అప్పు కోసం ప్రజలపై పన్నుల భారం! తెలుగు ముఖ్యమంత్రుల ఇష్టారాజ్యం 

Publish Date:Jan 8, 2021

Advertisement

అంధ్రప్రదేశ్ కు 2 వేల ఐదు వందల కోట్లు.. తెలంగాణకు 2 వేల 508 కోట్ల రూపాయల అదనపు రుణం తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దేశంలో మధ్యప్రదేశ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకే కేంద్రం ఈ అవకాశం ఇచ్చింది. అయితే ఇది తెలుగు రాష్ట్రాలపై ప్రేమతో కేంద్రం ఇవ్వలేదు. కరోనాతో  ఎదురైన ఆర్థి ఇబ్బందులు తీర్చేందుకు కూడా కాదు. కరోనా  కష్టకాలంలోనూ    ప్రజలపై పన్నుల మోత  మోపినందుకు మెచ్చి .. జగన్ రెడ్డి, కేసీఆర్  ప్రభుత్వాలకు నరేంద్ర మోడీ సర్కార్ ఇచ్చిన వరమిది. ప్రజలకు మరిన్ని పాట్లు కల్పిస్తూ పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలు చేసినందుకే..  ఓపెన్ మార్కెట్ రుణాల ద్వారా  రుణం తీసుకునేందుకు కేంద్రం ఓకే చెప్పింది. పట్టణ సంస్కరణలు అమలు చేయడానికి ఏపీ , తెలంగాణ ప్రభుత్వాలు అంగీకరించడం వల్లే అదనపు రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చామని కేంద్రమే స్వయంగా ప్రకటించింది. 

కేంద్రం ఇచ్చే ఈ అదనపు రుణం తీసుకునే అనుమతి కోసమే  జగన్ సర్కార్  పట్టణాల్లో  పన్నుల మోత మోగించింది. ఆస్తి పన్నును రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పెంచి మార్చి నెల నుంచి అమలు చేయబోతోంది. ఇకపై  ఆ పన్నును ఏటేటా పెంచుకుంటూ పోనుంది.  కేంద్ర ఆర్థిక శాఖ  అనేక సంస్కరణలను నిర్ణయించింది. అందులో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం ఒకటి. తాగునీరు, డ్రైనేజీ, ఆస్తులపై ప్రతి ఏటా పన్నులు పెంచాల్సి ఉంటుంది. సంస్కరణలు తెస్తేనేఅప్పులిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో అప్పుల కోసం.. దేనికైనా రెడీ అన్నట్లుగా ఉన్న ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అన్నింటినీ అమలు చేయడానికి సిద్ధమయింది. పట్టణ, స్థానిక సంస్థల సంస్కరణలకు అంగీకరించాయి. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మొదట ఇందుకు వ్యతిరేకించినా.. తాజాగా తెలంగాణ సర్కార్ కూడా  వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు సిద్ధమవుతోంది. 

 కేంద్రం చెప్పినట్లు సంస్కరణలు అమలు చేస్తుండటంతో ఏపీలోని  పట్టణాల్లో ఇకపై పన్నుల మోత మోగబోతుంది. 15 శాతం మాత్రమే పెంచామని ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతున్నా.. ఐదేళ్లలో ఇది ఐదు సార్లు పెరిగేలా జీవోలో పొందుపరిచారు. సొంతింటి యజమానికి పన్ను పెరిగితే ఆ భారం అద్దెకు ఉండే వారిపై కూడా పడుతుంది. వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు పౌర సమాజం అంతా ఆ భారాలను ప్రతి ఏడాదీ కొంత చొప్పున మోయక తప్పదు.  పట్టాలు లేకుండా ప్రభుత్వ భూముల్లో ఉండేవారు, ప్లాన్‌ లేకుండా ఇల్లు కట్టుకున్న వారు వందకు వందశాతం పెరిగిన పన్ను చెల్లించాల్సిందే. నిజానికి ఏపీలో విజయవాడ, విశాఖపట్టణం మాత్రమే ఓ మాదిరి నగరాలుగా ఉన్నాయి. మిగతావన్నీ పేరుకు పట్టణాలే కానీ ఎక్కువగా గ్రామాల లక్షణాలతోనే ఉంటాయి. వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సినవి ఎన్నో ఉన్నాయి. కానీ పన్నులు బాదేయడం కోసం వాటిని మున్సిపాల్టీలుగా ప్రకటించేస్తున్నాయి. తెలంగాణలోనూ కేసీఆర్ సర్కార్ ఇదే చేసింది. 10 వేల జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను కూడా మున్సిపాల్టిగా మార్చేసింది. 

 తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కూడా ఇటీవల ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం తీసుకొచ్చింది. ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియ చేపట్టింది. కాని విపక్షాల ఆరోపణలు, ఎన్నికల్లో ఓటమితో మళ్లీ వెనక్కి తగ్గింది. అయితే కేంద్ర సంస్కరణల్లో భాగంగానే మరిన్ని అప్పులు తీసుకోవడం కోసమే కేసీఆర్ సర్కార్ ఈ పథకాల అమలుకు ప్లాన్ చేసిందనే ప్రచారం జరుగుతోంది. గత ఆరేండ్లలో కోట్లాది రూపాయల అప్పులు చేసింది కేసీఆర్ సర్కార్. రుణ పరిమితి మించడంతో చేసేది లేక కేంద్రం చెప్పినట్లు చేస్తోంది.  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు రుణభారంలో కూరుకుపోయాయి. ఏపీ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఏపీ అప్పులు గత నవంబర్ నాటికే రూ. 3.74 లక్షల కోట్లకు చేరిందని కాగ్ ఇటీవలే నివేదిక ఇచ్చింది. ఒక్క నవంబర్ నెలలోనే ఏకంగా 17 వేల కోట్ల రుణం తీసుకుంది. ఏపీలో ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్న అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ అప్పులు కూడా రూ. 3 లక్షల కోట్ల దాటాయి. 

కేంద్రం ఇచ్చే అప్పుల కోసం  ఆస్తి పన్నుల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వాలు  చీకటి చట్టాలను తీసుకొచ్చాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ చట్టాల అమల్లో భాగంగానే ఆస్తి విలువ ఆధారంగా పట్టణాల్లో పన్నులు విధించిందని మండిపడుతున్నాయి. అడ్డగోలుగా అప్పులు చేసి .. ఇప్పుడు ప్రజలపై భారం మోపడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. అప్పు కావాలంటే ఆస్తి విలువ ఆధారంగా పన్నులు పెంచాలని కేంద్రం ఆదేశిస్తే ఇక్కడున్న ప్రభుత్వాలు  అమలు చేసేందుకు అసెంబ్లీలో చట్టాలు  చేయడం దుర్మార్గమంటున్నారు ప్రతిపక్ష నేతలు.  ఏ నగరంలో, ఏ పట్టణంలో ఎంత పన్ను ఉండాలో ఢిల్లీలో ఉన్న మోడీ, అమరావతిలో ఉన్న జగన్‌ నిర్ణయించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటున్నారు ఏపీ టీడీపీ నేతలు.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.