చంద్రబాబుకు కేంద్రం ఝలక్.. జగన్ కు ఛాన్స్ దొరికిందోచ్..
Publish Date:Apr 30, 2016
Advertisement
కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పకనే చెప్పింది. నిన్న రాజ్యసభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో కేంద్ర మంత్రి హోం శాఖ సహాయ మంత్రి హెచ్పీ చౌదరి ప్రత్యేక హోదాపై చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే ఈ విషయం అర్ధమవుతోంది. అయితే ఇప్పుడు వరుస ఎమ్మెల్యేల వలసలతో సతమతమవుతున్న వైసీపీ పార్టీ అధినేత జగన్ కు మాత్రం మంచి అవకాశం దొరికింది. ప్రత్యేక హోదా అనే అస్త్రంతో టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రత్యేక హోదా పై జగన్ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని టీడీపీ, బీజేపీ నేతలు స్పష్టమైన హామీ ఇచ్చారు.. పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో చేర్చారు.. ఇప్పుడు అది కుదరదని చెబుతున్నారని అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించేవారే లేరు.. ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్రం చెబుతోంది.. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు పెరుగుతాయి.. పరిశ్రమలు రాష్ట్రానికి క్యూ కడతాయి.. పారిశ్రామిక, విద్యుత్ రంగాల్లో ఎన్నో ఉపయోగాలు.. ఎక్సైజ్ సుంకాలు కట్టే అవసరం లేదు అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై కూడా విరుచుకు పడ్డారు.. పథకం ప్రకారమే ప్రత్యేక హోదాను చంద్రబాబు నీరు గారుస్తున్నారు.. చంద్రబాబు వ్యాఖ్యలతోనే కేంద్రం వెనక్కి తగ్గింది అని అన్నారు.
http://www.teluguone.com/news/content/ap-special-status-39-59451.html





