బిల్లులు చెల్లించని జగన్ సర్కార్.. ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్!?

Publish Date:May 2, 2024

Advertisement

జగన్ సంక్షేమ పథకాలన్నీ డొల్లే. అందుకు ఉదాహరణగా ఆరోగ్య శ్రీ పథకాన్ని చెప్పుకోవలసి ఉంటుంది.  ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులైనవారికి ఉచితంగా చికిత్స పొందే విలువను రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంది. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇస్తున్నట్లు జగన్ ఆర్భాటంగా ప్రకటించారు. ఇందుకోసం కొత్త కార్డులను సైతం పంపిణీ చేశారు. ఇందులోనూ జగన్ పొటోల పిచ్చిని మరోసారి చాటుకున్నారు.   ఈ కొత్త కార్డులపై జగన్ ఫోటోలను ముద్రించి మరీ పంచారు.   ఈ కార్డుల పంపిణీ ఈ ఏడాది జనవరి వరకూ సాగింది.  జగన్ మోహన్ రెడ్డిని పేదల పాలిట పెన్నిధిగా, అప్బాధబాంధవుడిగా వైసీపీ నేతలు భజనగీతాలు ఆలపించేశారు కూడా.   అయితే,  రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఎన్ని ఆసుపత్రులలో అందుబాటులో ఉంది? ఏ జిల్లాలో ఏ ఆసుపత్రులలో ఈ వైద్య సేవ అమలు చేస్తున్నారు? ఆరోగ్యశ్రీ కింద ఎన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు? వైద్య పరీక్షలు, వైద్యం, అనంతరం తగిన మందులు కూడా ఆరోగ్యశ్రీలో భాగంగానే అందిస్తారా? మారిన ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి విధి విధానాలు ఆరోగ్యశ్రీ అమల్లో ఉన్న ఆసుపత్రులకు అందించారా? అనేదానిపై మాత్రం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. అలాగే అసలు ఆసుపత్రులకు ఆరోగ్య శ్రీ బిల్లుల బకాయిలను సకాలంలో చెల్లిస్తున్నారా? ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఆరోగ్య శ్రీ పథకానికి ఎన్ని నిధులు కేటాయించారు? ఈ పథకాన్ని ఎంత మంది ప్రజలు వినియోగించుకున్నారు? జగన్ హయంలో ఇప్పటి వరకూ చెల్లించిన ఆరోగ్య శ్రీ నిధులెన్ని?  ఇప్పుడు ఎన్ని బకాయిలున్నాయన్నది కూడా జగన్ సర్కార్ రహస్యంగానే ఉంచింది.

వాస్తవానికి   జగన్ ప్రభుత్వ హయంలో ఆసుపత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలు కొండలా పేరుకుపోయాయి. ఒక్కో ఆసుపత్రికి కోటాను కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుడు హయం వరకూ కాస్త ఆలస్యంగానైనా ఏ ఏడాదికి ఆ ఏడాది ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించే వారు. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ సర్కార్ ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపును పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. పలుమార్పు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వ పెద్దలు బెదిరింపులకు దిగారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే రావాల్సిన బకాయిల సంగతెలా ఉన్నా.. ఇకపై తమకు ఆరోగ్యశ్రీనే వద్దంటూ కొన్ని ఆసుపత్రులను ఈ సేవ నుండి బయటకొచ్చేశాయి. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవ తమ ఆసుపత్రికి కావాలంటూ దరఖాస్తుల వెల్లువ రాగా.. ఈ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలో ఉన్న ఆసుపత్రులే బయటకి వచ్చేశాయి.

 ఇక మరికొన్ని ఆసుపత్రులలో అయితే కేవలం వైద్యం మాత్రమే ఆరోగ్య శ్రీలో అందిస్తుండగా.. మిగతా వైద్య పరీక్షలు, మందులు వంటి వాటి కోసం  రోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. కొన్ని ఆసుపత్రులలో అయితే ఆసుపత్రులలో అన్ని పరీక్షలు చేసే సదుపాయం ఉన్నా.. బకాయిలు రాక ఆరోగ్యశ్రీ పేషేంట్లను బయట ల్యాబులకు పంపి పరీక్షలు చేయిస్తున్నారు. కేవలం డాక్టర్ల ఫీజులు, ఆసుపత్రి రూమ్ అద్దెలు వంటివి మాత్రమే ఆరోగ్యశ్రీలో అందిస్తున్నారు. వాటికి ఆసుపత్రుల యాజమాన్యాలు పెట్టుబడులు పెట్టే అవసరం లేకపోవడంతో.. ప్రభుత్వం నుండి బకాయిలు ఎప్పుడొచ్చినా తమకి నష్టం ఉండదన్న ఆలోచనతో ఇలా ఆరోగ్యశ్రీలో కొనసాగుతున్నాయి. ఎక్కువ శాతం ఆసుపత్రులైతే ప్రభుత్వం మారకపోతుందా.. కొత్త ప్రభుత్వంలో అయినా బిల్లులు రాకపోతాయా అని కొనసాగుతున్నారు.    

ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయి. బకాయిలు కొండల్లా పేరుకుపోవడంతో  ఆంధ్రప్రదేశ్ లోని స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఈ మేరకు ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈవోకు లేఖ రాసింది.   గత ఆరు నెలలుగా ప్రభుత్వం   ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించకపోవడం, బకాయిలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆరోగ్య శ్రీ సేవలను ఇక అందించలేమన్నదే ఆ లేఖ సారాశం. ప్రభుత్వం గత ఆరునెలలుగా ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో ఆస్పత్రులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయనీ, ఇంకెంత మాత్రం ఆరోగ్య శ్రీ పథకం కింద తమ ఆస్పత్రులలో వైద్య సేవలు అందించలేమనీ ఆ అసోసియేషన్ ఆ లేఖలో పేర్కొంది. తక్షణమే పెండింగ్ బిల్లులను చెల్లించనట్లైతే శనివారం (మే4) నుంచి తమ ఆస్పత్రులలో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆ లేఖలో స్పష్టం చేసింది.   

తనను తాను అత్యంత సమర్ధవంతమైన ముఖ్యమంత్రిగా, పేదల సంక్షేమం కోసం ఏ ముఖ్యమంత్రీ అమలు చేయని విధంగా పథకాలు అమలు చేస్తున్నట్లు ఆత్మస్థుతిలో మునిగి తేలే జగన్ హయాంలో పేదల ఆరోగ్యం ఎంత నిర్లక్ష్యానికి గురైందనడానికి గత ఆరు నెలలుగా ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులను నిలిపివేయడమే నిదర్శనం. ఇక ఇప్పుడు ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలను ఇక కొనసాగించలేమంటూ చేతులెత్తేశాయి.  

By
en-us Political News

  
 ప్రజలు ఏం కోల్పోయారో తెలుసుకున్నారు. బిఆర్ఎస్ నేతలు హైరానా పడాల్సిన పని లేదు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది అని మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ ప్రెసిడెంట్ కెసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. ఆ పార్టీలో పని చేసే కార్యకర్తలకు సముచిత గుర్తింపు లభిస్తుంది. కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించిన తొలి పార్టీ దేశంలో తెలుగుదేశమే. అలాగే మరణించిన తెలుగుదేశం కార్యకర్తల పిల్లల బాధ్యత పార్టీయే తీసుకుని వారికి నాణ్యమైన విద్యను అందిస్తున్న పార్టీ కూడా తెలుగుదేశమే.
ఏపీలో సీఎం చంద్రబాబు సీ ప్లేన్లో విజయవాడ లోని పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వెళ్లారు. అసలీ సీ ప్లేన్ అంటే ఏమిటన్న ఆసక్తి రాష్ట్ర ప్రజలలో ఉంది. తీరా చంద్రబాబు ఈ సీప్లేన్ సర్వీసులను లాంఛనంగా ప్రారంభించి.. ఆ సీప్లేన్ లో ప్రయాణించిన తరువాత.. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సీప్లేన్ పై చర్చ మొదలైంది.
పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో శనివారం జరిగిన భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో   24 మంది  దుర్మరణం చెందారు.  40 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో  స్టేషన్ రద్దీగా ఉంది
వైసీపీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పనున్నారా? అంటే అవుననే వినిపిస్తోంది. జగన్ తొలి కేబినెట్ లో మంత్రిగా పని చేసిన కురసాల కన్నబాబు వైపీపీని వీడనున్నరని గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం కాకినాడ జిల్లా వైసీపీ అద్యక్షుడిగా ఉన్న కురసాల కన్నబాబు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటమే కాకుండా పార్టీ క్యాడర్ కు కూడా అందుబాటులోకి రావడం లేదు.
ఏపీలో పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం కూటమి సీప్లేన్ సర్వీస్ కు శ్రీకారం చుట్టింది. ఈ సర్వీస్ ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం (నవంబర్ 9)న ప్రారంభించారు. ఆ సందర్భంగా విజయవాడలోని పున్నమిఘాట్‌ నుంచి సీప్లేన్‌ను ప్రారంభించి అందులో ప్రయాణించి శ్రీశైలం చేరుకున్నారు.
ఏపీలో 59 మందితో నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదలైంది. ఈ సారి బీజేపీకి చెందిన ఇద్దరికి ఈ జాబితాలో చోటు దక్కింది. అలాగే 15 మంది జనసేన నేతలకు అవకాశం లభించింది. గత ఎన్నికలలో సీట్లు త్యాగం చేసిన నేతలు, మీడియాలో తెలుగుదేశం భావజాలాన్ని బలంగా వ్యక్తం చేసిన వారికి, అలాగే విపక్షంలో ఉండగా అప్పటి అధికార వైసీపీ దాడులను ఎదుర్కొన్న వారికి ఈ సారి జాబితాలో స్థానం కల్పించారు.
ఎపిలో శ్రీకాళహస్తిలో హల్ చల్ చేసిన అఘోరీ తాజాగా   నంద్యాలజిల్లా పాణ్యం మండలం బలపనూరులో మరోసారి కనిపించారు. ఎపిలో వరుసగా శైవక్షేత్రాలను దర్శించుకుంటున్న అఘోరీ శనివారం నంద్యాల రోడ్డుపై బైఠాయించారు.
 కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఒక దఫా జాబితా వచ్చిన సంగతి తెలిసిందే. రెండో జాబితాను 59  మందితో ఎపి ప్రభుత్వం విడుదల చేసింది. వీరిలో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కూడా ఉన్నారు.  ఆయనకు కేబినేట్ ర్యాంకు  దక్కింది. 
 జాఫర్ బాయ్ కొడుకు ఫజల్ బాబా డ్రగ్స్ కు అలవాటయ్యాడు. ఆందోళన చెందిన జాఫర్ భాయ్ కొడుకును ప్రతీరోజు చితకబాదేవాడు. ఫజల్ బాబా తల్లి జాఫర్ భాయ్ ను వెంటపెట్టుకుని ఒక రోజు మౌలానా దగ్గరికి వచ్చింది.
అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ చేతిలో చావు దెబ్బ‌తిన్న వైసీపీ ఖేల్ ఇక ఖ‌తం కాబోతోందా? ఏపీలో ఐదేళ్లు అరాచ‌క పాల‌న సాగించిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. త్వ‌ర‌లో త‌న దుకాణం మూసేయనున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తోంది. సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అడుగులు వేగంగా వేస్తున్నది.
 గత వైసీపీ ప్రభుత్వ హాయంలో మాదకద్రవ్యాలకు ఎపి హబ్ గా మారిందని డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. విశాఖ సీ పోర్ట్ ని లో 25 కిలోల  గంజాయి కంటైనర్ సిబిఐ స్వాధీనం చేసుకున్నప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇంతవరకు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలేదని పవన్ కళ్యాణ్ కేంద్ర హోమంత్రి అమిత్ షాకు ట్వీట్ చేశారు
చిన్న స్థాయి నుంచి కన్స్ట్రక్షన్ రంగంలో అగ్రగామిగా ఎదిగిన మై హోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు, ఆయన కుమారుడు, సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ జూపల్లి రామురావు ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.