతని కదలికలపై నిఘా పెట్టిన సీఐడీ, అతడి ఫోన్ లోకేషన్ ఆధారంగా చెన్నై విమానాశ్రయంలో అదుపులోనికి తీసుకుని విజయవాడ తరలించారు. రాజ్ కేసిరెడ్డిని సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతించడం, దిలీప్ పోలసులకు చిక్కడంతో లిక్కర్ స్కాం కు సంబంధించి కీలక సమాచారం లభించడానికి సీఐడీకి మంచి అవకాశం లభించినట్లైందని పరిశీలకులు అంటున్నారు. ఈ అరెస్టుల నేపథ్యంలో మద్యం కుంభకోణంతో తాడేపల్లి ప్యాలెస్ లింకులు బయటపడతాయన్న భయం వైసీపీ అగ్రనాయకత్వంలో వ్యక్తమౌతోందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/arrests-inandhrapradesh-liquor-scam-39-197313.html
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.